తమ ప్రజా పధకాల కోసం, నాయకుల ఆస్ధులు తాకట్టు పెట్టి, 7 కోట్ల పై ధనం ఉంటే దానం గా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,165; 104 తత్వాలు (Tatvaalu) and views 217,388.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

తమ ప్రజల కోసం, ప్రాణ త్యాగాలు చేస్తున్న (అని మాటలు చెపుతున్న) నాయకులు, మనకు గత 20 ఏళ్లు పై గా ఉన్నారు.

వీలైనంత వరకూ, తమ ఆస్తులు కదిలించ కుండా, రాష్ట్రం ను మరియు ప్రభుత్వ స్ధలాలు తాకట్టు పెట్టి, అమ్మి, లీజుకు ఇచ్చి, అభివృద్ధి చేస్తున్నామని, తమ పేర్లు కూడా పెట్టుకుని, నిస్సిగ్గు గా గొప్పలు చెపుతున్నారు.

చంద్రన్న తోఫా, ఆరోగ్యశ్రీ, పసుపు కుంకుమకు,

జగనన్న నవ రత్నాల కోసం,

కేసీయార్ పధకాల కోసం బంగారు తెలంగాణా కోసం,

తమ పార్టీ నాయకులు మరియు అనుచరులు, ఎంత ఆస్తి తాకట్టు పెట్టి మరియు సొంత ధనం పంచారు దానముగా? ఎవరి ఆస్తులు అయినా తగ్గాయా? మరి వాగ్దానం చేసిన మీవి తాకట్టు ఖర్చు పెట్టకుండా, రాష్ట్ర సంపదను ఎందుకు తాకట్టు పెడుతున్నారు?

ఇలా భూముల అమ్మి తాకట్టు పెట్టి, అభివ్రుద్ది చేయమంటే, ప్రతి ఊళ్ళో ఉన్న, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సరి పోరా, మనకు నాయకులుగా? అని ప్రజలు నోరు వెళ్ళబెడుతున్నారు.

పవనన్న వీరన్న అధికారం లో లేరు కాబట్టి, వారి సంగతి తర్వాత.

రాష్ట్ర సేవ కోసం, మా ధనం మా ఆస్తి ముందు తాకట్టు దానం, ఆ తర్వాతనే, రాష్ట్ర ఆస్తుల తాకట్టు, అనే మనసున్న ధైర్యమున్న చిత్తశుద్ది ఉన్న వారు ఏరి?

అందినంత మింగి ఆ తర్వాత, అత్త సొమ్ము అల్లుడు దానం అంటే, ప్రతి ఒక్కరు రేడీ నా?

లేనప్పుడు, సిగ్గు లేకుండా, మనము ఎందుకు మరలా మరలా ఎన్నుకుంటున్నాము?

ఒక పార్టీ తరపున, తాము చేసిన అలివికాని అపరిమిత సేవ చాలక, ఇంకో పార్టీ లోకి నేరుగా దూకో లేక కోవర్టు గా ఉండో, తమ కుటిల సేవలను తర తరాలు కొనసాగిస్తున్నారు.

ఊళ్ళోళ్ళ ధనము తో తాము చేస్తామన్న ప్రజా పధకాల కోసం, నాయకుల తమ సొంత ఆస్ధులు తాకట్టు కై ముందుకు రావాలని, తమ అనుచరులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు అందరినీ, తమ వాగ్ధానాల ఫలితాలు కోసం, రాష్ట్రం కోసం, పార్టీ కోసం,

చంద్రన్న మరియు జగనన్న క్షేమం కోసం, తమ ఎన్నికల అఫిడవిట్ లో 7 (లేదా 10 అనుకోండి) కోట్ల పైన ఉన్న ధనం మొత్తం ను దానం గా, రాష్ట్ర అభివృద్ధి కి ఇవ్వాలని,

లేదంటే, ఎమ్మెల్యే ఎంపీ మంత్రి గా, రాజీనామా చేయాలని, అందుకు సిద్ధంగా ఉన్న వారిని మాత్రమే పదవులు లో నిలపాలని గెలిపించాలని, ప్రజలు చంద్రన్న జగనన్న, ఎందుకు తమ సొంత నాయకుల ను అనుచరులను కోరరు?

తెలుగు రాష్ట్రాల నుంచి, నాయకులు పర్యటన కు వస్తున్నారు అంటే, పక్క రాష్ట్రాలలో మరియు విదేశాల్లో గుడ్డలు చింపుకుని ఎగురుతూ నినాదాలు చేస్తూ, కార్లు హెలికాప్టర్ ల రాలీ చేసే, సభలు నిర్వహించే వారందరినీ కూడా,

7 కోట్ల పై ఉన్న తమ సొంత మొత్తం ధనాన్ని, రాష్ట్ర సీఎం ఫండ్ కు ఇవ్వనిదే, మిమ్మల్ని అనుచరులు గా గుర్తింపు ఇచ్చి, మీ కార్యక్రమంలో పాల్గనలేము అంటే, రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉన్న,

ఆ గొప్ప బానిస అనుచరులు, జగనన్న చంద్రన్న రామన్న రాజన్న ల కోసం, మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం, తమ కోట్లు దానం చేయలేరా? తప్పక చేస్తారు.

పార్టీల అనుచరులే, స్వచ్ఛందంగా, 7 కోట్ల పైన ఉన్న ధనాన్ని ఆస్తులను ఇచ్చేస్తే, ఇంక రాష్ట్రం అప్పులు తో పనేముంది? కొత్త పధకాలు ప్రకటించేటప్పుడు జాగ్రత్తలు పడుతారు కదా?

తమ సొంత బిడ్డలు అప్పులు పాలైతే, వారు ఊరుకుంటారా? మరి సొంత రాష్ట్రం అప్పుల పాలవుతుంటే, ఆ మంచి మనసున్న నాయకులు మరియు అనుచరులు, ఎందుకు గమ్ముగా ఉంటారు?

వారు అలా 7 పైన ధనం ఇచ్చిన, వారికి ఇబ్బందులు అవుతాయా? లేదు కదా? ఇది కేవలం తెల్ల ధనం, మనకు కనపడని నల్ల ధనం, బినామీ ధనం, ఇతర రాష్ట్ర దేశ ధనం, చాలా ఉంటాయి. వారికి ఎటూ ఇబ్బంది లేదు.

వారి సొంత నాయకుల పై, ప్రేమ గౌరవం మర్యాద, బయట పడతాయి కదూ? అప్పుడు మాత్రమే నిజమైన నాయకులు, బయటకు వస్తారు కదూ?

మరి ప్రజలు గా మనం, 7 కోట్లు కంటే తక్కువ ఉన్న వారినే ఎన్నుకోవడం కు, సిద్ధంగా ఉన్నామా?

మనకెందుకు లేండి, ఎలక్షన్ వచ్చినప్పుడు అల్లా, ఓటు కు పచ్చని నోటు చాలు అందామా?

లింక్ ల లో కొంత మంది నాయకుల పెరుగుతున్న ఆస్తులు చూడండి, కొంత మందివి కింద చూడండి.

ఆ ధర్మ ప్రభువులు తమ ప్రజల కోసం, తమ పార్టీ అధిష్టానం కోసం, తమ రాష్ట్ర అప్పుల కోసం, త్యాగాలు చేయలేరా?

చేయలేనప్పుడు రాజకీయాల లోకి ఎందుకు వచ్చారు? ఇంకా పెంచుకోవడాని కే కదా? అని ప్రజలు విస్తు పోతున్నారు.

జగనన్న, చంద్రన్న, కేసీయార్ పధకాల అమలు అప్పుల ను వడ్డీ లను, వారు మరియు వారి నాయకులు అనుచరులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే తీర్చాలి అని, తమ ప్రజలు కోరుకుంటే, ప్రజాసేవకు అంకితమైన, ఈ మహా మనీషులు కాదనగలరా?

వారికి దేశ రాష్ట్ర భక్తి లేదంటారా? ఖచ్చితము గా ఉంటుంది కదా?

ఇందులో కొన్ని తప్పులు ఉండవచ్చు, అసలు వార్త లింక్ లో లేదా పార్లమెంట్ అస్సెంబ్లీ అఫ్ఫిడవిట్ లో చూడగలరు. ​

tribuneindia thefederal

Telangana - family assets combined

* Konda Vishweshwar Reddy - 895 crore

* Nama Nageshwar Rao — 113 crore

Andhra - family assets combined

* P Narayana, Narayana Group - 667 crore

* N Chandrababu Naidu - 574 crore. Lokesh - 320 crore

* N Balakrishna - ₹274 crore

* Bollineni Krishnaiah Nellore - 689 crore

* Bharath Mathukumilli (TDP) - 232 crore

* Jayadev Galla - 300 crore

* YS Jagan - 510 crore

* Raghu Rama Raju - 311 crore

* Balashowry Vallabhaneni - 100 crore.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,165; 104 తత్వాలు (Tatvaalu) and views 217,388
Dt : 28-Jun-2021, Upd Dt : 28-Jun-2021, Category : Politics
Views : 847 ( + More Social Media views ), Id : 1219 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : schemes , assets , leaders , pledged , donated , money , crore , jagan , chandranna , pawan , veeranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content