APLatestNews.com top Banner

Social Media links
కార్యకర్తల చెడ్డ, నాయకులు కు తెలుస్తాయి, అనడం కష్టమే. తెలిసి ప్రోత్సాహం చేస్తే, నాయకుల కే ద్రోహం - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఎవరూ కూడా, అనుచరుడైన బంగారు వ్యాపారి మాటలు విశ్వసించడం లేదు, సరే అది పెద్దలు చూసుకుంటారు, మనకు అనవసరం.

సౌమ్యుడు ప్రశాంతంగా ఉండే వాసన్న వివరణ మాటలలో కొంత బాధ, ఉద్వేగం కూడా కనపడ్డాయి. ఎప్పుడూ అంత కోపంగా లేదా గట్టిగా మాట్లాడింది విలేఖరుల తో, చూడలేదు.

ఒకమాట నచ్చినది, ఏవండీ కార్యకర్తలు అందరూ, ఏ పని చేస్తారు, వాళ్ళ మరియు మన వెనక ఏమి జరుగుతుంది, గమనించలేము కదా. పార్టీ కి పని చేస్తున్నారు అనుకుంటాము అనడం బాగుంది. అది వాస్తవం, కార్యకర్తలు అందరి యొక్క అన్ని విషయాలు తెలియకపోవచ్చు. మంచి మాటలలో లేదా పిల్లల పరిచయాలతో, తమకు కావాల్సిన సీటు కోసం ప్రయత్నాలు చేస్తారు. మనము, కార్యకర్తే గదా లేదా పిల్లవాడి స్నేహితులే గదా అని ఇచ్చేస్తాము.

ఇది మనకు తెలిసి, ఒకటి జరిగింది కూడా. ఒకాయన నగరం/ పట్టణం నడిబొడ్డున, ఏళ్ళుగా ఉన్న వడ్డీ వ్యాపారం లో జనాలకు బంధువులు కు, లక్షల రూపాయలు ఎగకొట్టారు లేదా ఇంకా ఇస్తామని నానుస్తున్నారు తిప్పుకుంటున్నారు 4 ఏళ్లుగా, కోట్లు ఉంచుకుని కూడా ఆస్తులు ధనము రూపములో. జనం కన్నీళ్ళు శాపనార్థాలు ల తో తమ అవసరాలకు ధనము అందడము లేదని చెపుతుంటే, కనపడకుండా తిరుగుతూ ఉన్నారు. గట్టిగా అడిగితే బెదిరింపులు అరుపులు, మేం పెద్ద రౌడీలము, మా వెనక చాలా బలం ఉంది అంటున్నారు.

వాళ్ళ కు నగర కార్పోరేట్ సీటు ఇచ్చారు, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ కు. ఇప్పుడు ఆ ఎన్నిక ఆగిపోయింది లేండి. ఆ రోజున, జనం ముక్కు న వేలేసుకున్నారు. అదేమిటి ఇంతమంది జనం తో ఊయించుకుంటున్న వారికి, సీటు ఎలా ఇచ్చారు అని? ఒకవైపు ధనం లేదని జనానికి అబద్ధాలు చెపుతూ వారిని తిప్పుకుంటూ, ఎలక్షన్ కు ఖర్చు ఎలా పెడుతున్నారు అని?

దానికి వారి విచిత్రమైన జవాబు, మా అబ్బాయి వారి అబ్బాయి మంచి దోస్తీ, అందుకే ఉచితంగా సీటు ఇచ్చారు అని. పొనీ సరిగ్గ మాట్లాడటం వచ్చా అంటే, కనీసము చుట్టాలతో కూడా మాట్లాడటం రాదు. అంటే అన్న గారి అబ్బాయి పరువు కూడా తీస్తున్నారు.

అంటే సీటు ఇచ్చిన అన్న గారి పరువు కూడా, జనం లో తీస్తున్నారు. ప్రజల ధనం ఎగకొట్టే తిప్పుకునే వారికి, ఉచితంగా కార్పోరేషన్ (అది అబద్దము అయినా) సీటు ఇస్తారా అని గుసగుసలు. వారికే ఉచితంగా సీటు ఇస్తే, మరి మా ధనం కూడా ఇవ్వచ్చు గదా అంటున్నారు ప్రజలు.

నన్ను అడిగారు, ఇలా ఇస్తారా జిల్లా పెద్ద మనుషులు అయిఉండి అని. అన్న కు ఇవన్నీ చెప్పి ఉండరు. లేకపోతే ముందు చుట్టాలకు, జనాలకు అంతో ఇంతో ఇచ్చి, కాగితాలు రద్దు చేయించుకుని, శాపనార్థాలు లేకుండా చేసుకో, ఆ తర్వాత ఎలక్షన్ కి రా, సీటు తప్పక ఇస్తానని చెప్పేవారు. ఆయనను కూడా, నమ్మించి ఇలా మోసం చేసారు కదా, అని బాధ పడ్డాము.

కార్యకర్తలు అందరి చెడ్డ పనులు, నాయకులు కు అన్ని తెలుస్తాయి, అని అనుకోవడం కూడా కష్టమే. ఒకవేళ తెలిసి కూడా, ప్రోత్సాహం చేస్తే, సహాయం చేసిన నాయకుల కే ద్రోహం చేస్తారు చివరకు, అందులో సందేహము లేదు.

జాగ్రత్తలు సుమా, మన చుట్టూ ఉండే అనుచరులు తో.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 17-Jul-2020, Upd Dt : 17-Jul-2020, Category : Politics
Views : 127 ( + More Social Media views ), Id : 600 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : followers bad , leaders , encouraging bad followers , betray leaders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content