ఏమని వర్ణించను నీ కంటి వెలుగును, తీరని రుణమేదో తీర్చుకో వచ్చాడు- డ్రైవర్ రాముడు- ఎన్టీఆర్, జయసుధ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,618; 104 తత్వాలు (Tatvaalu) and views 224,698.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చూడండి ఈ పాటలో, ఆ రోజుల్లో చూపు లేని చెల్లెలుకి, కాబోయే వరుడి గుణ గణాలను, ఎంత వివరముగా చెపుతున్నారో. మరి ఈ రోజుల్లో ఇలా వరుని/ వధువు లక్షణాలు మాత్రమే చెప్పి పెళ్ళిళ్ళు చేస్తున్నారా? మనం పాటల ద్వారా, సంస్కారం అలాగే గుణాలు బాధ్యత నేర్చుకుంటున్నామని, గురువులకు తెలుసు.

పాండవులు లాంటి ఉత్తమ సంతానం కోసం మాత్రమే, గుణాలు చూసి పెళ్ళి చెయ్యాలని, తల్లి దండ్రులకు కూడా తెలీదు. చెడు బుద్దులు గల అరిషడ్వర్గాల బానిసత్వం గల రాక్షస లేదా కౌరవ సంతనం కోసం పెళ్ళి వద్దు అని, ఇతర జీవులను హింసించిన పాపం వస్తుంది అని, గ్రహించరు.

అంత మత్తులో ఉండి, ధనం ఆస్తి పదవి హోదా వీసా ఉద్యోగం కోసం మాత్రమే పెళ్ళి చేసి, తర్వాత ముదుసలి తనములో ఒంటరిగా లేదా ఆశ్రమములో తమ ఖర్మ ఫలాన్ని శిక్షగా ఆనందముగా అనుభవిస్తున్నారు.

ఏమని చెప్పమంటావు చెల్లెమ్మా, అతని మంచి తనాన్ని, నీ కంట్లో వెలుగు అవుతాడు, లోకం చూపుతాడు, వెన్న లాంటి మనసు, చక్కటి నవ్వు, నీకు అండగా ఉండేందుకు వచ్చిన దేవుడే అనుకో, అని కేవలం లక్షణాలను మాత్రమే చెపుతున్నాడు.

చల్లటి గాలి గా ఉంటాడు, అలాగే నులి వెచ్చని సూరీడు లాగా ఉంటాడు. నీకు పూర్వ జన్మలో తీరని రుణము ఉండి, అది తీర్చుకోవడానికే, ఇలాంటి మంచి వ్యక్తి, నీకు భర్త గా వస్తున్నాడు అని వివరిస్తున్నాడు.

బాధ్యత గల రామరాజ్యం రారాజు, రాముడి లా నిందలు నమ్మడు (ఆ రోజుల్లో సత్యం 4 పాదాల ఉంది ప్రజల మాట మన్నించాలి రాజైనా మంత్రి అయినా, తన మన భేదం లేదు), ఆది గురువు దేవుడు రాజు క్రిష్ణుని లా కూడా ఇతర భార్యలు లేరు (రాజులు ఇతర దేశాలను జయించినప్పుడు, ఆ రాజు గారి పిల్లను ఇచ్చి పెళ్ళి చేయడం ఆనాటి ఆనవాయితి). వారి లో ఉన్న ఈ చిన్న లోపాలు కూడా లేవు, అని రాజ్యం లేని సామాన్య బావ గారిలో అని తన మంచితనాన్ని చెపుతున్నాడు.

కళ్ళు లేవని బాధపడకమ్మా, తన కళ్ళతోనే నీకు జగతి మొత్తము చూపిస్తాడు అని కాబోయే భర్త గురించి చెపుతుంటే, ఆ చెల్లెలు సంతొషముగా, దేవుని ఇంకేమి వరం కోరుతాను, ఇంత మంచి అన్న కన్నా అని అంటుంది. ఇదంతా గత కాలం నాటి మంచి మాటలు, పెళ్ళి ని నిర్ణయం చేయడానికి.

మరి ఇప్పుడు కలి కాలం పెళ్ళిళ్ళలో, పిల్ల నే తల్లి దండ్రులకు ఈ విధముగా చెపుతుంది, సినిమాలలో కూడా బాగా చూపిస్తున్నారు విలువలు దిగజారిపోయిన నిర్మాత దర్శకుడు హీరో హీరోయిన్ వాళ్ళ ఇళ్ళలో, వారి ఉత్తమ వంశ సాంప్రదాయాన్ని. ఇవి చూసి సామాన్య జనం ఇంకా దిగజారడం, మనము వెనకపడ్డామేమో అని. -

అమ్మా పబ్ బారులో రాత్రి 1 కి ఒకతన్ని చూసాను, సంవత్సరముగా మాట్లాడుతూ కలసి తిరుగుతున్నాము, చాలా మంచి వాడు, తాగి కూడా, అందరితో బాగా స్తిరముగా డాన్స్ వేస్తున్నాడు పాట పాడాడు, ఒక్క సారి కూడా నిజం చెప్పడు మాట మీద ఉండడు చిలిపి, ఇంటికి వెళ్ళేది ఉదయం 6 కే. ఆ తర్వాత 11 కి లెగిచి స్నానం టిఫిన్ అంట. 3 కంపెనీలు 3 కోట్ల బాంక్ బాలెన్సులు 3 కార్లు 3 ఇళ్ళు ఉన్నాయి అంట. కనీసం 3 నెలలు/ ఏళ్ళు కలసి ఉంటాము. దుబారా ఖర్చు ఎంతైనా పర్లేదు. అన్ని పాశ్చాత్య బుద్దులే. వారు ఎవరితో తిరిగినా నేను అడగను, తనూ అంతే, చాలా ఓపెన్. అంతే కాదు, వాళ్ళ నాన్న తోనే కలిసి మద్యం సేవిస్తారు అంట, బయటకు రాలేని గడ్డు పరిస్తితిలో, ఈ రోజుల్లో ఇది కామన్ కదా డాడీ, పొగ తాగడం కూడా వచ్చు. ఇతన్ని ఇచ్చి చేయకపోతే, నేను 10 రోజులు అలిగి ఇంటికి రాకుండా ఉంటాను.

అయ్యో ఎందుకమ్మా అలిగేది, మరలా టీవీ పేపరు ప్రకటనలు వెతకడానికి, నువ్వు తప్పు ఏమి చెప్పావు చేస్తున్నావు, నీకు చిన్నప్పటి నుంచి ఈ లక్షణాలే కదా నేర్పింది, అమ్మ నేను అంతే, అన్ని మన ఇంటి ఉత్తమ లక్షణాలే, ధనం ఉంటే ఏమైనా సాధించవచ్చు. మంచితనం గుణం అంటే ఇదే కదా, మద్యం పొగ తాగి తాగి పోతే, ఆస్తి కూడా వస్తుంది, ఇంకో బకరా దొరుకుతాడు, దీన్నె ఖాయం చేద్దాం అంటున్నారు, ఆ ఉత్తమ పెద్దలు. అంటే దురలవాట్లు ధనము తప్ప, పిల్లలు 4 కాలాలు సంతోషముగా ఆరోగ్యముగా మనశ్శాంతి తో ఉందాము అని చాలా మంది అనుకోవడము లేదు.

ఏమని వర్ణించను...
ఏమని వర్ణించను నీ కంటి వెలుగును, వెన్నంటి మనసును వెన్నెల నవ్వును
నీ ఇలవేల్పును ఏమని వర్ణించను...

చరణం: 1
పైరగాలి లాగా చల్లగా ఉంటాడు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు 2
తీర్చిన బొమ్మలా తీరైనవాడు 2
తీరని రుణమేదో తీర్చుకో వచ్చాడు
ఏమని వర్ణించను...ఆ...ఆ...ఆ..ఆ...

చరణం: 2
రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు
నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు, నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు
ఏమని వర్ణించను... ఆ...ఆ...ఆ..ఆ...

చరణం: 3
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా, తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా 2
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను 2
నా అన్న రూపాన్ని చూపితే చాలును
ఏమని ఊహించను నా అన్న రూపును
నాకున్న వెలుగును వెన్నంటి మనసును
నా ఇలవేల్పును ఏమని ఊహించను...

Emani varNinchanU - ఏమని వర్ణించనూ, చిత్రం : డ్రైవర్ రాముడు - driver rAmuDu (1979), రచన : ఆచార్య ఆత్రేయ, సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
తారాగణం - ఎన్టీఆర్, జయసుధ, రోజారమణి, శ్రీధర్
emani varninchanu ni kanti velugunu tirani runamedo tirchuko vachchadu - driver ramudu - NTR jayasudha  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,618; 104 తత్వాలు (Tatvaalu) and views 224,698
Dt : 20-Jun-2022, Upd Dt : 20-Jun-2022, Category : Songs
Views : 511 ( + More Social Media views ), Id : 1433 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : emani , varninchanu , kanti , velugunu , runamedo , driver , ramudu , ntr , jayasudha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content