గెలుపు గుర్రం శాశ్వతం కాదు, భ్రమలు వీడి, తప్పులు సరిచేసి, వైసీపీ 2వ సారికి సుస్ధిర సూత్రాలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2186 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2221 General Articles and views 2,492,591; 104 తత్వాలు (Tatvaalu) and views 267,317.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* 151 ఎమ్మెల్యేలు, అఖండ గెలుపేనా? ఏం చూసి?
* తెదేపా నాయకుల ఆలోచన సరళి మారలేదు
* జనసేన నేరచరిత్ర అవినీతి ఆరోపణలు కుటుంబ వంశ పాలన
* సీయెం స్ధాయి వ్యక్తి, ఓ ఎమ్మెల్యే ను ఓడించాలని
* తెదేపా నాయకులు ఇబ్బంది పెడితే అవమాన
* ఎన్ని డబ్బులు ఉచితాలు, పసుపు కుంకుమ బొట్టు
* కంటికి కనపడని అభివృద్ధి, కోట్లు అప్పులు
* చదువు, వైద్యం
* అతి గా అమర్యాదగా నోరు కొడాలి లాంటి
* ఎన్నికల గెలుపు గోడ దూకిన
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

నాటి 2 ఏళ్ల గెలుపు కు, మన మాటలు చూడండి లింకు లో. 4 పార్టీలు మన పిల్లలే, మనలోని వారే, ఆకాశం లో నుంచి దిగలేదు. link.

నలుగురు కు మంచి చెప్పాలి, అండగా ఉండాలి, అవసరమైతే ప్రశ్నించాలి, భవిష్యత్ గుర్తు చేయాలి. పిల్లలకు చెప్పడం చాతకాని వాడే, నేను ఇతరులకు మంచి చెప్పను అంటారు. పార్టీలు, నాయకులు అంటే ప్రజలే అంటే మనమే, మన ఆలోచన లే, మన అభివృద్ధి, మన పతనమే సుమా.

* ఊహించని అమోఘమైన విజయం ఆనాడు, 151 ఎమ్మెల్యేలు, అది నిజంగా మన అఖండ గెలుపేనా? ఏం చూసి? 2024 లో కూడా వస్తే, మన పనులు చూసే, నిస్సందేహముగా.

గెలుపు మనదే ఒక అవకాశం ఇద్దాం అని, అనుమానం లేదు. కానీ అఖండ గెలుపు మాత్రం, చంద్రన్న పనులు రోత పుట్టి, బుద్ధి చెప్పాలని, ప్రజలు భావించారు.

గాలిలో మేడలు కట్టి, కాగితాలు మీద బొమ్మలు చూపెట్టి, తనయుడు ని పైన పెట్టాలని, ఆడిన అన్ని ఆటలను నాటకాలను, ఒకేమాటపై రాష్ట్రం అంతా తిరస్కరించారు. 2 ఏళ్ళ తర్వాత, ఈనాడు కూడా, తెదేపా నాయకుల ఆలోచన సరళి మారలేదు.

* మరి ఈనాడు మున్సిపల్ అఖండ విజయం ఏకపక్షం, అన్ని వ్యవస్ధలు మన చేతిలో, ప్రలోభాలు బెదిరింపులు, ఉన్నాయి అని కొందరు అంటున్నారు. చంద్రన్న అదే అంటున్నారు, గత పాలనలో తన స్థానిక గెలుపు అలాగే జరిగింది, అని ఒప్పుకుంటూ.

ఇంకా ప్రజలకూ మోహం తగ్గలేదు అని తెలుసు. ఈ గెలుపు శాశ్వత మా? శాశ్వతం చేసుకోవడానికి, ఇంకా మనమేం చేయాలి?

* జనసేన, తర్వాత ఓ అవకాశం మాకే, అంటూ రెడీగా ఉన్నారు. మన తప్పులు ఎత్తి చూపాలని, ఎటువంటి నేరచరిత్ర అవినీతి ఆరోపణలు కుటుంబ వంశ పాలన లేకుండా, మిస్టర్ క్లీన్ గా వచ్చి, ధైర్యముగా కేంద్రమును ప్రశ్నిస్తూ సఖ్యత గా ఉంటూ, తన మంచితో అభివృద్ధి చేయాలని.

కానీ అంత మంచిని తట్టుకోవడానికి, మన జనం సిద్ధంగా లేరు, తమ స్వభావాలకు ఆలోచనలకు, వ్యతిరేకంగా నడవడానికి ఒప్పుకోరు. అందుకే గట్టి కార్యకర్తలు, నాయకుల అండ దొరకడం లేదు.

కానీ పొరపాటున జనం మనసు మార్చుకుని, అంతా మంచే చూద్దాం, ఓ సారి అంటే, అనుకుంటే? కాబట్టి, మనం కూడా, కనపడే మంచి చేసి చూపిద్దాం.

* ఆఖరికి ఒక ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి, చిన్న పట్టణం చీరాలకు అభివృద్ధి ఇచ్చి, ఏ విధంగా వారి మనసులో నిలబడాలన్నది వదిలేసి, ఓ ఎమ్మెల్యే ను ఎలా ఓడించాలని, తన శక్తి యుక్తులను అంతా ఉపయోగించి, ఆ ఎమ్మెల్యే ను ఓడించారు, కానీ తనూ తన పార్టీ ఓడిపోయారు. ఆ ఎమ్మెల్యే కి కూడా, అహంకారము తగ్గే, అవకాశం వచ్చింది.

అంటే అహంకారం, ఆధిపత్యం, బలప్రయోగం, అబద్ధాలు, మోసం, ముందు గెలిచి విర్ర వీగినా, ఏనాడూ ఎవరికీ ఎల్లకాలం, పని చేయవు, అండగా నిలవవు.

ఆ మోహం వ్యామోహం, పతనం వైపు పయనిస్తుంది.

* తెదేపా నాయకులు ను ఎంత ఇబ్బంది పెడితే అవమాన పరిస్తే, అంత తృప్తిగా ఉండవచ్చు కొందరికి. చచ్చిన పాము ని చంపడం, అనవసరం, అది ఒక మొనగాడు యోధుడు ఆశించడు ఆనందపడరు.

గతంలో మనల్ని అవమానించారు కూడా ఎంతో ఘోరంగా, జైలు కు పంపి, ప్రజలు అందరూ సాక్ష్యం ఉన్నారు. పడ్డవాడు చెడ్డ వాడు కాదు, ఆ సానుభూతి కూడా మనకు కలిసి వచ్చింది. మరి ఆ సానుభూతి, వారికీ మనమే ఇద్దామా, చేతులారా?

కానీ మనకు దాని వలన, పగలు పెంచడమే కానీ, సమయం వృధా చేయడమే గానీ, ప్రజలకు మనకు అభివృద్ధి కి వీస మెత్తు ఉపయోగం లేదు.

తర్వాత వారు గెలిచి వస్తే, ఇంతకన్నా ఎక్కువ పగలు ప్రతీకారం చేయవచ్చు. రాజన్న పద్దతి, నవ్వుతూ, ప్రజలకు ఉపయోగపడే, మన పనులు మనం చేసుకుంటూ, ముందుకు నడవడం.

* నాడు, తెదేపా, ప్రజల పన్నుల పధకాలు కు, కుటుంబ పేర్లు పెట్టుకుని, పసుపు కుంకుమ కింద ఎన్ని డబ్బులు పంచినా, ఉచితాలు ఇచ్చినా, చివరకు ప్రజలు తెదేపా నాయకులు కు, పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, విశ్రాంతి తీసుకోమని ఇంట్లో కూర్చోబెట్టారు 2 ఏళ్ల క్రితం.

అప్పుడు నుంచి ఇంట్లో కూర్చోవడం లో, సుఖం అలవాటు అయి, ప్రజాసేవ కన్నా ఇంటిసేవ ముఖ్యమని భావించి, మున్సిపల్ ఎన్నికల దాకా కూడా, బయటకు రావడానికి ఇష్టపడలేదు వారు. జనం కూడా వారిని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించి, ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, బయటకు రమ్మని తిరగమని.

కాబట్టి ఇదీ మనకు, భవిష్యత్ జ్ఞాన బోధే కదా? మనం ధైర్యంగా ఆత్మాభిమానం తో, ప్రజల పన్నుల పధకాలు కు, మన కుటుంబ పేర్లు వాడవద్దు. కొత్త ఒరవడి, మొదలు పెడదాం.

* అభివృద్ధి అంటే నేల మీద కట్టడాలు కనపడాలి. మనం రాజధాని కట్టలేక, వైజాగ్ లో ఉన్న బిల్డింగ్ లు, వాడుతున్నాము అంటున్నారు. రామాయపట్నం పోర్టు, ఇంకేవో పేర్లు పెడుతున్నాము పధకాలు అభివృద్ధి అంటున్నాము, ఎక్కడా ఏమీ కదలడము లేదు.

కంటికి కనపడని అభివృద్ధి కి, కోట్లు అప్పులు అవుతున్నాయి. నంబర్ వన్ అప్పుల సీఎం, బిరుదు మనకు వద్దు. విజయ సాయి లాంటి ఎకౌంటెంటు తో, అప్పులు ఎలా తగ్గాలో మార్గాలు చూడాలి, చంద్రన్న హైటెక్ సిటీ లాగా, మన పేరున ఓ కట్టడం చెప్పుకోవాలి.

* చదువు, వైద్యం ముఖ్యం. ప్రవేటు స్కూల్ నడ్డి విరిచే ప్రయత్నం, ప్రభుత్వ స్కూలు ప్రాభవం, ఇంకా గట్టిగా సాగాలి.

వైద్యం కోసం, ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలు, ఇతర రాష్ట్రాలక వెళ్ళకుండా, మన దగ్గర మంచి వైద్యం ఉండాలి.

పధకాలు లో అవినీతి ఆపాలి. మన బంధువులు మిత్రులు కు, కాంట్రాక్టు దోపిడీ అవినీతి ఆపాలి.

* అతి గా అమర్యాదగా నోరు పారేసుకుంటున్న, కొడాలి లాంటి వారిని కట్టడి చేయాలి. వారి పాపమంతా నాయకుడికే, కాబట్టి ఇలాంటి అనవసర పాపం తగ్గించాలి.

* ఎన్నికల గెలుపు తర్వాత, అధికార తాపత్రయముతో, గోడ దూకిన ఆత్మాభిమానం లేని, ప్రజా సమస్యలపై పట్టు మక్కువ లేని పిరికి వ్యర్ధ నాయకుల వలన, తెదేపాకు ఒరిగిందేమి లేదు. వారితో మిగిలి ఉన్నదీ లేదు. రేపు, మనకూ అంతే కదా?

ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, వెబ్సైట్ లో కలుపుదాం. మనం శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండే విధంగా, నేలపై కట్టడాలు అభివృద్ధి కనపడాలి.

ప్రజలను వంచించి, మనం నేడు ఆనందపడితే, కర్మ మన వెంట పడకపోదూ, మనం కూడా నేటి తెదేపా నాయకులు లా, ఇంట్లో నే కూర్చోవాలి సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2221 General Articles and views 2,492,591; 104 తత్వాలు (Tatvaalu) and views 267,317
Dt : 17-Mar-2021, Upd Dt : 17-Mar-2021, Category : Politics
Views : 1066 ( + More Social Media views ), Id : 1039 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : election , win , horse , permanent , illusions , correct , mistakes , sustain , principles , ycp 2nd term , jagan , pawan , chandranna , municipal
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content