ఏది తప్పు, ఏది ఒప్పు, ఉత్తమం? ఎక్కడ భవిష్యత్తు సమాజం? కలియుగ పాపం? పెళ్లి స్వార్ధం సుఖం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1620 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1655 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1. పెళ్లి కాకపోయిన పర్వాలేదు, పిల్లల్ని మాత్రం కంటాను
2. పెళ్లి చాలు, పిల్లలు మాత్రం మాకు వద్దు.
3. గుణం లేని స్వార్థ పెళ్లి తో, సంస్కారం లేని పిల్లలు
1 min read time.

*ఏది తప్పు, ఏది ఒప్పు, ఎవరు ఉత్తమం? ఎక్కడ ఉత్తమ భవిష్యత్తు సమాజం? కలియుగ పాపం పెంచుతుంది ఎవరు? పెళ్లి పిల్లలు స్వార్ధం సుఖం ముఖ్యం, మరి విలువలు?*

ఒంటరివారి గురించి, అంత గా అనుకోవాల్సిన, పని లేదు. ఎందుకంటే చెడ్డ లేదా మంచి వారైనా, వారితోనే అది అంతరించిపోతుంది. అంటే చెడ్డ వారైతే, తక్కువ నష్టం, తక్కు వ సంవత్సరాలు.

గొప్ప వారైన ఆది శంకరులు ఒంటరి వారే. వేమనకు, మరి ఎవరూ లేరనుకుంటా. బ్రహ్మం గారికి ఉన్నా కూడా, ఆయనంత గొప్ప పేరు లేదు.

వీరి గొప్పతనాన్ని తర్వాత తరాలు, ముందుకు తీసుకుని వెళ్ళలేదు.

అందుకే, పుత్రుడు అంటే, మన కడుపున పుట్టక్కరలేదు, ప్రేమతో గౌరవముగా ఆదరించే, క్రుతజ్ఞతలు విశ్వసనీయత మంచి గుణం ఉన్న వారు, ఎవరైనా మన పుత్రులే. అది శాస్త్రం ఒప్పుకుంది.

అందుకే, గీత గుణాన్ని బట్టి 4 వర్ణాలు చేసింది, పుట్టుకను బట్టి కాదు. రాజులు కూడా, తమ కొడుకులు చవటలు అయితే, వారికి రాజ్యం ఇవ్వలేదు. రాజ్యం లో ఉన్న గుణ బల వంతులైన వీరులకే ఇచ్చారు. మన పీఠాధిపతులు కూడా పిల్లలకు ఇవ్వకుండా, గుణ వంతులైన శిష్యులకే ఇచ్చారు, తర్వాత ఆధిపత్యం.

అంతెందుకు, మన వెంకన్న కధ చదివారు కదా, శ్రీనివాసుడు తలకు దెబ్బ తగిలి, వకుళ మాత దగ్గరకు వస్తే, ఏమీ తెలియని ఆయనను తన బిడ్డ గా చెప్పి, రాజు కూతురు తో తనకు పెళ్ళి చేసింది. కాదా? అంటే అర్ధం ఏమిటి? గుణవంతుడు ఎవరైనా, మన బిడ్డే, వారితోనే, మనకు సద్గతులు కలుగుతాయి పుణ్యం వస్తుంది అన్నది, శాస్త్రం చెప్పిన నియమము.

ఇదంతా ఎందుకు అంటే, పెళ్ళైన వారి గురించి మరియు పిల్లలు కన్న వారి గురించి. వారు ఎటువంటి పరిస్తితిలో ఎటువంటి వారిని కని, ఎటువంటి ఉత్తమ గతులు పొందుతూ, ఉత్తమ భవిష్యత్ సమాజాన్ని పెంచుతున్నారు, తర తరాలకు.

దాని వలన వారికి పాపముతో పాటుగా, కలియుగ పాపాన్ని 90 శాతం కు చేర్చే విధముగా సకల విధాలు గా ప్రయత్నం చేస్తూ, చివరకు వారే అంటున్నారు, అయ్యో రామా, పాపం ఎంత పెరిగిందడి చుట్టూ, మా ఇంట్లో తప్ప అని, ఆత్మ ద్రోహం చేసుకుంటూ.

ఇవి ఎవరినీ తప్పు పట్టడానికి కాదు, ఆత్మ విమర్శ ఎవరికి వారే చేసుకుని, నీతి నియమం ధర్మం క్రుతజ్ఞత విశ్వసనీయత పెంచి, మన ముదుసలి రోజులు సరిచేసుకుందాము అని మాత్రమే.

*1. పెళ్లి కాకపోయిన పర్వాలేదు, పిల్లల్ని మాత్రం కంటాను* అన్న మృణాల్‌ ఠాకుర్‌. నేటి వార్త. అలా ఎంతో మంది అన్నారు, అలా ఉన్నారు, వారి ఇష్టం, వారి భావాలు. కానీ ఆ మాటల అంతరార్ధం ఏమిటి? దాని ఫలితము ఏమిటి?

బాధ్యత నీతి బంధం అనుబంధం లేకుండా, సుఖం కోసం, ముద్దు ముచ్చట కోసం, పిల్లలు ను కని, సంస్కారం ఏమని నేర్పి, ఏమని సమాజం పైకి వదులుతాము? ఎవరి గొంతు కోద్దాము?

*2. పెళ్లి చాలు, పిల్లలు మాత్రం మాకు వద్దు.* ఇలా నేడు చాలా మంది ఉన్నారు. పిల్లలు
లేక ఒకళ్ళు డాక్టర్ల చుట్టు కన్నీళ్ళు బాధతో తిరుగుతుంటే, వీరు అన్ని ఉండి, మాకు వద్దు అంటారు. మరి పెళ్ళి ఎందుకు?

బరువు బాధ్యత, తర్వాత తరము, వద్దు, సొంత వారి సేవ చేయలేము, ఆనందాలు వదులుకోలేము. సమయం లేదు, ధన ప్రజా ఇతరుల సేవకు. మా స్వార్థ శారీరక సుఖం మాత్రమే ముఖ్యం, సమాజం కన్నీళ్ళు తుడవటం కోసం బంధము నటిస్తాము, బాధ్యత బరువు వంశం వద్దు. వీరు ముదుసలి తల్లి దండ్రులను కూడా చూడరు కదా?

*3. గుణం లేని స్వార్థ పెళ్లి తో, సంస్కారం లేని పిల్లలు ఉన్నవారు.*

పిల్లలు కు సంస్కారం నేర్పే సమయం మరియు ధైర్యం లేదు ధన ఆస్తుల సంపాదన అనందాల మత్తులో, ముందు మాకూ తెలీదు. పిల్లలు మమ్మల్ని దగ్గర ఉంచి చూడరు. మేము మా పెద్దలును చూడలేదు/చూడం. సుఖం కావాలి, పాపం పెంచాలి, బాధ్యత వద్దు. పదిమంది ఉన్నా, చివరకు ముదుసలి తనములో అనాధలం.

ఇప్పుడు చెప్పండి, ఈ 3 వర్గాలలో, ఏది తప్పు, ఏది ఒప్పు, ఎవరు ఉత్తమం? ఎవరికి విలువలు ఉన్నాయి? ఎక్కడ ఉత్తమ భవిష్యత్తు సమాజం? కలియుగ పాపం 90 శాతం చేస్తుంది ఎవరు? వీరి దైవ పూజకు విలువ ఉందా? మనము అనుకున్న 11 పాపాలు వీరితో లేవా?

edi tappu edi oppu evaru uttamam ekkada uttama bhavishyat samajam kaliyuga papam pechutundi evaru  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1655 General Articles, 61 Tatvaalu
Dt : 14-Sep-2022, Upd Dt : 14-Sep-2022, Category : General
Views : 107 ( + More Social Media views ), Id : 1519 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tappu , oppu , uttamam , bhavishyat , samajam , kaliyuga , papam , pechutundi , evaru , parents , children , son
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content