APLatestNews.com top Banner

Social Media links
తిండి మెక్కు , మంచం ఎక్కు, రోగం తో కక్కు, శరీరం తుక్కు - 60 తర్వాత నెప్పులు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

60 తర్వాత అందరికీ నడుము, కాళ్ళు, మోకాళ్ళు, వెన్ను, పాదము, తల నెప్పులు, మామూలు ఏ కదా. ఇంకొంత మంది కి 40 నుంచి కూడా మొదలు. తిరిగి తిరిగి అరిగినాయి మోకాళ్ళు అని అదే అనుకుంటూ ఉంటే, ఆ బాధ పెరుగుతుందే కానీ తరగదు.

బరువు పెరిగినా, లేదా పొట్ట పెరిగినా, మన మోకాళ్ళ మీద భారం పడుతుంది. వయసులో ఉన్నప్పుడు చేసిన చెడు పనులు కూడా, శక్తి హీనతను కలిగిస్తాయి.

బయట తిండి తినకుండా, ఎక్కువ వ్యాయామం చేయాలి చెమట కక్కాలి అంటే, మన మనసొప్పదు. పని మనిషులు, మిక్సీలు, లేటు నిద్ర, లేటుగా లెగవడం, చెడు తిండి, నియమం లేని తిండి, ఇంకా ఎన్నో . . .

అందరికీ ఆ వయస్సు లో తప్పవు అని, మనసు ను స్ధిర పరచుకుంటే, ఇక అది బాధ అనిపించదు.

బీపీ, షుగరు అంటే గతంలో బాధతో దడతో గుండె ఆగేది. ఇప్పుడు ఆసుపత్రిలో బిల్లు ఎంత అయినా, జనం తగ్గడం లేదు, తిరణాల లాగ, అలవాటు పడ్డారు.

తిండి మెక్కు , మంచం ఎక్కు, రోగం తో కక్కు, శరీరం తుక్కు సూత్రం నియమంగా పాటిస్తూ ఉన్నాము. అంటే ఏది బడితే అది తిని, వెంటనే నిద్ర పోయి, రోగాలు తెచ్చుకుని కక్కుతూ, శరీరాన్ని తుక్కు తుక్కు గా పాడు చేసుకుంటున్నాము.

74 ఏళ్ల అమ్మ, రోజూ మైలు నడుస్తోంది. అంటే కీళ్ళు , ఒళ్ళు, నడుం నొప్పులు ఉండవా? పోనీ ఏడిస్తే, మందేస్తే పోతాయా? పోవు కదా. క్షణం తగ్గినట్టు అనిపిస్తుంది, తర్వాత మామూలు. రాత తప్పదు కదా? చేసిన పాపాలు విడువవు కదా?

పోనీ నిజంగా అరిగినాయి అనుకుంటే , మరి మాంసం కొట్టుకు, సినిమాకు షికారుకు, ఇడ్లీ కొట్టుకు వెళ్ళేటప్పుడు, పెళ్లి భోజనం కు వెళ్ళేటప్పుడు, అదే అనుకొని గమ్ముగా ఉండవచ్చు ను కదా. అబ్బే ఆగము.

ఒకరు అయినా, తిని తిని నాలుక అరిగింది అని తిండి మానారా? కళ్ళు అరుగుతాయని టీవీలు ఫోన్ లు సినిమా లు ఆపారా? లేదే ఇంకా మత్తులో ఎక్కువ అవుతోంది.

అబ్బే మనకు, ఇష్టమైన వాటి కాడ గుర్తు రాదు, బాధ అనిపించదు. అదే మోహం, అదే బద్ధకం, అదే భ్రమ, అదే వ్యామోహం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 746 General Articles, 46 Tatvaalu
Dt : 13-Nov-2019, Upd Dt : 13-Nov-2019, Category : General
Views : 196 ( + More Social Media views ), Id : 220 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : body pains , senior citizen
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content