Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు పీ రామచంద్రారెడ్డి గారికి, కమీషనర్ గిరిజా శంకర్ గారికి, ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ గారికి, జిల్లా పంచాయితీ అధికారి నారాయణ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయు విన్నపము,
విషయము - కరోనా కోవిడ్ 19 పరిస్తితుల ద్రుష్ట్యా, ఆన్లైన్ లో పంచాయితీ ఇంటి పన్ను వివరములు తెలుసుకొను మరియు పన్ను చెల్లింపు సౌకర్యము కల్పించ ప్రార్ధన. మరియు పంచాయితీ శాఖ కూడా, సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి పేజీలు పెట్టి, పంచాయితీ సెక్రటరీ గారు, ఎంపీడీవో, ఇతర జిల్లా పంచాయతి అధికార్లు, జగన్ గారు తీసుకుంటున్న ప్రజా సంక్షేమ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రజల కు ఎప్పటికప్పుడు తెలియచేయాలని ప్రార్ధన. ఆన్లైన్ సేవలు ప్రవాసాంధ్రులకు, ఉపయోగము కూడా.
సాధారణముగా నవంబరు లోపు, పంచాయితీ శాఖ స్థానిక అధికారులు/ సభ్యులు ఇల్లు ఇల్లు తిరిగి, ఇంటి పన్నులు రసీదులు అందరికి ఇచ్చి, గడువులోగా చెల్లించమని కోరతున్నారు ఇప్పటిదాకా. 2018 నుంచి కూడా, ప్రజలు ఆన్లైన్ సేవలను కోరుతూ, ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు లభ్యము కాలేదు ప్రజలకు. కొత్త వెబ్సైట్ కు వెళుతూ జాప్యము జరుగుతుంది అని విన్నాము. ఒకవేళ వెబ్సైట్ సిద్ధంగా ఉంటే, లింకు లు ఇవ్వగలరు.
కాని ఇప్పుడున్న పరిస్తితుల్లో, పంచాయితీ వారు ఇల్లు ఇల్లు తిరిగి ఇవ్వడము, ప్రభుత్వ సిబ్బందికి మరియు ప్రజలకు కూడా, ఆరోగ్యపరముగా మంచిది కాక పోవచ్చును. ఇంకా 2 నెలలు సమయము ఉంది కాబట్టి, దయచేసి త్వరిత గతిన, ఆన్లైన్ లో పన్నులు చూసుకొని మరియు చెల్లించే అవకాశము, కలిగించగలరని ప్రజల కోరిక.
శాఖా పరమైన వెబ్సైట్ పూర్తి గాకున్న కూడా, ప్రజల సౌలభ్యము కొరకు, విద్యుత్ శాఖ కు మేము పన్నులు చెల్లించే విధముగా నైనా, ఇతర వెబ్సైట్ల ద్వారా అనగా ఏపీఆన్లైన్ లేదా ఆన్లైన్ బాంక్ ల ద్వారా, పన్ను చెల్లించే ఇతర మార్గాలనైనా చూపగలరని ప్రజలు ఆశపడుతున్నారు.
మరియు మన పంచాయితీ రాజ్ శాఖ కు కూడా ఇతర శాఖల వలె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుతూ, జగనన్న పధకాలను విరివిగా, ప్రతి పౌరుడు చేతి ఫోన్లు లో సోషల్ మీడియాలో కనపడేటట్లు చేసే, శక్తి యుక్తులు సామర్ధ్యాలు మంత్రి వర్యులు గా మీకు, మీ నాయకత్వం లో నడిచే, అనుభవజ్ఞులై న ఉత్సాహవంతులైన, పంచాయతీ అధికారులు కు ఉందని ప్రజల నమ్మకం.
సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి పేజీలు పెట్టి, పంచాయితీ సెక్రటరీ గారు, ఎంపీడీవో మరియు ఇతర జిల్లా పంచాయతి అధికార్లు, జగన్ గారు తీసుకుంటున్న ప్రజా సంక్షేమ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రజల తో మమేకమై, ప్రజల కు ఎప్పటికప్పుడు తెలియచేయాలని, పలువురూ కోరుతున్నారు.
జగనన్న పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కూడా, ఈ విషయంలో సహాయం చేయగలదు అని అందరి నమ్మకం. జిల్లా స్థాయిలో, గతము లోనే, అధికారులను సోషల్ మీడియా గురించి, కోరి ఉన్నాము.
గౌరవ అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు, తాను స్వయముగా సోషల్ మీడియాలో ప్రజలకు సమాచారం ఇస్తూ, తన అన్ని శాఖల జిల్లా అధికారులు తో కూడా, సోషల్ మీడియా పేజీలు పెట్టించి, ప్రభుత్వ సమాచారం అందిస్తూ, ఆదర్శంగా నిలిచారు రాష్ట్రంలో, జగనన్న కు తోడుగా నమ్మకముగా.
ధన్యవాదములు.
Update : 21 Dec 2020
ప్రజలపై సానుభూతి జాలి దయగల, గ్రామ మండల (పట్టణ) జిల్లా రాష్ట్ర, పంచాయితీ అధికారులు కు మరలా విన్నపము,
ఓ 3 నెలల ముందు, కరోనా తో ఉన్న ఇబ్బంది తో, మన పంచాయితీ లేదా సచివాలయ సిబ్బందికి మరియు ప్రజలకు ఇద్దరికీ రక్షణ గా ఉండాలని, గత 2 యేళ్ళు పై గా ఎదురు చూస్తున్న, ఆన్లైన్ లో పన్నులు కట్టే మహా భాగ్యాన్ని, మాకు కల్పించ ప్రార్ధనలు విన్నపాలు పంపాము. లింక్ లో చూడగలరు.
అధికారుల జీతాల సౌకర్యాల కోసం, నిజాయితీ గా పన్నులు కట్టే, ప్రజల మీద సానుభూతి దయలేక పోయినా, మీ నాయకత్వం లో పనిచేసే కనీసం మన పంచాయితీ సిబ్బంది మీదైనా అభిమానం ప్రేమ గౌరవం చూపించి, మాకు ఆ ఆన్లైన్ పన్ను చెల్లింపు సద్భాగ్యాన్ని కలిగించాలని వేడుకున్నాము.
మా పంచాయితీ లో మార్పులు చేర్పులు, మా అధికారుల స్థానిక సోషల్ మీడియాలో రోజూ చెపుతూ ఉంటే, మీ జోలికి రాము కదయ్యా ఇలాంటి విన్నపాలతో. దయచేసి, మా జనాలకోసం, సోషల్ మీడియాలో, పంచాయితీ లో జరిగే విశేషాలను, మా పంచాయితీ సిబ్బంది ద్వారా వినే భాగ్యం, కరోనా బారిన మేము పడకముందే కలిగించండయ్యా. ఇదే కోరిక, రెవెన్యూ మున్సిపల్ విద్యా వైద్య శాఖలను కోరాము, మీరంతా మా మొర కొంచెం ఆలకించండి అయ్యా.
మా జగనన్న ఆశయాలను ఆలోచన లను, మా అరచేతి ఫోన్ లో, చూసుకునే భాగ్యం కలిగించండి బాబులూ. సంపాదన తరిగి పేపరు కొనలేము, కొన్నా కరోనా భయం, ఎన్నికల కు కూడా అదే కారణం కదయ్యా.
కరోనా వస్తే, మేము హైదరాబాద్ పోలేమయ్యా అంతంత మా సొంత ఖర్చులతో, నాయకులు లాగా. అధికార ప్రతిపక్ష నాయకులు నమ్మలేని, సరైన వైద్య సదుపాయాలు లేని, ప్రభుత్వ ఆసుపత్రే మా బతుకులకు దిక్కు సాములూ. బ్రిటన్లో కొత్త రకం కరోనా వచ్చింది అంట, తెలంగాణాలో మహరాష్ట్రలో విమానాశ్రయం లో భయపడుతున్నారు అంట.
మరి ఆ ఆన్లైన్ పన్నుల అవకాశం వచ్చిందా ఇప్పుడు, లేదా అన్న సంగతి ఇంకా తెలియ రాలేదు. కొంచెము చెప్పి పుణ్యం కట్టుకోండి బాబులు. ముందు సంవత్సరాలలో ఎంత పన్నులు కట్టామో కూడా, ఆన్ లైన్ లో చూసే అవకాశం ఇవ్వండి అయ్యా.
మా పంచాయితీలో, ధనం మిద్దె ఉండి కూడా, పన్నులు కట్టని ఎగవేసే, మహాను భావుల లిస్ట్ కూడా, చూసే సదవకాశం మాకు కల్పించండి అయ్యా. మేమైనా వారిని బతిమాలి కట్టిస్తాము, మా పంచాయితీ బలం సౌభాగ్యం కోసం.
ఎందుకంటే, మా జగనన్న మీరు అన్ని పనులు బ్రహ్మాండము గా చేస్తున్నారు మమ్మల్ని ఆనందింప చేస్తూ అని నమ్మి, భూ సర్వే లాంటి కొంత పధకాన్ని మొదలు పెట్టారు. దానితో మా ఆన్లైన్ పన్నులు, ఇంకో ఏడాది వెనక్కు వెళుతుందేమో ని, గుండేల్లో గుబులు మొదలు అయినాది బాబులూ.
ఇట్లు, కరోనాతో బతుకులు ఏమి అవుతాయో అన్న భయం ఉండి కూడా, నిబద్దతగా పంచాయితీ పన్నులు ఆన్లైన్లో కట్టాలని, మిమ్మల్ని వేడుకుంటూ, ఏళ్ళుగా, దండాలతో వినమ్రంగా ఎదురు చూస్తున్న, రాష్ట్ర పిచ్చి ప్రజలు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,136; 94 తత్వాలు (Tatvaalu) and views 184,773 Dt : 13-Sep-2020, Upd Dt : 13-Sep-2020, Category : Request
Views : 814
( + More Social Media views ), Id : 694 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
corona kovid ,
panchayat ,
house tax ,
pay online ,
minister ramachandra reddy ,
girija sankar ,
prakasam collector ,
dpo Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments