Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *ఏవండీ మద్యం/ పొగ తాగినోడు/ తిరిగినోడు సన్నాసి కాదు. అవి తాగని/ తిరగనోడు మహానుభావుడు (సన్యాసి) కాదు. పోని ఇవి చేయని/ తిరగని వారు, నూరేళ్ళు బ్రతుకుతారా? గ్యారంటీ లేదు. ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ (ఆలోచన పరిజ్ఞానం) వాడిది, ఎవడి జీవితం వాడిది అంటున్నాడు, మా అనుభవ మిత్రుడు. నేను జవాబు చెప్పగలిగినా, మీరు కరెక్ట్ గా ఉదాహరణల తో చెపుతారు.*
జవాబు - ధన్యవాదాలు, మనకు తెలిసి కూడా ఉన్నారు ఇలాంటి ఉత్తములు. ముందు వారిని పొగడాలి, ఎందుకంటే ఏదీ దాచకుండా, ఉన్నది ఉన్నట్లు పక్కా నిజాయితీ తో చెపుతారు. వారిని మేము ఈ విషయము లో గౌరవిస్తాము, ఆదరిస్తాము
వారి భవిష్యత్ పతనం గురించి, పూర్తి క్లారిటీ/ పరిజ్ఞానం తో ఉంటారు కాబట్టి, వారికి ప్రత్యేక క్లాస్ అవసరము లేదు. వారు మన జోలికి, అలాగే మనము వారి జోలికి అసలు వెళ్ళము. విషాన్ని చుక్క కూడా మనము సరదాకు తాగము, కానీ వీరు నరనరాలలో దానికి సమానమైన దానిని ప్రవహింప చేసే ధైర్యవంతులు.
మేము రాత్రి 2 పాకెట్లు, 2 సీసాలు, వీరి తో తిరిగామూ అని అందరికీ, వివరముగా నిజాయితీ గా చెపుతారు. కల్లా కపటం ఉండదు, అలాంటి స్నేహితులే వీరికి ఎక్కువ ఉంటారు, ప్రాణం కూడా ఇస్తారు, తేడా వస్తే మత్తులో తెలీకుండానే తీయవచ్చు కూడా. రోడ్ ప్రమాదాలు చూసాము, స్నేహితుల మోసము చూసాము కదా వార్తలలో.
వీరికి నటించే తత్వం ఉండదు. తమను తాము, దేశం రాష్ట్ర పన్నులు కోసం, ఇతరులు బతకడం కోసం, త్యాగం అర్పణ చేస్తూ ఉన్నతము గా భావిస్తూ, తమ కుటుంబాన్ని మాత్రం రోడ్డున వేస్తారు, లేదా సంస్కార హీనులను చేస్తారు.
దొంగ కూడా, ఇలాగే అంటాడు, నేను దొంగతనము చేయకపోతే, పాపం వారి బీరువాల్లో ఖాళీ ఉండదు, కొత్త సంపాదన పెట్టుకోవడానికి అని.
పిల్లలు అనుకుంటారు, మా నాన్న ఊరక/ దోచి/ దాచిన డబ్బును మేము ఖర్చు చేయకపోతే, రేపు ఎవరో తీసుకు పోతారు, కాబట్టి మేము వాడేస్తాము అని. ఎవరి ఆలోచన వారిదే కదా? నీతి నియమం బాధ్యత సంస్కారం వద్దు కదా?
ఇలా చాలా మంది తమకు తామే ఆత్మద్రోహం చేసుకుంటూ, తమ కుటుంబానికి కూడా, తీరని అన్యాయం చేస్తున్నారు. సంస్కార లోపం ఉన్నవారి మాటలు ఇలాగే ఉంటాయి. తా చెడ్డ కోతి వనమెల్లా చెరచింది, అన్న సామెత కు వీరు అర్హులు.
పాతకాలం లో చాటుగా భయము గా సిగ్గుతో ఈ పనులు చేసే వారు, ఇప్పుడు ధైర్యముగా పబ్లిక్ గా సోషల్ స్టేటస్ గా చేస్తున్నారు, ఎందుకంటే తమ పిల్లలు కూడా, అవే ఉత్తమ లక్షణాలు నేర్చుకోవాలని, తమలాగే అరిషడ్వర్గాల బానిసత్వం తో పతనం అవ్వాలని, వారికి తెలియకుండానే, గురువులు గా మార్గదర్శనం చేస్తున్నారు.
పేపర్ టీవీ ల లో చూసాము కదా, ధనము బండ్లు ఇచ్చి, పబ్ బార్లకు అర్ధరాత్రి కూడా పంపుతున్నారు, తొందరగా ముసలి తనము తెచ్చుకుని, కండరాలు నరాలు మెదడు ఆలోచనలు అదుపు తప్పమని, బలహీనం అవ్వమని, మత్తుకు బానిసలు అవ్వమని.
ఇదే బాచ్, కరోనాకు కూడా, ఇష్టం వచ్చిన విధముగా, బయట తిరిగి ఇలాగే నోటికి వచ్చింది చెపుతూ, ఆసుపత్రి లో వేలకు వేలు తగల పెట్టారు, ఇతరులకు కరోనా అంటిస్తూ, కరోనా సమస్యను పెంచారు.
1) సరే బతికే కొన్ని రోజులు అయినా, ఆసుపత్రి మంచము లో రోగం లేకుండా, బతుకుదామా, వద్దా?
ఇంటికి ఆహారము పానీయము తెస్తే, ఇంట్లో అందరితో పనుచుకుంటాము. మరి వీరు కూడా పంచుతారా ఇవి? లేక కేవలం స్వార్ధం తో వీరికి మాత్రమేనా? ప్రేమ అంటే ఇదేనా?
2) వాళ్ళ 10-15 ఏళ్ళ అబ్బాయి కూడా, ఇలాగే తాగుదాం/ తిరుగుదాము డాడీ అంటే, వారు, అవును ఎన్నాళ్ళు బతుకుతామో తెలీదు కాబట్టి, 18 ఏళ్ళ దాకా కూడా ఆగవద్దు, మీరు మాతో/ స్నేహితులతో ఎంజాయ్ చెయ్యండి అంటారా?
వీళ్ళ సిద్దంతం ప్రకారం, అవును కదూ? ఎవరి ఆలోచన వారిది, వాళ్ళ 18 ఏళ్ళ అబ్బాయిని కూడా, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి/ తిరగండి అంటారా?
డాడీ మీరు మద్యం తాగుతారు, కానీ మేము మత్తు తింటాము అంటే, మీ ఇష్టమే అంటారా? ఎవరి జీవితం ఎవరి ఆలోచన వారిదే కదా?
లేదు, మీ పిల్లలకు మాత్రమే సంస్కారం చెప్పి, బయట పిల్లలకు మాత్రం, ఎవరి మాటా పట్టించుకోవద్దు అంటారా?
అసలు వీరి పిల్లలు, వీరి అనుమతి కోసం ఆగుతారా, వీరిని లెక్క చేస్తారా?
3) వీరు ఆసుపత్రికి వెళ్ళి, ఎప్పుడైనా అక్కడ రోగులు పడుతున్న, బాధలు చూసారా? చూస్తే, ఇలా మాట్లాడతారా? బాధ్యత తెలీదా? మంచి వారికి ఖర్మ కాలి రోగం వస్తే, దేవుని సాయం కోరవచ్చు. కానీ అరిషడ్వర్గాల బానిసత్వం తో రోగం వస్తే, దేవుడు ఎందుకు కరుణిస్తారు?
4) మరి అందరూ సమానం అనే సిద్దాంతము, మహిళా సమాన హక్కుల కింద, మేము కూడా ఇలాగే చేస్తాము అంటే, వారి ఇంటి మహిళలను ఇలాగే భుజము తట్టి, తాగి/ తిరగమని ప్రోత్సాహము చేస్తారా?
లేదు కేవలం, మగవారే ఇలా చెయ్యాలి అంటారా? మీరు కాదంటే, ఇంటి మహిళ గమ్మున ఉంటారా? ఎవరి జీవితం ఎవరి ఆలోచన వారిది అని కదా, మీ సిద్దాంతం?
5) ఇలాంటి వారు జవాబు చెప్పాల్సింది, బయట వాళ్ళము అయిన మనకు కాదు. వారి ఇంట్లో వారికి మాత్రమే. వీరు తాగి తిరిగి, ఒకవేళ పైకి పోతే, ఇంట్లో వారికి దిక్కు ఎవరు? బతికి ఉన్నా, రోగం తో మంచము లో ఉంటే, ఖర్చులు ఎవరు ఇస్తారు? సౌకర్యాలు ఎవరు చూస్తారు?
6) వీరికి, ఇంట్లో మనుషులకు మంచి చెడు చెప్పే నైతిక హక్కు ఉంటుందా? ఉన్నా, ఇలాంటి వారి మాట, వారి ఇంట్లో వారు గౌరవిస్తారా?
7) తాగి/ తిరగని వారికి కూడా, ఈ రోగాలు రావచ్చు. కానీ శాతం ఎంత? తాగి/ తిరిగిన వారికి 50 శాతం మందికి రోగాలు వస్తే, అలా చేయని వారికి 10 శాతం రోగాలు రావచ్చును. అంటే 40 శాతం ఎక్కువ దౌర్భాగ్యం మనకు ఎందుకు?
అందుకే అలాంటి మిత్రులను చూసి జాలిపడుతూ, వారి మనసు మార్చి, వారి సొంత కుటుంబము పై నిజమైన ప్రేమ కల్పించమని, 100 ఏళ్ళు వారి బిడ్డలకు తోడుగా ఉంచమని, దేవుని ప్రార్ధన చేయడం కన్నా, మనము చేయగలిగింది ఏమీ లేదు మిత్రమా.
అందుకే చట్టం వేరు, ధర్మం వేరు. ఆనందము మనలో ఉంది అనుకునే వారు ఆధ్యాత్మిక వాది, లేదు బయట ధనం తగలేసి పొందేది ఆనందం, అనుకుంటే వారి ఖర్మ, వీరే ప్రాపంచిక వ్యామోహ దాసులు, అరిషడ్వర్గాల బానిసలు, మానసిక బలహీనులు.
taginodu tiriginodu sannaasi kaadu itarulu mhaanubhaavulu sanyasi nurellu kaadu nijama
Drinker/ smoker/ bad person is not Sannasi. Others are not great sanyasi 100 years, right?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,324,042; 104 తత్వాలు (Tatvaalu) and views 252,334 Dt : 21-Jun-2022, Upd Dt : 21-Jun-2022, Category : General
Views : 666
( + More Social Media views ), Id : 1435 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
drinker ,
smoker ,
bad ,
person ,
sannasi ,
sanyasi ,
100 ,
years ,
right Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments