APLatestNews.com top Banner

Social Media links
జీవిత భాగస్వామి, తల్లి దండ్రులును పట్టించుకోరు. మనసులో ఏదో అశాంతి, భవిష్యత్ నమ్మకం లేదు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

నా జీవిత భాగస్వామి, తన 50 ఏళ్ల పైన ఉన్న తల్లి దండ్రులు గురించి పట్టించుకోరు. కనీసం సంవత్సరానికి నెలరోజులు, ఇంట్లో ఉంచుకోవడం కూడా లేదు. గాలి కి లేదా మిగతా వారికి వదిలేసారు. రావాల్సిన ఆస్తి వచ్చేసింది. మేము బాగానే ఉంటాము, మాకు ఇబ్బంది లేదు. కానీ మనసులో ఏదో అశాంతి, భవిష్యత్ మీద, నమ్మకం కలగడం లేదు, అంతా నటన లాగా యాంత్రికముగా ఉంది.

జవాబు, దయచేసి ఇలాంటివి, బయట వారిని అడగకూడదు. మీ ఇంటి వాస్తవ పరిస్థితులు, వ్యక్తిగత స్వభావం తెలిసిన, స్వార్ధము లేకుండా మంచి కోరే, సొంత ఇంటి పెద్దలును మాత్రమే అడగాలి.

ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా, ఒకరి మీద ఒకరికి, శాంతి లేదా అశాంతి, రోజు రోజు కి లేదా గంట గంటకు మారుతూనే ఉంటుంది. బాధ్యత గల వారికి, కష్టసుఖాలు తెలిసిన వారికి, అది మారదు, వారు మార్పులను అర్ధము చేసుకుంటారు, కుంగిపోరు పొంగిపోరు వదులుకోరు.

కేవలం మీ ప్రశ్న బట్టి మాత్రమే ఈ జవాబు, ఇది అందరికీ సరిపోవక పోవచ్చు. 25 ఏళ్లుగా పెంచిన తల్లి దండ్రులు మీద, బాధ్యత ప్రేమ లేని వారు, అవకాశవాదులు, అవసరవాదులు, నటించేవారు, గతం మరచిన వారు, కృతఘ్నలు, ఏరుదాటాక తెప్ప తగలేసే మనుషులు. ఇది ఎవరికైనా ఒకటే, మనుషులు అందరికీ వర్తిస్తుంది.

కొంతమంది వితండ వాదము చేస్తారు, మాకు ధనము లేకపోతే ఆరోగ్యము లేకపోతే, ఎలా చూడగలము అని. దానికి జవాబు వారే చెప్పాలి, ధనము లేదని మిమ్మల్ని మీ చిన్నప్పుడు రోడ్ న వదిలితే, మంచి పని అంటారా? మీకు ధనం లేదు అని, మీ భార్యను పిల్లలను వదిలేస్తారా?

బాధ్యత గల వారికి, ప్రేమ ఎవరిమీదైనా ఒకటే, ఎన్నటికీ మారదు, అది ముసలి వారైనా, వ్యాధిగ్రస్తులు అయినా కూడా.

కానీ కామం, మోహం, వ్యామోహం మాత్రము, కొంతమంది మీద మాత్రమే ఉంటుంది, అది కూడా కొంతకాలం మాత్రమే ఉంటుంది.

మరి ఒక్కసారి మనకు మనం ఆలోచిస్తే, మన యవ్వనం మరియు సంపాదన తరిగి వయస్సు పెరిగి, ఇక మనం దేనికీ పనికిరాము అని తేలితే, మన పరిస్థితి ఏమిటి? మన జీవిత భాగస్వామి, మనల్ని ఆదరిస్తారా గౌరవముగా? చస్తే, ఆదరించరు.

అన్ని సమకూర్చి, పెంచి పెద్ద చేసిన, తల్లి దండ్రులు నే గాలికి వదలిన వారు, మధ్యలో వచ్చిన మనలను వదలరా లేక హీనంగా చూడరా?

ఇది ఎవరికి వారు, వారి ఇంటి మనుషుల స్వభావాన్ని బట్టి, ఆలోచన చేసి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మన అవకాశవాదులు, అవసరము తీరాక మనల్ని గౌరవించరు. జాగ్రత్తలు. మీ ఇంటి పెద్దలు తో, మాట్లాడుకోగలరు కూలంకషంగా.

-

ఒక గురువు గారి జవాబు, మీరు మరీ ఉదారంగా, పొగిడినట్లు చెపుతున్నారు, పరిస్థితి బాగా లేదు అని జీవిత భాగస్వామి ని పిల్లల ను వదిలుతారా అని? వదలంది ప్రేమ తో అనుకుంటున్నారా?

కాదు, కేవలం భయంతో మాత్రమే, టీవీ లు పేపర్లు రెడీ గా ఉన్నాయి, పరువు బజారు లో పెడతానికి. కోర్టు కు వెళతారు అని జీవిత భాగస్వామి జోలికి పోరు, అంటే వదలరు కష్టం లో కూడా.

అలాగే తల్లి దండ్రులు కూడా బాధ్యతగా , ప్రభుత్వం ఇచ్చిన అండతో, బుద్ది చెపడానికి కేసులు పెడితే, ఇలా బతిమిలాడే పరిస్థితి ఉండదు, పురాణములను చెప్పి. చచ్చినట్టుగా అందరు బిడ్డలు, బాధ్యత వహిస్తారు.

పేరెంట్స్ ఆ పని చేయడం మొదలు పెడితే, తమ బిడ్డలను కూడా, మనుమలు నుంచి కాపాడుకుంటారు దోవచూపించి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 744 General Articles, 46 Tatvaalu
Dt : 14-Feb-2020, Upd Dt : 14-Feb-2020, Category : General
Views : 175 ( + More Social Media views ), Id : 339 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : marriage , caring parents , future confusion
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content