వేమన పద్యాల భావం పాటించాలి అంటే, రాజకీయాలు, వ్యాపారం, సంసారం వదిలేయాలా? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1248 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1278 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

క్షమించాలి, ప్రవేట్ అంటే వ్యక్తిగతము గా మాట్లాడిన వారి వివరాలు, బయటకు ఎప్పుడూ చెప్పకూడదు. దాని గురించి అడగవద్దు. అధికారులు/ నాయకులు/ మిత్రులు/ బంధువులు అయినా. విలేఖరి గా కూడా అవి బయట పెట్టకూడదు, దైవ మరియు వ్రుత్తి ప్రవ్రుత్తి ద్రోహం. అదే బెదిరింపు లు అనుకోండి, అందరికీ చెప్పవచ్చు, అది వేరు. కాని ప్రశ్న జవాబు అందరికీ ఉపయోగము. మనం దాని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి.

ఒక రాజకీయ నాయకుడు అడిగారు, మరి వేమన గారు చెప్పిన 4 పద్యాల భావం పాటించాలి అంటే, నేను రాజకీయాలు, సంపాదన, వ్యాపారం మరియు సంసారం వదిలేయాలా? అది ఈ పరిస్థితిలో సాధ్యమేనా, ఇన్నాళ్ళు అలా ఉండి? మరి నా దానాలు లెక్కలోకి రావా?

జవాబు. ధన్యవాదాలు. కనీసం ఆ మాట అడగడానికి, మనసు వచ్చింది అంటేనే, మీలో ఎక్కడో, ఆధ్యాత్మిక భావం దాగి ఉంది. ఏదీ వదలక్కర లేదు, దాని అర్ధము గ్రహిస్తే, చేసే ప్రతి పని లో ధర్మం ఉంటే చాలు. అంతా మోహం మాయ అని గ్రహిస్తే చాలు, మాయ కు, దూరంగా ఉంటే చాలు.

రాజకీయమైనా లేదా ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా ఒకటే. ఒకరు నూనె వ్యాపారం, చేస్తున్నా, నిజాయితీ గా చేస్తే, వదలడం అవసరమేముంది? ఉపాధికి ఉంటే మంచిదే. కాని, మాయలో పడి, లాభం కోసం, కల్తీ లేదా ఇతరులను పడగొట్టి వ్యాపారం చేస్తే? అది మోహము. అప్పు చేసి లేదా బాంకు/ ప్రభుత్వం (అంటే ప్రజల సొమ్ము) లను దోచి ఎదగాలంటే, అది మోహము. ఇప్పుడు చాలా మంది, అదే పని లో ఉన్నారు. వారి వారసులు శిక్షలు అనుభవిస్తున్నారు.

ఉద్యోగము అంతే, కొన్ని ధర్మంగా లేనివి మనకు నచ్చవు, అది పక్క అధికారితో వారు సంతకము పెట్టించుకుంటారు, మనం నీతి తప్పాల్సిన పని లేదు. నాయకుడి గా, ఇతరులను వంచించి అబద్దాలు చెప్పి, ధనం లేదా అధికార బలముతో, తానూ లేదా తన వారసులు, ఎదగక పోతే చాలు. మోహం లో ఎదిగినా, తర్వాత నేలకు దిగారు, ఫలితం అనుభవించారు.

పూర్వ కాలములో 60 యేళ్ళు వచ్చేసరికి, సన్యాసము స్వీకరించి, ప్రపంచ మోహాలకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు, 90 అయినా తగ్గడము లేదు, అదే మోహం వ్యామోహం. శక్తి ఉంటే, పదవి ఉద్యోగం లేకుండానే, పదిమందికి ఉచితముగా సహాయం చేయవచ్చును, కానీ మనసు ఒప్పదు.

సంసారం వదలాల్సిన అవసరము లేదు. అందులో పడి, జీవిత భాగస్వామి మాటలు విని తల్లి దండ్రులను వదలడం. అలాగే పిల్లల మాటలు విని, ఇతరులను ద్వేషించకుండా, ఉంటే చాలు. ఇతరుల ధనం దోచి, తమ కుటుంబానికి, ఇవ్వకుండా ఉంటే చాలు. అలాగే సొంత జీవిత భాగస్వామిని మరియు పిల్లలను బాధపెట్టడం వదిలి వేయడం జరగకూడదు. ఇప్పుడు ఇలా ఎవరు ఆలోచన చేయరు కాబట్టే, కరోనాలు ప్రళయాలు వస్తూ ఉంటాయి, ఇంకా వస్తాయి.

2019 లో మన ప్రధాని మోదీ, అంటే ఎన్నో ఏళ్ళు ముఖ్యమంత్రి గా చేసిన ఆయన ఆస్తి, కేవలం 2.5 కోట్లు. 1.65 కోట్లు 2014 లో. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, యోగి గారి, ఆస్తి 72 లక్షలు, 2014 లో. 2017 లో 95 లక్షలు. చూడండి ఆ అంకెలు. ఇది ధర్మ సంపాదన, మరి అలాగే మన సంపాదన ఉంటే, ఇబ్బంది ఏముంది.

మన ఊరి తెలుగు ఎమ్మెల్యే మరియు ఎంపీ అఫిడవిట్ చూడండి, పై ఇద్దరి కన్నా, ఎన్నో ఎక్కువ కోట్లు ఉంటాయి. అలా లేనిదే, మన తెలుగు ప్రజలకు ఆనరు, ఓటు వేయరు? కళ్ళు తిరుగుతాయి, ప్రతి 5 ఏళ్ళ సంపాదన ఎదుగుదల వింటే. ఇక మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి గా చేసిన, వారి సంగతి అనుకోవడం అనవసరం. అదే మోహం, మాయ.

పోనీ అంత సంపాదించి జనాన్ని దోచి అవినీతి చేసి, వాళ్ళు మనశ్శాంతి గా వెళ్ళింది ఉందా? వారసులు ఎదిగింది నిలబడింది ఉందా? అదీ లేదు. ఎదో ఒక ఆటంకము భయము బలహీనము.

కాబట్టి, వారసులకు ఎలా బతకాలో నేర్పించాలి తండ్రిగా, వారి సొంత శక్తి తో, వారు పైకి రావాలి, నిజాయితీగా కష్టపడి. ఊరక వచ్చినది ఊరకనే పోతుంది, లేదా తర్వాత అయినా అవమాన భారముతో నేలకు దింపుతుంది, వారసులకు నష్టం చేస్తుంది.

దుర్యోధనుడు రావణుడు కూడా, యాగాలు దాన ధర్మాలు చేసారు కదా. చేసిన పాపాలు 100 ఉంటే 10 కోట్ల రుపాయలకు, పుణ్యాల దానం 10 లక్షలు సరి పోతుందా. ఆ 10 లక్షల దానం లెక్క వేరే, 10 కోట్ల పాపం లెక్క వేరే, రెంటికీ సంబంధము లేదు అసలు.

అంతెందుకు, ఇప్పుడు మనము కలిసింది అధికారముతోనా? ధనము తోనా? ఎందుకంటే ఈ సందేశము అందుకునే వారిలో, కాలేజీ పిల్లలు, టీ కొట్టు లేదా ఆటో వ్యక్తి కూడా ఉన్నారు, కోటీశ్వరులతో / అధికారులతో/ నాయకులతో బాటుగా. కాబట్టి అధికారం హోదా పలుకుబడి కాదు. అలాగే ధనము ఆస్తి కాదు, కేవలం మంచి మనసుల మాటలే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1278 General Articles, 47 Tatvaalu
Dt : 03-Dec-2020, Upd Dt : 03-Dec-2020, Category : Politics
Views : 244 ( + More Social Media views ), Id : 835 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sense , vemana verse , leave , politics , business , samsara
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content