కడు బీదవారైన సినిమా, వ్యాపార వేత్తలు లేదా ధన గౌరవ ఎంపీ ఎమ్మెల్యే కు ఫింఛన్లు వదులుకోలేరా? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2187 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2222 General Articles and views 2,493,628; 104 తత్వాలు (Tatvaalu) and views 267,414.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

కోట్లు సంపాదించినా కూడా, కొన్ని చిన్న విషయాలలో, చిన్న చిన్న డబ్బులు దగ్గర కూడా, తమ చిన్న బుద్ధిని బయట వేస్తుంటారు, మన నాయకులు, హీరోలు మరియు కోటీశ్వరులు.

మొన్న వార్త చూసారు కదా, కోట్ల కు పడగెత్తిన, రజనీకాంత్ గారు కూడా, తమ పేరు మీద ఉన్న కళ్యాణ మండపం కి, షుమారు 6 లక్షల పన్ను, కరోనా వలన పెళ్ళిళ్ళు లేవు కాబట్టి, కట్టలేను మహాప్రభో అని కోర్టు కు వెళితే, కోర్టు గట్టిగా మందలించి మొట్టికాయలు వేసింది, గమ్ముగా కట్టు అని.

గాస్ సిలిండర్ మీద, సబ్సిడీ వదలమని ప్రజలకు, నాయకులు నీతులు కూడా చెప్పారు. పార్లమెంటు లేదా ఢిల్లీ ఆంధ్రా భవన్ కాంటీన్ లో, తక్కువ డబ్బు కు, టిఫిన్ భోజనాలు చేస్తూ ఉంటారు. ఛీ మా స్ధాయికి, ఇంత తక్కువ ధనము తో వద్దు అని మాత్రం చెప్పరు.

కరోనా కష్ట కాలము, జీడీపీ తగ్గింది, ప్రజలకు సరైన పనులు, చేతిలో ధనము లేదు.

ఛండీగర్ నుంచి వచ్చే, ట్రిబ్యూన్ అనే పత్రిక, మార్చి 6 వ తేదీ 2020 న రాసిన ఇంగ్లీషు వార్త సారాంశం ఇది. కడు బీదవారైన మాజీ గౌరవ ఎంపీలు కు నెల ఫింఛను, షుమారు 25 వేలు వస్తుంది అంట. మాజీలు అందరికీ షుమారు 70 కోట్లు ఖర్చు అవుతుంది అంట. అందులో సినిమా వారు, వ్యాపార సంస్థల అధినేత లు కూడా ఉన్నారు అంట.

ఆర్టీఐ నుంచి పీపీ కపూర్, పానిపట్ వారికి వచ్చిన సమాచారం ప్రకారం, వైజయంతీమాల కు 39 వేలు, రేఖ చిరంజీవి కి 27 వేలు వస్తుంది. వ్యాపార వేత్తలు దాల్మియా, రాహుల్ బజాజ్ లకు 25 వేలు.

తమిళ నటుడు శరత్ కుమార్ మాత్రం, దేశ చరిత్రలో నే ఆత్మాభిమానముతో, ఫింఛను తిరస్కరించారు అంట.

మాయావతి 47 వేలు, సీతారాం ఏచూరి 39 వేలు తీసుకుంటున్నారు.

ఇతరులు ఇంకొంత మంది కూడా ఉండవచ్చు, కేంద్రం రాష్ట్రము పబ్లిక్ గా లిస్ట్ పెట్టాలి, ఆ బీదల పేర్లు.

కానీ లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ లకు మాత్రం, 4796, సెంట్రల్ పెన్షన్ ఎకౌంట్ ఆఫీసు కు మాత్రం 1470 మాత్రమే నంట.

లోక్సభ లో 3580 మంది మాజీ ఎంపీలు ఫింఛను పొందుతూ ఉంటే, 268 ఫామిలీ లు ఫించన్లు పొందుతున్నారు అంట, వారి తదనంతరం. కె సోనా, డిప్యూటీ సెక్రటరీ, సెక్రటరియేట్ సమాచారం.

పీ నారాయణన్ రాజ్యసభ వారు సమాచారం ప్రకారం, 508 మంది మాజీ లు, 219 గతించిన వారి కుటుంబం లు ఫించన్లు పొందుతున్నారు.

చెప్పండి, ఇన్ని కోట్లు ఉన్న, గౌరవ ఎంపీలు కు ఎమ్మెల్యేలకు ఫించన్లు వదులుకోలేరా? ప్రభుత్వము ఇచ్చిన అన్ని సౌకర్యాలు వాడుకుంటూ, మేమూ చమటోడ్చి కష్టపడ్డాము, ఆ మాత్రం ఫించను కూడా, మేము వదులుకోము అంటారా?

ఆత్మాభిమానం ఉన్న శరత్ కుమార్ గారి లాగా, వదులు కోలేరా? బీజేపీ, తెదేపా, జనసేన, వైకాపా లు పార్లమెంట్ లో నిలదీసి, ఈ ధనం ను పొదుపు చేయలేరా? స్వచ్చందము గా వదులు కున్న, తమ ఎంపీ ఎమ్మెల్యే పేర్లు ప్రకటించ గలరా ధైర్యముగా?

ఇంకా మనకు తెలీనిది ఏమిటి అంటే, 1. మూడు సార్లు ఎంపీ గా ఎమ్మెల్యే గా గెలిస్తే, మూడు ఫించన్లు విడివిడి గా ఉంటాయా? 2. రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్యే ఫించన్లు, విడిగా విడిగా నా లేక చివరి పదవి ఫించన్ మాత్రమే ఉంటుందా?

మోదీ గారు, దయచేసి ఈ దుబారా ను తగ్గించి, ఈ బీదవారి పేర్ల్య్ ధైర్యముగా ప్రకటించి, ధనం ఉన్న ఎంపీలు స్వచ్ఛందంగా వదులేటట్లు చేయాలి.

మరి మీ ప్రాంత మాజీ మరియు ప్రస్తుత (అంటే రెండో సారి గెలిచి లేదా గత ఎమ్మెల్యే లేదా గత ఎమ్మెల్సీ) ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు కూడా, కోట్లు ఉన్నా, కక్కుర్తి తో ఫించన్ తీసుకుంటున్నారు ఏమో, అడగండి.

https://www.google.com/amp/s/www.tribuneindia.com/news/haryana/ex-mps-pension-costs-exchequer-rs-70-50-cr-51571

The Government of India is spending a sum of Rs 70.50 crore on monthly pension being paid to former MPs, which includes film stars and renowned industrialists.

Information received under the Right to Information Act by PP Kapoor, an RTI activist from Samalkha (Panipat), reveals that actress Vyjayanthimala gets Rs 39,000 and Rekha and Chiranjivi get Rs 27,000 each as monthly pension.


Andhra MLA/ MLC (2017 sepTembar) - A pension of rupees 30,000 per month for the first term or a part of it and a pension of rupees 2000 per mensum per each year of his service in subsequent term as such member, so however , that in no case the pension payable to such person shall exceed Rupees fifty thousand.

ఆంధ్ర ఎమ్మెల్యే / ఎంఎల్‌సి (2017 సెప్టెంబర్) - మొదటి కాలానికి లేదా దానిలో కొంత భాగానికి నెలకు 30 వేల రూపాయల పింఛను మరియు అతని సభ్యుని తరువాతి కాలంలో అతని సేవ యొక్క ప్రతి సంవత్సరానికి నెలకి 2000 రూపాయల పెన్షన్ అదనము, అయితే, అటువంటి వ్యక్తికి చెల్లించాల్సిన పెన్షన్ ఎన్నడూ 50 వేలకు రూపాయలకు మించకూడదు.

https://www.gad.ap.gov.in/documents/acts-and-rules/the-a-p-payment-of-salaries-and-pension-and-removal-of-disqualifications-act-1953.pdf

ఇది నిజమేనా? దయచేసి తప్పు అయితే చెప్పండి సరి చేద్దాము, ఆంధ్రా ప్రభుత్వం లింక్ చెక్ చేయండి, 8 వ పేజీ.

గౌరవ ఎంపీల స్థాయిలో 25 వేలు ఉంటే, గౌరవ రాష్ట్ర ఎమ్మెల్యేలు కు 30 వేల పించన్లా? మేము తప్పు అర్ధము చేసుకున్నామా?

సరే ఎంతో కొంత అనుకుంటే, మరి కోటీశ్వరులైన గౌరవ ఎంపీలు ఎమ్మెల్యేలు, జీతాలు లేదా ఫించన్లు తీసుకుంటున్నారా? ఆత్మాభిమానముతో వదిలేసారా?

దయచేసి, మీ పార్టీలలో ఉన్న కోటీశ్వరులైన, ఆత్మాభిమానం గల, ఫించన్లు లేదా జీతాలు వదిలేసిన, ఉత్తమ ఆదర్శవంతులైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు ఉన్నారా? సగర్వముగా వారి పేర్లు ప్రకటించండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,493,628; 104 తత్వాలు (Tatvaalu) and views 267,414
Dt : 19-Oct-2020, Upd Dt : 19-Oct-2020, Category : Request
Views : 1114 ( + More Social Media views ), Id : 765 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : financially , strapped , film stars , businessmen , wealthy , mp , mla , mlc , pensions , india , andhra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content