దీపావళి - నరకాసురుని వధ - దీపం వెలుగు, అజ్ఞాన మనే చీకటి ని దూరం చేస్తుంది - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,937,618; 104 తత్వాలు (Tatvaalu) and views 230,579.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

దీపావళి శుభాకాంక్షలు. మనమంతా, పిల్లలు దగ్గర నుండి పెద్దలు దాకా, ఆనందంగా సంతోషం గా జరుపుకునే పండగ. ప్రతి ఒకరు కళ్ల లో ఆనందం వెలుగులు. ఇంటి ముంగిట నూనె దీపాలు, కాకర పువ్వొత్తులు, చిచ్చు బుడ్లు, పాము బిళ్ల లు, భూచక్రం, విష్ణు చక్రం, లక్ష్మి టపాసులు, ఇంకా ఎన్నో.

దీపం వెలుగు, అజ్ఞాన మనే చీకటి ని దూరం చేస్తుంది. అందుకే ప్రతి పనికి కూడా, మొదట దీపారాధన పెట్టారు. అలాంటి ది, ఈరోజు ఎన్నో ఎన్నో దీపాలు. మనం ఆకాశం లో నక్షత్ర దీపాలను చూస్తే, దేవతలు పై నుండి, మన భూ దీపాలను చూసి ఆశీర్వదిస్తారు అని అంటారు.

పురాణం ప్రకారం, నరకాసురుని వధ తర్వాత, జనం ఆనందోత్సాహము తో దీపావళి సంబరాలు చేశారు. సత్యభామ శ్రీకృష్ణులు యుద్ధంలో, అతనితో భీకరంగా పోరాడి సంహరించారు. తల్లి చేతిలో మాత్రమే మరణం అని అతని శాపం, అందుకే సత్యభామ పరాక్రమం చూపాల్సి వచ్చింది. అంటే లోక కంటకులు అయిన, సొంత పిల్లల ను కూడా, తల్లి దండ్రులు ఉపేక్షించరని ఉదాహరణ.

ఆ వెలుగులే, మన లో కూడా, జ్ఞాన సంపదను పెంచాలి. ఎక్కువ ప్రమాదాలకు కూడా ఈ పండగ లోనే అవకాశం, జాగ్రత్తగా పండుగ చేయాలి. రోడ్డు మీద నడిచే, ఇతరులకు ఇబ్బందులు లేకుండా చేసుకోవాలి. ఈ రోజున, ఆసుపత్రి పాలైన వారు చాలా మంది ఉన్నారు. కళ్ళు ఒళ్ళు చెవులు జాగ్రత్తలు.

విదేశాల్లో ఈ ప్రమాదాలు నివారించేందుకు, ఇంట్లో లేదా వీధిలో బాణా సంచా కాల్చడం నిషేధం. గుడి లేదా ఊరు తరపున, దూరంగా చెరువు లేదా ఖాళీగా ఉండే ప్రదేశాలు లో మాత్రమే, పోలీసులు అనుమతితో రక్షణతో, పెద్ద ఎత్తున అంగ రంగ వైభవంగా బాణా సంచా కాలుస్తారు. ప్రజలంతా అందులో పాల్గొని చూసి, ఆనందపడతారు. ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా ఈ జాగ్రత్తలు తప్పని సరి.

క్షేమంగా సంతోషం గా పండగ జరుపుకుందాం మరి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,937,618; 104 తత్వాలు (Tatvaalu) and views 230,579
Dt : 26-Oct-2019, Upd Dt : 26-Oct-2019, Category : Devotional
Views : 1219 ( + More Social Media views ), Id : 199 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Diwali , dipavali , narakasura , sri krishna , satyabhama
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content