APLatestNews.com top Banner

Social Media links
ఫేస్బుక్ పేజీ మరియు ప్రొఫైల్ మధ్య తేడాలు మరియు ఎలా క్రియేట్ చేయాలి - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

మీరు ఇప్పటికే ఫేస్బుక్ (ముఖపుస్తకం) ప్రొఫైల్ సెటప్ చేసి ఉండవచ్చు, అది మొదటి పని, ఆ తర్వాతనే పేజి క్రియేట్ చేయాలి. చాలా తేలిక మరియు ఉచితము, 5 నుంచి 10 నిమిషాల పని, మీ టైపింగ్ స్పీడ్ ను బట్టి. పదవ తరగతి మరియు ఇంటర్ చదివే పిల్లలు కూడా, ఇప్పుడు తేలికగా ఫేస్బుక్ ప్రొఫైల్ వాడుతున్నారు, చాలా తేలిక కాబట్టి.

కాబట్టి మీకు ఫేస్బుక్ పేజీ ఎందుకు అవసరం? ఫేస్బుక్ పేజీ మరియు ఫేస్బుక్ ప్రొఫైల్ మధ్య తేడాలను చర్చిద్దాం.

కొంతమందికి వ్యక్తిగత సమాచారం మరియు ఫోటోలు పెట్టుకోవడము ఇష్టము ఉండదు, అవి పెట్టవలసిన పని లేదు. కానీ వారు తిరిగిన ప్రదేశాలు, నచ్చిన ఇతర ఫోటోలు వీడియోలు , చూసిన సంఘటనలు పోస్ట్ చేయవచ్చును. నాయకులకు, సెలెబ్రెటీస్ కు, అధికారులకు తప్పదు తమ లేదా తమ సేవల గురించి ప్రజలకు రోజూ చెపుతూ ఉంటేనే, వారి యందు గౌరవము అభిమానము ఉంటుంది.

చాలా మంది అధికారులు మరియు నాయకులు, ఫ్రొఫైల్ కి మరియు పేజీ లకు తేడా ఏమిటి అన్న దగ్గర పొరపాటు పడుతున్నారు. వివరాలు చూడండి, సందేహాలు ఉంటే అడగండి. బయట ప్రజలకు మరియు అందరికీ, తెలియాల్సినది, మన ఫేస్బుక్ పేజీ మాత్రమే. స్నేహితులు కు బంధువులకు, అంటే మన గురించి తెలిసిన వారికి, మాత్రమే ఫ్రొఫైల్ లేదా ఎకౌంటు. వారు మనకు ఫ్రెండ్స్ గా యాడ్ అవుతారు.

ఉదాహరణకు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్, ఇతర అధికారులు ( వారి తరపున సిబ్బంది) లేదా వారి సిబ్బంది, ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ను ముందు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత, ఒక పేజీ ని క్రియేట్ చేసి, దాని లింక్ ను అంటే యూఆరెల్ (URL / Link) ను స్నేహితులకు పంపించాలి. పేజీ తో చాల ఉపయోగాలు ఉన్నాయి, ప్రొఫైల్ కన్నా. సెర్చ్ లో వస్తుంది, ఎంత మంది వచ్చారు, చూసారు అని అన్ని లెక్కలను ఇస్తుంది అనలిటిక్స్ ద్వారా. ఇంకొంతమంది, ట్విట్టర్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తారు.

ఉదాహరణకు, పాత అధికారి పేరున ఉన్న అకౌంట్ పనిచేయడము లేదు, పాస్వర్డ్ లేదు, ఇంకొక పేరుతో కొత్తది క్రియేట్ చేసి, ముందుకు నడవాలి.

ఫేస్బుక్ పేజి ఉదాహరణ బొమ్మ (చిత్రము 2) చూడండి, మన ముఖ్యమంత్రి గారి పేజ్ ఇది. 1) లైక్ బటన్ వుంటుంది, ఇష్టమైన వారు ఇది తాకుతారు 2) ఫాలో , అంటే, ఇష్టము లేదు కాని సమాచారము తెలియాలి అనుకునే వారు, ఇది తాకుతారు. మన ప్రొఫైల్ నుంచే మంత్రి గారి పోస్ట్ లు చూడవచ్చు. 3) జగన్ గారి గురించి ఉంది. అంటే మన గురించి రాయవచ్చు మన పేజ్ లో. 4) ఎంత మంది ఇష్టపడ్డారు అని లెక్కలు ఆటోమాటిక్ గా చూపిస్తుంది. 5) మన వెబ్సైట్ లింక్ ఇవ్వవచ్చు. 6) పేజ్ సమాచారము తెలుపుతుంది.

అలాగే చిత్రము 3 లో, ఒక పోస్ట్ ఫొటోలు మరియు ఫొటోలు గురించి వివరణ తో ఎలా పబ్లిష్ చేయబడినదో చూడండి.

ఫేస్‌బుక్ ప్రొఫైల్ - Step 1

ఇది ఫేస్‌బుక్‌లో మీ వ్యక్తిగత ఖాతా. మీ గురించి మీరు ప్రజలకు చెప్పడం, స్నేహితులను జోడించడం మరియు వ్యక్తిగత నవీకరణలను పంచుకోవడం ఇక్కడే. మీరు మొదట ఫేస్‌బుక్‌లో చేరినప్పుడు, మీరు ప్రొఫైల్‌తో ప్రారంభించండి.

వ్యక్తిగత ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఒక వ్యక్తి కోసం ఉద్దేశించినవి, వ్యాపారం కాదు. మీ వ్యాపారం పట్ల ప్రొఫైల్ గేర్‌ను రూపొందించడంలో, మీరు నిజంగా మీ వ్యాపారానికి అపచారం చేస్తున్నారు.

లాభాలు:

సమాచారం మరియు కథనాలను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి
మీకు ఆసక్తి ఉన్న వ్యాపారాలు మరియు సంస్థలపై నవీకరణలను అనుసరించండి మరియు పొందండి
పోస్ట్‌లను సృష్టించండి, ఫోటోలను భాగస్వామ్యం చేయండి మరియు వీడియోలను అప్‌లోడ్ చేయండి

ఇది ఎవరి కోసం?

తమ స్నేహితులు, కుటుంబం మరియు వారు ఇష్టపడే సంస్థలతో కనెక్ట్ కావాలనుకునే వ్యక్తులు.

కొంతమంది అధికారులు, తమ పలుకుబడి వాడుకుంటూ పెంచుకుంటూ, ప్రజలను నాయకులను, తమ ప్రొఫైల్ స్నేహితులుగా వందలలో చూపించుకుంటున్నారు, అది సరియైన పద్దతి కాదు.

ఫేస్బుక్ పేజీ - Step 2

ఫేస్బుక్ పేజ్ అంటే ఫేస్బుక్లో, మీ వ్రుత్తి, వ్యాపారం లేదా ఉద్యోగము యొక్క డిజిటల్ ఉనికి కి ఇది అవసరము. మీ వ్యాపారాన్ని పెంచుకోవటానికి, కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడానికి మరియు ప్రజలు దానితో ఎలా వ్యవహరించాలో వ్యవహరిస్తున్నారో చూడటానికి, మీకు సహాయపడేదే ఈ పేజీ. ఇక్కడ మన వ్యక్తిగత సమాచారము ఉండదు, కేవలము మన వ్యాపారము/ వ్రుత్తి/ ఉద్యోగము గురించి మాత్రమే.

లాభాలు:

మీ వ్యాపారం/ వ్రుత్తి/ ఉద్యోగము కోసం డిజిటల్ స్టోర్ ఫ్రంట్‌కు మద్దతు
మీ వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్న కస్టమర్‌లు మరియు వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి
మీ ఉనికిని పెంచుకోవడానికి మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి, వ్యాపార సాధనాలు మరియు ప్రకటన అవకాశాలను అన్‌లాక్ చేయండి

ఇది ఎవరి కోసం?

వ్యాపారాలు, ఆర్గనైజేషన్స్, లాభరహిత సంస్థలు, ప్రజా గణాంకాలు, నాయకులు, అధికారులు, సెలెబ్రెటీస్, ప్రభుత్వము, ప్రతి ఒకరుకు

Andhra Police , Prakasam Police - Daily updates for public

Guntur Collector , Kadapa Collector - Daily updates for public

* How to create a facebook account/ profile, ఫేస్బుక్ ఖాతా / ప్రొఫైల్ను ఎలా సృష్టించాలి, see the 1st video.

* How to create a facebook page, ఫేస్బుక్ పేజీని ఎలా సృష్టించాలి , see the 2nd video.

* How to convert / migrate profile to facebook page ఫేస్బుక్ పేజీ గా మన ప్రొఫైల్ను ఎలా మార్చాలి.
 
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 648 General Articles, 46 Tatvaalu
Dt : 17-May-2020, Upd Dt : 17-May-2020, Category : General
Views : 168 ( + More Social Media views ), Id : 548 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : differences between facebook page and profile , how to create them , migrate from profile to page
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content