APLatestNews.com top Banner

Social Media links
దేవుడు కనపడరే - సాధన, అర్హత? ఒలింపిక్ పాల్గొనే అర్హత, గెలిచే క్రృషి? ప్రశ్నలు/జవాబు - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

గురు శిష్యుల ప్రశ్న, జవాబుల పరంపర చూడండి.

పూజ , ప్రార్ధన చేయాలా? అవసరం లేదు, మన మనసు పసి పిల్లల లా నిర్మలంగా ఉంటే చెడు ఆలోచన లేకుండా, అరిషడ్వర్గాల కు దూరంగా ఉండ గలిగితే. ఎంత మందికి, మనసు అలా ఉంటుంది, నిర్మలంగా స్థిరంగా?

చేసి ఫలితం ఏమిటి? నిర్మలంగా మనసు ఉంటే, జీవితం మంచి దోవలో(ధనపరం గా కాదు, మనశ్శాంతి పరం గా) నడపగలవు, దేవుని చేరే ప్రయత్నం చేయగలవు.

మంత్రం రావాలా? లేదు, మనసు కావాలి అంతే. మనసు ను మరల్చడానికి, నిలబెట్టడానికి మాత్రమే, అది ఒక దోవ. రామ రామ, శివ శివ, నారాయణ అనుకున్నా చాలు.

దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనలో, ప్రతి ఒక్కరిలో(అంతరంగములో).

మరి (పురాతన)గుడి? ఆ స్ధాయి కి రావడానికి, బడి(ప్రాధమిక పాఠశాల). నేడు వ్యాపార కేంద్రాలు అయ్యాయి.

వేదాలు, గుడి బడిలో ప్రామాణిక గ్రంధాలు, జ్ఞానులకే సరిగ్గా అర్ధం కాని రహస్యాలు అందులో ఉన్నాయి.

గీత, ఒక డిక్షనరి, వేదాల సారంశము. చిన్నప్పటి నుంచి పిల్లలు చదవాలి.

రామాయణ, భాగవత, భారతాలు, వేద సారాన్ని తేలికగా సామాన్యుడికి అర్ధము అయ్యే ల చెప్పే పాఠ్య పుస్తకాలు.

మరి దేవుడు కనపడరే? చూసే శక్తి సాధన అర్హత మనకు ఉన్నాయా మరి. ఒలింపిక్ లో పాల్గొనాలి అంటే అర్హత ఉండాలి, గెలవాలంటే ఎంత క్రృషి ఉండాలి. మరి దేవునికి ఇంకా ఎక్కువ అర్హత కావాలి కదా? మన కంటితో, గాలిని చూడగలమా? కనీసము సూర్యుని ఒక నిమిషము, ఈ కళ్ళతో చూడగలమా?

అంటే ఆయన్ను పొందడం అంత కష్టమా? కాదు, అది మనిషి సాధన మరియు గుణం బట్టి ఉంటుంది. మనం మనసును అదుపులో పెట్టుకోగలిగితే, ఆయన్ను పొందడం చాలా తేలిక. పసి కందు కోసం తల్లి ఆరాటం ప్రేమ, మనలో ఉంటే, ఆయన్ను పొందడం చాలా తేలిక. ఆ మనసును అదుపులో ఉంచాలి అంటేనే, కొంతమందికి కొన్ని జన్మలు పడుతుంది.

మరి ఎవరు పూజ చేయాలి నిత్యం - రజో , తమో గుణం ఉన్న వారు, ప్రతి దినం తప్పులు చేస్తూ, ఖర్మ బాంకు లో పోగేస్తుంటారు వడ్డీ కోసం. వారు దానిని తగ్గించుకో డానికి పూజ , ధ్యానం. లేకుంటే పునర్జన్మ తప్పదు.

సత్వ గుణం ఉన్న వారు , దానిని నిలుపుకోడానికి సాధన ధ్యానం కావాలి. మననం లేకపోతే మతిమరుపే కదా, లేకపోతే వెంటనే మాయ కమ్ముతుంది.

దేవుళ్ళు ఎందరు? ఒకరే. కానీ మనిషి బుద్ధి ప్రకారం, ఎన్నో రూపాలు. బంగారం ఒకటే, ఆభరణాలు కోట్లు. సూర్యుడు ఒకరే, కిరణాలు కోట్లు. మట్టి ఒకటే, మట్టి పాత్రలు ఎన్నో.

నైవేద్యం, పూలు పెట్టాలా? అవును మన మనసే(బుద్ది) నైవేద్యం కావాలి, మనసే(బుద్ది) మంత్ర పుష్పం గా ఉండాలి.

భౌతిక నైవేద్యం ఎవరికి? ఆయనకు కాదు, మనకు తిండి లేని అన్నార్తులకు. అందుకే ఆయన నీరు, ఆకు ,పండు చాలన్నారు. ఇవి, బీద వానికి కూడా దొరుకుతాయి కదా.

మరి (దొంగ)బాబాలు , ఆశ్రమాలు? నిన్ను నువ్వు నమ్మనప్పడు, మనస్సు ను నియంత్రించలేనప్పుడు, దేవుని నమ్మలేవు. కాబట్టి మధ్యవర్తి కోసం వెతుకుతావు, వారి బారిన పడి మోసపోతావు. తండ్రి/ తల్లి, బిడ్డల మధ్య మూడవ వ్యక్తి కావాలా? అంత నమ్మదగ్గ వారు ఉన్నారా, ఆచరణలో చేస్తూ?

మరి గురువు? దేవుని చేరే మార్గం మాత్రమే చెపుతారు. తను సేవలు పొందరు, తనను పూజించ మని చెప్పరు అంగీకరించరు, ఆడంబరాలకు పోరు, ధనం ఆశించరు, ఎప్పుడూ అంతర్ముఖులై ఉంటారు నిత్య సాధనకోసం. మనసు మాటలు ఆచరణ ఒకే విధంగా ఉంటాయి.క్రిష్ణయ్య 18 రోజులు యుద్దం చేయించారు, గురువులా దోవ చూపిస్తూ, క్షణం లో ముగించే శక్తి ఉండి కూడా.

అంతులేని ఉచిత శాశ్వత ఆనందం(బ్రహ్మానందం) ఎక్కడ ఉంది? మన అంత రంగములో నే ఉంది. దానికి దోవ, నీలో నువ్వు మాత్రమే, వెతుక గలవు. బయట ఆనందములు, ఖర్చుతో కూడిన, క్షణికములు, అశాశ్వతములు.

మాయ - మానవుని కి దేవునికి మధ్య ఉన్న చిన్న తెర. ప్రతి క్షణం జీవుని, మోహం వైపు లాగుతుంది.

ఆత్మ పరమాత్మ బంధము ? చెంబు/గ్లాసు లో సముద్రపు నీరు, సముద్రము. రెండూ ఒకటే. ఒకటి పాత్ర వరకే పరిమితము ఆయ్యింది, తాను వేరు అని అనుకుంటుంది.

దేహము - చొక్కా లాంటిది మాత్రమే. క్షణము లో ఎప్పుడైనా చినిగి పోవచ్చు. కొత్త చొక్కా తప్పదు, కర్మ ఫలితాల కోసం, మోక్షం పొందనంత వరకు. దేహ సుఖం కోసం కాదు, ఆత్మ జ్ఞానం కోసం ఈ జన్మ.

ఇంద్రియాలు - అదుపులో పెడితే, దేవునికి దగ్గర చేస్తాయి. అదుపు తప్పితే, దేవుని దూరం చేస్తాయి. ఎప్పుడూ బయటకు పరుగులు తీస్తాయి, నిన్ను లోనకి చూడనివ్వక.

సాధన - మనము పరమాత్మ ఒకటే అని తెలుసుకోవడము. మిగతా వారిని, పరమాత్మ లో భాగం గా చూడడం. ఏది తగ్గినా, ఇంకా సాధన పండలేదు అని అర్ధం.

పెళ్ళి - లక్ష్మీ నారాయణులు లాగా ప్రపంచానికి, దేవునికి, సమాజానికి, కనీసం తల్లి దండ్రులకు ఉపయోగపడే రాముడు/ సీత లాంటి సత్సంతానం/ వంశాభివ్రుధ్ధి కొరకు. గ్రుహస్త ధర్మం నిర్వర్తిస్తు, దైవ బ్రహ్మచారులకు, సాధువులకు అన్నం అందించేందుకు.

కామం - లక్ష్మీ నారాయణులు లాగా కేవలము ధర్మపత్నితో, (పైన చెప్పిన) సత్సంతానం పొందేందుకు మాత్రమే.

జీవిత లక్ష్యం - అంతరంగములో పరమాత్మను పొందడం, అంటే మోక్షం, అంటే అరిషడ్వర్గాలను జయించడం, అంటే ఆత్మ జ్ఞానం పొందడం.

ఇవన్నీ చేయకుండా అధర్మము గా ఉంటే, ఇవే కష్టాలు బాధలు పడుతూ, ఎన్నో జన్మ చక్రాలు, ఫలితాల కోసం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 584 General Articles, 46 Tatvaalu
Dt : 09-Aug-2019, Upd Dt : 09-Aug-2019, Category : Devotional
Views : 1774 ( + More Social Media views ), Id : 32 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : devotional question answer , god , puja , sadhana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు