అమ్మ కు కూడా, జోల పాడే అవకాశం వచ్చిందా? పాడారా? - కునుకు పడితె మనసు కాస్త - Songs - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 990 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

చిన్నప్పుడు మన అమ్మ జోల పాడటం, మనందరికీ తెలుసు. ఊహ వచ్చిన తర్వాత, ఇతరుల దగ్గర చూస్తామే కానీ, మనకు మన అమ్మ జోల పాడింది, దాదాపుగా గుర్తు ఉండదు. చాలామంది కి, ఆ జ్ఞాపకాలు కృతజ్ఞతలు కూడా ఉండవు, అది వేరే విషయం.

అప్పుడప్పుడు అమ్మ, గతం గుర్తు తెచ్చుకుని బాధ పడుతూ ఉంటుంది, నిద్ర పోకుండా. ఎంతమంది కి ఎన్ని చేసాను రెక్కలు ముక్కలు చేసుకుని, అందరూ అన్ని మరచి పోయారు అని. ఆఖరికి తోడబుట్టిన వాళ్ళ కు, కడుపు న పుట్టిన వాళ్ళ కు, ఇంట్లో 4 రోజులు ఉండి చేయించుకున్న వాళ్ళ కు కూడా, కాని దానిని అయ్యాను. ఊళ్ళో చూసే దిక్కు లేక, ఎంత దూరం రావాల్సి వచ్చింది, అని ఒక్కోసారి నిద్ర పోదు.

అప్పుడు బుజ్జగించి, లాలించి చెపుతా. కొంత లేటు ఉన్నా, తర్వాత అదే వరుస లో వారూ ఉన్నారు, కర్మ ఎవరినీ వదలదు. వాళ్ళు వదలడం కూడా, దేవుడు నీకే మంచి చేశాడు, రేపొద్దున మన ఊరు వెళ్ళిపోయినా, 6 సంవత్సరాల ప్రపంచ అత్యుత్తమ వైద్యం, మనలాంటి మధ్య తరగతి ఇళ్ళు లో, ఇంటి పోరు లేకుండా, ఈ 75 ఏళ్ళ వయస్సు లో దొరకదు, అసంభవం. ఆ అదృష్టం నీకు మాత్రమే దక్కింది ఎన్ని జన్మల పుణ్యమో.

నీకు తోడుగా నన్నే పెట్టాడు సేవకుడిగా కదా దిగులెందుకు, నిద్ర పో 4.30 కి లేచి దేవుని బాధ పెట్టాలి పడుకో, నా బంగారు తల్లి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, అని కాళ్ళు పడుతూ నచ్చ చెపుతా.

ఇక నా సంగతి ఆలోచనే చేయకు. ఆయన చేతిలో బంతిని, ఎట్లా ఆడిస్తారో ఆయన ఇష్టం. జనం పొగడ్తలు తెగడ్తలు అన్ని ఆయనకే. ఇదంతా ఆయన ఇచ్చారు అడగకుండానే, ఆయనే వేగంగా వెనక్కు తీసుకుంటున్నారు, బంధ విముక్తులను చేయటానికి. మనం నిమిత్త మాత్రులం.

అని ఏవో మాటలు జోకులు చెప్పి నవ్విస్తూ, ఇదిగో ఈ పాట జోల పాటగా పాడుతూ, కన్నతల్లి ని నిద్ర పుచ్చుతూ ఉంటా, వారానికి కనీసం 2 సార్లు. మరి మీ అమ్మ కు కూడా, జోల పాడే అవకాశం వచ్చిందా? పాడారా? మీ మనసు బాధ ముచ్చట్లు ఇతరుల తో పంచుకోగలరు.

* * * మీకు తెలిసిన పాటే, మొదటి 2 చరణాలు

పాడుతా తీయగా చల్లగా 2
పసి పాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా ||

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది 2
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు 2
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు, పాడుతా ||

గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు 2
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు 2
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, పాడుతా||

మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపోతది 2
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది 2
జనమ జనమకది మరీ గట్టిపడతది, పాడుతా ||

మనందరికీ చివరి రోజుల్లో తప్పనిసరి ఈ బాధలు. అందుకే, మనం ఆ తప్పు చేయకూడదు, అదే నరక యాతన పడకూడదు.

Mooga muga manasulu, ANR, Ghantasala
Sample  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1018 General Articles, 46 Tatvaalu
Dt : 26-Dec-2020, Upd Dt : 26-Dec-2020, Category : Songs
Views : 128 ( + More Social Media views ), Id : 888 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : sing , lali jola pata , mom , sleep , mooga , muga , manasulu , anr , savitri , kunuku padite
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content