Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. *ఆధ్యాత్మిక దేశభక్తి - నేను నా దేశం, వినరా వినరా దేశం మనదేరా, నేను సైతం ప్రపంచాగ్నికి, జననీ జన్మ భూమిశ్చ*
నిన్న కధనములో చదివాము, ముక్కు మూసుకుని జపము చేస్తూ ఉంటే, దేవుడు సంగతి తర్వాత, గురువు గారే కాదు, ఆఖరికి అన్నము కూడా దానంతట అది వండుకుని, మన నోటి దగ్గరకు రాదు, అని అర్ధము అయ్యింది అనుకుంట.
ఎందుకంటే, ఆ మహా విష్ణువే, వైకుంఠములో యోగ నిద్రలో, శక్తి ధ్యానము లో ఉంటే సరి పోతుంది కదా? మరి భూమిపై అవతారములు ఎత్తి, మన మనుషులు లాగా, నానా పాట్లు పడి, మంచి దోవలు, తెలివితేటలు, కర్తవ్య బోధ చెయ్యడము ఎందుకు?
రాముడు, క్రిష్ణుడు చేసింది చూపింది దేశ భక్తే కదా? ధర్మం కోసం ప్రజల కోసం పోరాటం కదా?
మరి మన పోరాటం ఎవరి కోసం? కేవలం అరిషడ్వర్గాలకు బానిసలమై, మన ఆస్తులు అహంకారం మోహం పెంచుకుని, సంస్కారం సహకారము తగ్గించుకుని, మన పిల్లల బుద్దులు పనిచేయకుండా, శుంఠలుగా తయారు చెయ్యడం కోసం, మనము ఆశ్రమములో కన్నీళ్ళు తో అనాధలుగా ఒంటరి బ్రతుకులు కోసం అంతేనా?
దేవుని తత్వమును అర్ధము చేసుకుని, దాని ఆచరించబట్టే, ఆది శంకరులు వంటి వారు, దేశాటన 3 సార్లు చేసి, తమ సంస్క్రుత వాదనతో మూర్ఖులకు బుద్ది చెప్పి, 4 దిక్కుల 4 పీఠాలు స్థాపించారు, ధర్మ ప్రచారం కోసం, దేశ రక్షణ సంక్షేమం కోసం. అది కూడా దేశ భక్తే కదా?
మరి మనము? ఏమండీ ఇంట్లో మూలన కూర్చుని, మన ముఠాలో 10 మంది కలసి భజనే నామమే, మనల్ని కలియుగములో దైవానికి చేరుస్తుంది, ఇక మేము సజీవ మనుషులకు గురువులకు సేవ చేయము, ఇతర మనుషులను జీవులను గుర్తించము సహాయము చెయ్యము అంటే, నామ స్మరణకు భజనకు విలువ ఉందా? నరుని సేవ చేయనిచే నారాయణ సేవ కిందకు రాదు. అంటే, అది చేయనిదే, మనకు దేశ భక్తి లేదు.
అశోకుడేలిన, ధర్మ ప్రదేశం. బుద్దుడు వెలసిన, శాంతి దేశం. కదం తొక్కిన, వీర శివాజీ.
వీర విహారిణి, ఝాన్సీ రాణి, స్వరాజ్య సమరుడు అల నేతాజీ. కట్ట బ్రహ్మన్న పుట్టిన దేశం. ఆజాదు, ఘోకలె, వల్లభ, పటేలు, లజపతి, తిలక్, నౌరోజిలు, అంబులు కురిపిన మన అల్లూరి. భగత్ రక్తము చిందిన దేశం.
వీరంతా ఆధ్యాత్మిక వాదులు కాదా? దేవుని సేవ చేసినట్లు కాదా, నరుల సేవ ద్వారా? వీరికి లేని గుడి, మన తెలుగు దేశములో, పరాయి భాషల బాబాయిల కెందుకు, సొంత తండ్రులను వదలి?
వీరంతా దైవ నామస్మరణ తో ఇంట్లో కూర్చుంటే, స్వాతంత్రము వచ్చేదా? ఈ రోజున, మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉంటే, వాటి గురించి అందరమూ ప్రశ్నిస్తే, అవినీతి తరిగిపోదా? నేను బాగుంటే చాలు అనుకునే బుద్ది ఉంటే, వారు భక్తులు ఎలా అవుతారు?
కనీసం పాము/ నక్క, పులి, ఆవుల లక్షణాలు ఉన్న నాయకుల లో, ఉత్తములను ఎన్నుకుందాము అన్న, నీతి నిజాయితీ ఇంగితము కూడా మనకు లేదే? దీనిని కూడా, దేశ భక్తే, దైవ భక్తే, మాత్రు భక్తే అందామా? మనల్ని మనమే మోసం చేసుకుందామా? మన పిల్లల్ని మనమే బానిసలు గా చేద్దామా?
తరం మారిన, గుణమొక్కటే. స్వరం మారిన, నీతొక్కటే. భాష మారిన, పలుకొక్కటే. విల్లు మారిన, గురి ఒక్కటే. దిశ మారిన, వెలుగొక్కటే. లయ మారిన, శ్రుతి ఒక్కటే. అరె ఇండియా, అది ఒక్కటే, మనమంతా ఒక్కటే, లేరా...అని మనము గట్టి గా అనలేమా, సహాయము చేయలేమా?
నేను సైతం, ప్రపంచాగ్నికి, సమిధనొక్కటి, ఆహుతిచ్చాను. నేను సైతం, విశ్వ వృష్టికి, అశ్రువొక్కటి ధారపోశాను అన్న శ్రీ శ్రీ పలుకులను, ఏనాడైనా ఆచరణ లోకి మన కుటుంబం తెచ్చినదా? ఇవి అనలేనప్పుడు, చేయలేనప్పుడు, మనము గుడికి వెళ్ళి లేదా ఇంట్లో గంట ధ్యానం, జపం వలన ప్రయోజనం?
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి, ఏ తల్లి మనల్ని కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, అని ఆవు లాంటి రాముడు లాంటి నాయకులను ఇకనైనా ఎన్నుకుందామా తెలుగు నేలపై, ప్రతి ఊరిలో, గ్రామములో?
1) నేను నా దేశం పవిత్ర భారతదేశం....... నేను నా దేశం (1973)
నేను నా దేశం.., పవిత్ర భారతదేశం
సాటి లేనిది, ధీటు రానిది
శాంతికి నిలయం, మన దేశం ||నేను నా దేశం||
అశోకుడేలిన, ధర్మ ప్రదేశం
బుద్దుడు వెలసిన, శాం..తి దేశం
బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి ||అశోకుడేలిన||
కులమత భేధం మాపిన త్యాగి
అమర బాపుజీ వెలసిన దేశం...
వందే..మాతరం వందే..మాతరం వందే..మాతరం ||కులమత||||నేను నా దేశం||
కదం తొక్కిన, వీర శివా.జీ
వీర విహారిని, ఝాన్సీ రా.ణి
స్వరా.జ్య సమరుడు, అల నేతాజీ
జై హింద్...జై హింద్..జై హింద్ ||స్వరా.జ్య||
కట్ట బ్రహ్మన్న, పుట్టిన దేశం ||నేను నా దేశం||
ఆజాదు, ఘోకలె, వల్లభ, పటేలు, లజపతి, తిలక్, నౌరో.జిలు 2
అంబులు కురిపిన, మన అల్లూరి..
భగత్ రక్తము చిందిన దేశం
హిందుస్థాన్ హమరా హై 3 ||నేను నా దేశం||
గుళ్ళ తుపాకి చూపిన దొరలకు, గుండె చూపే మన ఆంధ్రకే.సరి..
శాంతి దూత మన జవహర్ నెహ్రు..2
లాల్ బహదూర్ జన్మ దేశం
జై జవాన్..జై కిసాన్ ||నేను నా దేశం||
చిత్రం : నేను నా దేశం (1973), సంగీతం : సత్యం, రచన : అన్కిశ్రీ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల
Nenu Naa Desam, 1973, Ramakrishna, P Susheela, M. Sathyam, Geethanjali
2) వినరా వినరా, దేశం మనదేరా..
అనరా అనరా, రేపిక మనదేరా.. - 2 లైన్లు 2 సార్లు
నీ ఇల్లు ఆంధ్ర దేశమని, నీ.వే. తెల్పినా.
నీ నామం ఇండియ నంటూ, నిత్యం చాటరా.. ||వినరా వినరా||
తరం మారిన, గుణమొక్కటే
స్వరం మారిన, నీతొక్కటే
భాష మారిన, పలుకొక్కటే
విల్లు మారిన, గురి ఒక్కటే
దిశ మారిన, వెలుగొక్కటే
లయ మారిన, శ్రుతి ఒక్కటే
అరె ఇండియా, అది ఒక్కటే, లేరా...
ఏలా ఏలా, నీలో దిగులంటా..
వేకువ వెలుగు, ఉందీ ముందంటా..- 2 లైన్లు 2 సార్లు
రక్తంలో భారతతత్వం, ఉంటే చాలురా.
ఒకటైనా భారతదేశం, కాచేను నిన్నురా. ||ఏలా ఏలా||
నవ భారతం, మన దేనురా
ఇది సమతతో, రుజువా యెరా
మన ప్రార్థమే, విలువాయెరా
నీ జాతికై, వెలిసిందిరా
ఉపఖండమై, వెలిగిందిరా
నిశిరాలనే, మరిపించెరా
ఈ మట్టియే, మన కలిమిరా, లేరా...
Movie : Roja, Lyrics : RajaSri, Music : A R Rahman, Singer : Mano, Cast : Arvind Swamy, Madhubala
Vinara Vinara Desam Manadera, Roja, A. R. Rahman
3) నేను సైతం, ప్రపంచాగ్నికి, సమిధనొక్కటి, ఆహుతిచ్చాను
నేను సైతం, విశ్వ వృష్టికి, అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం, భువన ఘోషకు, వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను..
నేను సైతం, ప్రపంచాగ్నికి, సమిధనొక్కటి, ఆహుతిచ్చాను..
అగ్నినేత్ర, మహోగ్ర జ్వాల దాచినా, ఓ రుద్రుడా
అగ్నిశిఖలను, గుండెలోనా, అణచినా, ఓ సూర్యుడా
పరశ్వధమును, చేతబూనిన, పరశురాముని, అంశవా.
హింస నణచగ, ధ్వంస రచనలు చేసినా ఆచార్యుడా
మన్నెం వీరుడు, రామరాజు, ధనుష్టంకారానివా . . .
భగత్ సింగ్, కడసారి పలికిన, ఇంక్విలాబ్ శబ్దానివా
అక్రమాలను, కాలరాసిన, ఉక్కుపాదం, నీదిరా.
లంచగొండుల, గుండెలో, నిదురించు సింహం, నీవురా
ధర్మదేవత, నీడలో, పయనించు యాత్రే, నీదిరా
కనులు గప్పిన, న్యాయదేవత, కంటి చూపైనావురా
సత్యమేవ, జగతికి, నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల, ఆశాజ్యోతివై నిలిచావురా ||నేను సైతం||
Movie : Tagore, Lyrics : Suddaala Ashok Teja,
Music : Manisharma, Singer : S P Balu
Nenu Saitham, TAGORE, ఠాగూర్ , chiranjivi
4) జననీ జన్మ భూమిశ్చ… స్వర్గాదపీ గరీయసి, స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో… ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మ భూమిశ్చ… స్వర్గాదపీ గరీయసి. స్వర్గాదపీ గరీయసి
Starring: Sr.N.T.R, Sridevi, Jayachitra, Music :J. V. Raghavulu, Lyrics-Dasari Narayana Rao, Singers : S.P. Balu, Year: 1982 Bobbili Puli, NTR బొబ్బిలి పులి
మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,322,049; 104 తత్వాలు (Tatvaalu) and views 252,234 Dt : 12-Aug-2022, Upd Dt : 12-Aug-2022, Category : Songs
Views : 735
( + More Social Media views ), Id : 1493 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
desabhakti ,
desam ,
vinara ,
manadera ,
nenusaitam ,
prapanchagniki ,
janani ,
janmabhuamischa ,
Roja ,
TAGORE ,
Bobbili Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments