ఆధ్యాత్మిక దేశభక్తి - జన గణ మన, వందేమాతరం, సారే జహాసె అచ్ఛా, ఝండా ఊంఛా రహే - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,321,922; 104 తత్వాలు (Tatvaalu) and views 252,229.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

जनगणमन अधिनायक, జన గణ మన, Jana Gana Mana
वन्दे मातरम, వందేమాతరం, Vande Mataram
सारे जहाँ से अच्छा, సారే జహాసె అచ్ఛా, Sare Jahan Se Accha
झण्डा ऊँचा रहे हमारा, ఝండా ఊంఛా రహే హమారా, Jhanda Ooncha Rahe Humara

అబ్బా, ఏమిటీ ఈ మాటల పాటల తలనొప్పి అని వెంటనే డిలీట్ చెయ్యడం, ఆపేయడం, క్షణము పని, ఎక్కువ మంది రజో తమో గుణ ప్రధానులకు. ఎందుకంటే తాము వాక్సుద్ది సంస్కారం నేర్చుకోలేరు, తమ పిల్లలకు నేర్పలేరు కాబట్టి. తమకు తెలియంది ఆచరించనిది వారికి నచ్చదు, మంచి కోసం అవి నేర్చుకోవడానికి గంటలు పడుతుంది, మరి ఇవి నచ్చవు. మరి దేశ భక్తి ఎలా అబ్బుతుంది, వికసిస్తుంది?

అదే సాత్వికుల ఆలోచన ఇలా ఉంటుంది - ఆహా, అల్పుడైన మా శిష్యుడే ఇంత ప్రయత్నము రాత గొంతు తో చేస్తుంటే, ఇప్పుడుకైనా 30 ఏళ్ళకు, మేము ఎందుకు ఇవి నేర్చుకోకూడదు, రేపు మనది కాదు, మా పిల్లల కైనా నేర్పించి ఒక్కరితో నైనా, శభాష్ అని అనిపిస్తాము. ఎందుకంటే, ఇది ఆరోగ్యం కూడా, దేవునికి మానసిక నైవేద్యం కూడా, అని శిష్యులను ఎప్పుడూ మెచ్చుకుంటూ, 10 మందికి చూపిస్తారు వినిపిస్తారు, తమ చివరి రోజుల కష్టాలను సరిచేసుకుంటారు.

భక్తి గౌరవము క్రుతజ్ఞత విశ్వసనీయత సత్ప్రవర్తన అనే గుణాలు/ లక్షణాలు/ ప్రవర్తనలు, ఇవి అన్నీ ఒక వ్యక్తి లో కనీసం 10 వ తరగతి (15 ఏళ్ళు) లోపే ఉన్నాయి అంటే, అవి అందరి ఎడల ఒకే విధముగా ఉంటాయి.

ఆ వ్యక్తికి పెంపక సంస్కారము కూడా ఉంటే, జీవితాంతము ఆ గుణాలు వెలుగుతూ ఉంటాయి. ప్రాపంచిక సుఖాలు/ ఆస్తులు తుచ్చమని భావిస్తారు. ధర్మం కోసం, తప్పుడు బంధాలు నిర్మొహమాటముగా వదిలేస్తారు.

మొక్కై వంగనిదే, మానై వంగదు కదా? చెడ్డవారికి, ఏదైనా పెద్ద ఎదురు దెబ్బ తగిలితే తర్వాత వంగుతుందేమో, కొన్ని సార్లు/ రోజులకు, మరి. వాసనలు త్వరగా వీడవు, త్వరగా అంటుకోవు, కఠిన సాధన లేనిదే.

మనిషిని బట్టి, ఈ ఉత్తమ గుణాలు/ లక్షణాలు మారవు కదా? స్థితిని/ పరిస్తితిని/ ఉన్నతిని బట్టి మారవు కదా? లక్షణాలు/ ప్రవర్తనలు మారాయి అంటే, వారు ఊసరవెల్లి తో సమానము.

అంటే 2 నాల్కల చాటు కపట తప్పుడు మనిషి, అరిషడ్వర్గాల బానిస, రాక్షస ప్రవ్రుత్తి కన్నా హీనం. ఇటువంటి వారు, తమతో పాటుగా, తమ కుటుంబాన్ని, తమ స్నేహితులకు బంధువులకు కూడా, ఏదో ఒక రోజు, అరిషడ్వర్గాలతో పతనమయ్యే సదవకాశాన్ని తప్పక కలిగిస్తారు.

అందుకే వీరితో జాగ్రత్తలతో ఉండాలి సుమా. మనం మోహం బయట ఉంటేనే, ఇతర జీవుల తీరు ఆలోచనా సరళి, అర్ధం అవుతుంది.

మరి వీరు సొంత ముదుసలి తల్లి దండ్రుల/ అత్త మామల సేవ చేస్తారా, గౌరవిస్తారా? చేయరు. కనీసం, పిలుపు దూరములో ఉంచుతారా? ఉంచరు. కనీసం స్వార్ధం లేకుండా, వీరికి సేవ చేస్తారా? చేయరు.

మరి వీరు దేవుని సేవ/ పూజ/ మానసిక నివేదన, త్రికరణ శుద్ది గా చేస్తారా? మానవ సేవ లేకుండా, క్రుతజ్ఞత/ విశ్వసనీయత లేకుండా, దేవుని ఎదురు నటన సేవ వలన, ప్రయోజనం శూన్యం కాదా?

మరి అప్పుడు వీరికి దేశభక్తి ఉంటుందా? కనీసం గ్రామ/ ఊరు/ బజారు/ స్నేహిత/ బంధు భక్తి కూడా ఉండదు. కేవలం సొంత లాభం/ స్వార్ధం తప్ప. ముందు అందరికీ, వీరు నష్టం/ మోసం చేసినా, చివరకు నష్టపోయేది, వీరు వీరి కుటుంబమే సుమా.

ఒకరు పదిమందిని మోసం చేసి, కోటి సంపాదిస్తే, తర్వాత వాని పిల్లలు ఇంకొకరితో కలసి వ్యాపారం చేసి, అంతా మోసపోయారు అంట. సంపూర్ణం అయ్యింది, పిల్లల బతుకు బజారు పాలు అయ్యింది. పిల్లల పతనానికి కారణం, తండ్రి మోసం కాదా?

తేనే ఎవరికైనా తీపినే, విషం ఎవరికైనా మరణమే. మల్లెపూవు/ గంధము/ సాంబ్రాణి ఎవరికైనా సువాసనే. ఇది భగవంతుని స్రుష్టి రహస్యం మూలం, ఒకే మాట ఒకే బాట. మనము ఏది ఇస్తామో, అదే తిరిగి వస్తుంది.

అందుకే నీతి నిజాయితీ ధర్మం ప్రేమ సంస్కారం ఇతరులకు ఇవ్వు, అవే మనకు తిరిగి వస్తాయి. కపటం మోసం అవినీతి మాటతప్పడం ఇతరులకు ఇవ్వు, అవే మనం చావబోయేలోపు వెంటపడి మరీ, రుణం తీర్చుకుంటాయి.

మన శాస్త్రాలు చెప్పిన ఈ మాటను, తర్వాత న్యూటన్ సిద్దాంతముగా, చర్యకు ప్రతి చర్య ఉంటుంది అని కనుగొన్నారు. చతుర్వేదాలు, నవగ్రహాలు, పంచపాండవులు, కౌరవ శత పుత్రులు, అష్టోత్తరము, శతావధాని, సహస్ర నామాలు తో అంకెలు ఎప్పుడో మన పెద్దలు కనుక్కుంటే, ఇప్పుడు ఎవరో కనుక్కునారని, మనల్ని నమ్మిస్తున్నారు.

అందుకే మన శాస్త్రములో, వినాయకుని చే, సొంత తల్లి దండ్రులు శివ పార్వతులకు ప్రదక్షిణలు చేయించారు, గణాల ఆధిపత్యమునకు. మాతా పితల ప్రదక్షిణమే విశ్వ ప్రదక్షణము. కనీసం సొంత మాతా పిత సేవ యే, మానవ సేవ. అది లేకుండా, దైవ భక్తి పూజ, త్రికరణ శుద్ది గా చేయలేము. ఊరు ను, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎటూ ప్రేమించలేము. అంటే, సొంత జీవిత భాగస్వామికి, సంతానానికి కూడా, సంస్కారము మనశ్శాంతి ఇవ్వలేము.

ఇప్పుడైనా, అరిషడ్వర్గాలను జయిస్తూ, నిస్వార్ధ మానవసేవ, సమాజ సేవ చేస్తూ, దేశాన్ని దేవుని మాతాపితలను త్రికరణ శుద్ది గా ప్రేమిద్దాము. ఒకే మాట ఒకే బాట గా ఉంటూ, ఈ కింది, జాతీయ గీతలను పాడుకుందాము. ఇవి, భారత దేశం అంతా వినిపించే పాటలు సుమీ.

1) Jana Gana Mana जनगणमन अधिनायक జన గణ మన

జన గణ మన, అధినాయక జయ హే భారత భాగ్య విధాతా!
పంజాబ సింధు, గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ..
వింధ్య హిమాచల, యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే.,
గాహే తవ జయగాథా.।

జనగణ మంగళ దాయక జయ హే, భారత భాగ్య విధాతా!
జయ హే..! జయ హే..! జయ హే..! జయ జయ జయ జయ హే..।।
జై హింద్‌!

జనగణమన, భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది.

2)Vande Mataram वन्दे मातरम వందేమాతరం
వందేమాతరం.., వందేమాతరం..

సుజలాం.., సుఫలాం.., మలయజ శీతలా.మ్
సస్యశ్యామలాం., మాతరం., వందేమాతరం..

శుభ్రజ్యోత్స్న, పులకిత, యామినీమ్...
ఫుల్ల కుసుమిత, ద్రుమదళ శోభినీమ్..
సుహాసినీం., సుమధుర భాషిణీమ్..,
సుఖదాం, వరదాం, మాతరం., వందేమాతరం..

కోటి కోటి కంఠ, కలకల నివాద కరా.లే..
కోటి కో.టి, భుజైr ధృత, కర కర వాలే
అబలా.కేనో మాం, ఎతో బలే.
బహుబల ధారిణీం., నమామి తారిణీం.
రిపుదల వారిణీం., మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ.., తుమి హృది తుమి మర్మ..
త్వంహి ప్రాణః శరీరే., బహుతే. తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి..
తో మారయి ప్రతిమా, గడి మందిరే మందిరే, వందే..మాతరం

త్వంహి దుర్గా, దశ ప్రహరణ ధారిణీ..,
కమలా కమలదళ, విహా.రిణీ..
వాణి విద్యా దాయినీ.., నమామిత్వాం., నమామి కమలాం.
అమలాం అతులాం, సుజలాం సుఫలాం మాతరం, వందే..మాతరం

శ్యామలాం సరళం, సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం, మాతరం వందే.మాతరం, వందేమాతరం

భారతమాతకు వందనం, తియ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోధిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం.

బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

3) Sare Jahan Se Accha सारे जहाँ से अच्छा సారే జహాసె అచ్ఛా

సారే జహాసె అచ్ఛా, హిందుస్తాన్ హమారా హమారా
సారే జహాసె అచ్ఛా, హిందుస్తాన్ హమారా..
హమ్ బుల్ బులే హై ఇస్‌కీ,
యే గుల్ సితా హమారా.., హమారా.. ||సారే జహాసె అచ్ఛా||

పరబత్ వో సబ్ సే ఊంఛా.., హమ్‌సాయా ఆస్‌మాన్ కా.. 2
వో సంతరీ హమారా.., వో పాస్‌బా హమారా.., హమారా ||సారే జహాసె అచ్ఛా||

గోదిమే ఖేల్‌ తీహై.., ఇస్‌కీ హజారో నదియా. 2
గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే, రష్‌కే జినా హమారా హమారా ||సారే జహాసె అచ్ఛా||

మజ్ - హబ్ నహీ సిఖాతా.. , ఆపస్‌మె బైర్ రఖ్‌నా.. 2
హిందీ హై హమ్, హిందీ హై హమ్, హిందీ హై హమ్, వతన్ హై
హిందుస్తాన్ హమారా హమారా ||సారే జహాసె అచ్ఛా||

హమ్ బుల్ బులే హై ఇస్‌కీ, యే గుల్ సితా హమారా హమారా ||సారే జహాసె అచ్ఛా||

సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా 3

4) Jhanda Ooncha Rahe Humara झण्डा ऊँचा रहे हमारा ఝండా ఊంఛా రహే హమారా

ఝండా ఊంఛా రహే. హమారా.
విజయీ విశ్వతిరంగా ప్యారా ॥ఝండా॥

సదా శక్తి, బర్సానే వాలా
ప్రేమ సుధా, సర్సానే వాలా - 2
వీరోంకో, హర్షానే వాలా
మాతృభూమికా, తన్ మన్ సారా ॥ఝండా॥

స్వతంత్రతాకీ, భీషణ రణ్ మే
లగ్​కర్ బడె, జోష్ క్షణ్ క్షణ్ ​మే 2
కావే శత్రు, దేఖ్​కర్ మన్​మే
మిట్ జావే, భయ్ సంకట్ సారా ॥ఝండా॥

ఇస్ ఝండేకే, నీచే నిర్భయ్
లే స్వరాజ్య యహ, అవిచల నిశ్చయ్ 2
బోలో భారత్, మాతాకీ జయ్
స్వతంత్రతా హి, ధ్యేయ్ హమారా ॥ఝండా॥

ఇస్ కీ షాన్, నీ జానే పావే
చాహె జాన్, భలేహి జాయె 2
విశ్వ విజయ, కర్ కే దిఖ్ లావే
తబ్ హూవే, ప్రణ పూర్ణ హమారా ॥ఝండా॥

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.

Jana Gana Mana Vande Mataram Sare Jahan Se Accha Jhanda Ooncha Rahe Humara  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,321,922; 104 తత్వాలు (Tatvaalu) and views 252,229
Dt : 14-Aug-2022, Upd Dt : 14-Aug-2022, Category : Songs
Views : 877 ( + More Social Media views ), Id : 1495 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : desabhakti , Jana , Gana , Mana , VandeMataram , Sare , Jahan , Accha , Jhanda , Ooncha , Rahe , Humara , august
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content