Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. శుభోదయం, శుభ దినం, శుభ సంకల్పం. శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు.
తీపి చేదు పులుపు, వివిధ రుచుల మిశ్రమమే ఉగాది పచ్చడి. అలాగే కష్ట సుఖాల మిశ్రమమే, జీవిత గమ్యము.
ప్రభుత్వం మాట విని, ఇంట్లో నే స్వచ్చంద నిర్భంధము లో ఉండి, మన ప్రభుత్వం కు, పోలీసులు కు సహకరించుదాం. వారంతా చెప్పేది, మన మంచి కోసమే. మిగతా ప్రపంచ భయంకర పరిస్తితులను చూస్తే, మనము బయటకు రాలేము, జాగ్రత్త పడాలి ముందే.
మన జిల్లా యువ ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ గారు, నగర వీధుల్లో తిరుగుతూ, రక్షణ చర్యలు చేపట్టడం ఫేస్బుక్ లో చూసి ఆనందించాం, గర్వ పడ్డాము. ఎస్పీ గారికి ధన్యవాదాలు. మా జన్మ పట్టణం లో కూడా, బందోబస్తు బాగుంది.
ఆసుపత్రులకు, పని భారం పెంచకుండా ఉండాలి మనము. ఆరోగ్యం కాపాడుకుంటూ ఇంట్లో నే ఉండి, కుటుంబం కు అండగా ఉందాం.
సీనియర్ అమ్మ తో కలసి, విదేశాల్లో మేమూ, మీ కన్నా వారం ముందు నుంచే, ఇంట్లో స్వచ్ఛంద నిర్బంధం లో ఉన్నాము, మా ప్రభుత్వం మాట విని బుద్ధి గా. మా పోలీసులు కూడా ప్రజలతో మమేకమౌతారు. అలాగే మేమూ భయము లేకుండా వారికి సమాచారం అందిస్తాము, సహకరిస్తాము.
పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపాలి మనము. వారి ధైర్య సాహసాలను మెచ్చుకోవాలి. పరస్పర గౌరవం తో ముందుకు సాగాలి.
బాధ్యత గల పౌరులుగా, ఇంట్లో ఉండి, దేశాన్ని మరియు కుటుంబాన్ని, కాపాడుకుందాం. ఇదే తేలిక మార్గం. ధన్యవాదాలు, నమస్కారాలు.
జిల్లా ప్రవాసాంధ్రులు
- - -
గౌరవనీయులు అయిన జిల్లా ఎస్పీ గారికి,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీసుకున్న చర్యలను అమలు జరుపుటకు , చిత్తశుద్ధి తో, మీరు జిల్లా లో అమలు చేస్తున్న కార్యక్రమాలను, ప్రజలలో చైతన్య మును నింపుటకు, మీరు స్వయంగా పాల్గొని తీసుకుంటున్న చర్యలను, మేము జిల్లా ఫేస్బుక్ పేజీ ద్వారా తెలుసుకుంటున్నాము. ఆనందిస్తున్నాము, గర్వపడుతున్నాము.
కొన్ని సార్లు, అన్ని ఊళ్ళ ఫోటోలు కూడా పెడుతున్నారు. మా ఊరు వి కూడా చూస్తున్నాము.
అదే విధంగా, మా చీరాల మండలము నకు కూడా ఒక అఫీషియల్ పోలీసు ఫేస్బుక్ పేజీని తయారు చేసి , ఊరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో, మా లోకల్ ఎస్సై, సీఐ, డీఎస్పీ గార్లు తీసుకుంటున్న చర్యలు ను చూపిస్తూ ఉంటే, మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. మా లోకల్ హీరోలు అయిన వీరి కార్యక్రమాలు, ఆ పేజీ లో అప్లోడ్ చేసిన, ప్రజలకు మరియు దూరంగా ఉన్న మాలాంటి వారికి కూడా ఉత్తేజం కలిగిస్తాయి.
ఇది చాలా చిన్న కోరిక, మీరు గానీ, మా ఊరు డీఎస్పీ గారు గానీ, దీని గురించి ఆలోచన చేసి , మా కోరిక తీర్చ ప్రార్ధన.
మా రక్షణ కోసం, మీ నాయకత్వంలో పాటు పడుతున్న, జిల్లా మరియు మా ఊరు పోలీసు, సిబ్బంది అందరూ కి ఉగాది శుభాకాంక్షలు, ధన్యవాదాలు, వందనాలు.
ఇట్లు
పోలీసుల అభిమానులు, జిల్లా ప్రవాసాంధ్రులు
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,285,686; 90 తత్వాలు (Tatvaalu) and views 176,088 అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments