క్రూజ్ షిప్ - డబ్బులు ఇచ్చి తన్నించుకోవడం, ఇంట్లో హాయిగా 2 సీరియల్స్ చూసుకుంటూ - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,589; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

వైరస్ ఇబ్బందులు, ఇంతింత కాదయా అన్నట్లు గా ఉంది. అందరికీ జ్ఞానం, జాగ్రత్తలు, పద్ధతులు నేర్పుతుంది అని, సంతోష పడాలో బాధ పడాలో, తెలియడం లేదు. దేశంలో ని అన్ని ప్రాంతాలలో కన్నా, భారత జనాభా ఇక్కడ ఎక్కువ.

ప్రతి వారం కోలాహలంగా, ఎంతో సందడే సందడిగా ఉంటుంది. ఒకవైపు భయపడవద్దు అంటూనే, ఇంకోవైపు అన్ని ప్రోగ్రామ్ లను, అంటే జనం గుమి గూడే, అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తున్నారు, ముందు జాగ్రత్తగా.

ఇంతకుముందు మేము ఉద్యోగం కు వెళ్ళాలి అంటే, స్టేషన్ బయట కారుకు ఖాళీ ఉండదు. రైలు లోపల, నిలబడటానికి చోటు ఉండేది కాదు. ఇప్పుడు, వెక్కిరిస్తూ విశాలమైన ఖాళీ, కారు పార్కింగ్ స్ధలం. రైలు లో మంత్రులు కోసం, రిజర్వేషన్ చేసిన భోగీలు లాగా, ఓ పదిమంది జనం అంటే తక్కువ జనం, అని పేపర్లో ఫొటోలు.

ఇంకా చిత్రం, మా రాష్ట్రములో షిప్పింగ్ పోర్టు ఉంది. అక్కడకు దగ్గర లో అర్ధాంతరంగా ఒక క్రూజ్ షిప్ ఆపేయాలని నిర్ణయం చేసారు. క్రూజ్ షిప్, అంటే వారం రోజులు సముద్ర విహారయాత్ర లు చేసే పెద్ద పడవ 10 అంతస్థుల మేడ లో ఓ 2000 మంది పైన జనం ఉంటారు.

వైరస్ భయంతో ప్రభుత్వం, పోర్టు లోపలకు రావడానికి ఒప్పకోలేదు. వారం రోజులు సముద్రం లో నే ఆపేశారు. వైద్య సిబ్బంది హెలికాప్టర్ లో పోయి, దాని మీద దిగి, కొంతమంది జనానికి పరీక్షలు చేసారు. ఆనాడు ఓ 30 మందికి వైరస్ ఉంది అని తేలింది. చాలా చర్చలు తర్వాత, పోర్టు లోనికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు జిల్లా, రాష్ట్రం, దేశం మొత్తం అప్రమత్తం చేశారు. ఆ జనం లో వేరు వేరు రాష్ట్ర, దేశ జనం కూడా ఉన్నారు.

ముందుగా అందరికీ పరీక్షలు చేయనిదే కిందకు దించరు. షుమారు గా 2-3 రోజులు పడుతుంది అంట. వైరస్ ఉన్న లోకల్ వారిని, లోకల్ గా ఒక చోట 14 రోజులు ఉంచుతారు. మిగతా వారిని బస్సు లు, చార్టర్ ఫ్లైట్ లో పంపుతారు. పాపం ఇళ్ళకు, ఎప్పుడు చేరుతారో తెలీదు. పాపం డబ్బులు ఇచ్చి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. ఇంట్లో ఉంటే హాయిగా, రెండు సీరియల్స్ చూసుకుంటూ ఉండేవారు.

ఈ వైరస్ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు వస్తూనే ఉంటారు ఇక మన కోసము. పిల్లల కు జాగ్రత్తలు, సంస్కారం నేర్పుదాం. అంటే ముందు మనం వాటిని నేర్చుకోవాలి కదా. సర్వేజనా సుఖినో భవంతు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,589; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158
Dt : 10-Mar-2020, Upd Dt : 10-Mar-2020, Category : News
Views : 852 ( + More Social Media views ), Id : 393 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , cruise ship , medical care

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content