APLatestNews.com top Banner

Social Media links
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్యం - శభాష్ భూమన, జిల్లా వైద్య అధికారులు - జగన్ రుణం - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

గుర్తు ఉందా, మనం తిరుపతి ఎమ్మెల్యే, అర్బన్ ఎస్పీ, మున్సిపల్ కమీషనర్, కలెక్టర్ గారి గురించి, గొప్పగా రాశాము ఆనాడు. MLA Link, Corp Link, Districts Link, Urban SP Link.

ఎమ్మెల్యే భూమన గారికి, కరోనా పాజిటివ్ అని తెలిసింది, త్వరగానే కోలుకుంటారని, భగవంతుని కృపతో ఆశిద్దాం. వీరంతా మంచితనం, జనం తో కలవడం, కష్టపడటంలో, సోషల్ మీడియాలో ప్రజలకు సూచనలు చేయడం లో, హేమా హేమీలు, బాధ్యత గల వ్యక్తులు.

గుర్తు ఉందా , చిత్తూరు కలెక్టర్ గారికి రెండు శాలరీలు ఇచ్చినా తప్పు లేదనుకున్నాము, ఆయన అంతగా శ్రమిస్తున్నారు మరి, అధికారులను ప్రజలను ఉత్సాహముతో కరోనా జాగ్రత్తలతో ముందుకు నడిపిస్తున్నారు. ఆ అధికారులు అందరూ ప్రకాశం వస్తే, జిల్లా చాలా బాగుపడుతుంది.

ఈరోజు వరకు కూడా, జనం లో తిరుగుతూ, ఈ పెద్ద వయసు లో కూడా భూమన గారు, కరోనా తో శివైక్యం చెందిన సామాన్య జనానికి కూడా, చివర సంస్కారాలు చేశారు, పెద్ద మనసుతో దగ్గర ఉండి, జనం కు ఉన్న భయం అపోహ పోవాలని.

ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, రాష్ట్రం విడిచి లేదా ప్రవేటు ఆసుపత్రికి, తమ సొంత ప్రాణ భయంతో జనం ను, విడిచి వెళ్ళలేదు. ధైర్యంగా, నిజమైన ప్రభుత్వ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ సౌకర్యాల పై నమ్మకమున్న వ్యక్తిగా, స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రిలో, చూయించు కుంటున్నారు.

ఇప్పుడు చెప్పండి, ఆ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్య అధికారులు, గొప్ప వారు కాదా? ఎమ్మెల్యే కు, ప్రజలకు నమ్మకం కలిగించి, ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచగలిగారు అంటే?

ఇది కదా, మన జగనన్న ఉప్పు తిన్నందుకు, ఎమ్మెల్యే ఎంపీ, రుణం తీర్చుకోవడం అంటే? జగన్ ఒక్కరే ఎంతవరకు, ఎన్ని సరిచేస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ బాధ్యత తీసుకోవాలి కదా.

ఆయన మాటలు చూడండి - ఈ రోజు వచ్చిన కోవిడ్ ఫలితాల్లో నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది, నాకు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా కూడా, పాజిటివ్ వచ్చినందున, తిరుపతి లోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో వైద్యం చేయించు కుంటున్నాను. భూమన.

వారికి దైవం అండ తప్పకుండా ఉండాలి.

ఉపసభాపతి బాపట్ల ఎమ్యెల్యే కోనా గారు, రాష్ట్రంలో నే కరోనా చికిత్స పొందారు, విజయవంతం గా కోలుకున్నారు. మీకు తెలిసి, ఇంకెవరైనా ఉంటే చెప్పగలరు. రాష్ట్రంలో నే, జగనన్న మీద అభిమానముతో, కరోనా ను గెలిచిన, ప్రజా నాయకులు అని ఆర్టికల్ రాద్దాం.

చీరాల ఎమ్మెల్సీ సునీత గారు, స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, సందర్శించి వసతులు ఆరా తీసారు.

అలా అందరూ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు, ప్రతిపక్షాలు, వారానికి ఒకరు పర్యటిస్తున్న, ఆసుపత్రి జనం తో మాట్లాడుతూ ఉన్న, కొన్ని మార్పులు తప్పక వస్తాయి.

ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా, బాగా కష్టపడుతున్నారు. తప్పు దోవ పట్టిన, పోలీసులు ను సస్పెండ్ చేశారు. ఆంధ్రా పొలీస్ కి కేంద్రము నుంచి 10 అవార్డులు వచ్చాయి, సాఫ్ట్వేర్ అప్లికేషన్లు తో కలిపి.

Update :

ఒక్క మొనగాడు, ఆదర్శ ఎమ్మెల్యే, జగన్ రుణం తీర్చుకున్న, తిరుపతి ఎమ్మెల్యే భూమన.

జగనన్న పధకాల అమలు ను పర్వవేక్షిస్తూ, స్వయంగా తన కరోనా వైద్యం చేయించుకుంటూ, సామాన్య ప్రజలకు నమ్మకం కలిగిస్తూ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల సేవల ను చర్యలు ను గౌరవిస్తూ , చిత్తూరు జిల్లా ప్రభుత్వ అధికారులు గర్వంగా తల ఎత్తేటట్లు చేసి, ప్రభుత్వ కార్యక్రమంలో భాగమైన నిజమైన ప్రభుత్వ వ్యక్తి.

శభాష్, భూమన గారు. శభాష్ చిత్తూరు మరియు తిరుపతి ప్రభుత్వ యంత్రాంగం. ఇదే మీరు పడ్డ కష్టానికి గుర్తింపు. మీ కష్టం ను , నిజాయితీ చర్యలు ను నమ్మి, ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు, అంటే అది మీ గొప్ప తనము కూడా.

మనం గతంలో చిత్తూరు తిరుపతి అధికారులు గురించి రాసిన ఆర్టికల్, లింక్ లు అందులో చూడవచ్చు.

ఆ వెంకన్న ఆశీస్సులు తో, త్వరలోనే నవ్వుతూ బయటకు వస్తారని ఆశిస్తున్నాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 26-Aug-2020, Upd Dt : 26-Aug-2020, Category : General
Views : 142 ( + More Social Media views ), Id : 660 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : corona , treatment , tirupati , ruya , govt hospital , bhumana , district , medical officers , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content