తల్లి దండ్రులు, పరాయి చోట పనిచేసే పిల్లలతో పాటు గా, వచ్చి ఉండలేము చివర దశలో, అనే మాటలో నిబద్దత? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,030; 104 తత్వాలు (Tatvaalu) and views 225,733.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ కొంతమంది తల్లి దండ్రులు, పరాయి చోట (నగరం, రాష్ట్రం, దేశం) పనిచేసే పిల్లలతో పాటు గా, వచ్చి ఉండలేము చివర దశలో, పుట్టిన జన్మ భూమి ఊరు లోనే పోతాము, అనే పిల్లల లేదా పెద్దల మాటలో నిబద్దత ఉందా?

జవాబు, పెద్దలు మీరే చెప్పాలి, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు. రాజకీయ నాయకులు అంటే, పైకి ఒకమాట లోన ఒకమాట, సేం టు సేం, 2 నాల్కల నటించే ఓటరు, లాగా ఉంటుంది.

దీపావళికి, తమ ఇంటి సాంప్రదాయ వెలుగులు జిలుగుల ఫోటోలు శుభాకాంక్షలు పంపిన, అలాగే రోజూ వాట్సాప్ స్టేటస్ చూస్తున్న గురువులకు వందనాలు. తినగ తినగ వేము తియ్యగా నుండు, మరువద్దు.

తాగుబోతుకు తిరుగుబోతుకు మోహం లో ఉన్నవారికి, తమ లాంటి వారి, ప్రపంచ మాయ మాటలే నచ్చుతాయి, శభాష్ అంటారు.

అలాగే సాత్వికులకు మాత్రమే, సాత్విక దైవ మాటలు భవిష్యత్ అర్ధము అవుతాయి, స్పందిస్తారు. ఇతరులకు ఇది అంతా, ఓ పెద్ద తలనొప్పిలా ఉంటుంది, అదీ వారు సమస్యలలో చిక్కుకోనంత వరకు మాత్రమే సుమా.

ముదుసలి తల్లి దండ్రులు, కనీసం 50 లేదా 60 వచ్చిన తర్వాత అయినా, వాస్తవాలు నిజాలు మాట్లాడకపోతే, వారికే నష్టం కాదా? రేపు అనాధలు గా ఒంటరిగా ఇబ్బంది పడేది వారేగదా? చివరి దశలో కూడా, అబద్దాలు చెప్పే వారిని, దేవుడు మెచ్చుతాడా?

1. సీతమ్మ పుట్టింది మిధిలా నగరం, మెట్టినిల్లు అయోధ్య, అగ్నిప్రవేశం చేసింది లంకలో కాదా? ఇది తప్పునా, కాదు కదా?

భర్త తో అడవులకు వెళ్ళలేదా, ఆనందముగా? భర్త ఉన్నచోటే, భార్యకు పవిత్రమైన స్థలం, అలాగే భర్త కు కూడా, అందుకే రాముడు వెతుక్కుంటూ వెళ్ళారు.

మరి ముదుసలి తల్లి దండ్రులకు, తమను ముద్దు బాగా చూసుకునే పిల్లలు ఉన్న ఊరే, పుణ్యస్థలం కాదా?

ఆదరణ లేక ఒంటరిగా లేదా ఇతరుల చేతిలో మన ఇల్లు అయినా, లేదా అనాధలుగా అనాధాశ్రమాలు అయినా, పుణ్యస్థలము జన్మభూమి అవుతుందా, మన పిల్లల సంస్కార పెంపకములో?

2. రామ రావణ యుద్దం లో లంకలో మరణించిన, భారత వీరులు లేరా? మహా భారత యుద్దం లో ఎంతో మంది ఇతర ప్రాంత రాజులు సైన్యం, కురుక్షేత్రం లో మరణించారు, వారి జన్మభూమికి దూరము, కాదా? అది అధర్మమా?

3. వారికి ఉన్న ఇంటి మనుషుల సమస్య కరెక్టు గా చెప్పాలి, ఉదాహరణకు చవట కూతురు లేదా చవట కొడుకు మమ్మల్ని సరిగ్గా చూడరు, వారిని నమ్మలేము. కాపలా పనిమనుషులు గా వాడుతారు. మా బంగారం ఆస్తులు లాక్కుంటారు, కాబట్టి వారి దగ్గరకు రాము పోము. లేదా ఇక్కడ ఉన్న ఆస్తులకు వ్యాపారాలకు మేము కాపలాగా కుక్క గా ఉండాలి ఈ చివరదశలో కాబట్టి కదలము.

కట్నం ఉద్యోగం ఆస్తి కోసం, కక్కుర్తి పడినందుకు, సరిగ్గా పెంచనందుకు, మాకు తిక్క కుదిరింది. ఇలా ఎవో వారికి ఉన్న వాస్తవాలు చివరిదశలో అయినా, అందరికీ చెప్పాలి, ఎందుకంటే ఇతరులు కూడా తమలాగనే మోసపోకూడదు.

లేదంటే, లోన కుళ్ళి కుళ్ళి బాధ దిగమింగుకుని, మానసిక వ్యధతో పోయిన వారు ఉన్నారు. అది ఇక్కడ మరియు పైన నరకానికి మార్గమే గానీ, పైసా లాభము లేదు.

4. 20 శాతం మంది, ఒకే చోట పుడతారు, అక్కడే చదువుతారు, అక్కడే ఉద్యోగం వ్యాపారం చేస్తారు. వీరికి ఆ సమస్యలేదు, వారు నిజమైన ఊరి భక్తులు, మాట నడత ఒకటే, కాబట్టి వారిని మినహాయించి మాట్లాడుదాము.

5. వసుధైక కుటుంబం అంటే, తప్పా? భూమాతను మనము తల్లిగా కొలుస్తున్నామా లేదా? భూమాత అంటే, ఒక దేశమా రాష్ట్రమా జిల్లానా? భగవంతుడు సర్వాంతర్వామి అంటే అర్ధం మనకు తెలుసా? మన నగరానికే దేవుడా? జన్మభూమి అంటే, గ్రామమా, పట్టణమా, జిల్లానా, రాష్ట్రమా దేశమా?

6. మనము అవసరానికి ద్వేషము తో చూడని, ప్రాంతము ఉందా? తెలుగు వాళ్ళము కూడా పడక ఇప్పటికే విడిపోయాము కదా, ఇలాంటి 2 మాటలతో? ఇంకా ఎన్ని ముక్కలు ఎన్ని రాష్ట్రాలు అవ్వాలో?

7. బ్రమ్మం గారు, రాఘవేంద్ర స్వామి, వేమన లాంటి తేట తెలుగు మాటల గురువులను వదిలి, పరాయి గురువుల వెంట పడటం లేదా కుసంస్కారం తో?

8. గుంటూర్, వరంగల్, కడప, తిరుపతి లేదా ఇంకో పల్లెటూరు లో పుట్టిన వారు, చదువు కు ఉద్యోగానికి, తమ జన్మ భూమి అంటే ఆ ఊరు దాటి వెళ్ళరా?

బెంగళూర్, హైదరాబాద్, ముంబాయి, లేదా విదేశాలు కు, అక్కడ తింటూ తిరుగుతూ, పరాయి నేలకు మాత్రమే టాక్స్ లు కట్టి, అభివ్రుద్ది చేయడం లేదా?

అంటే మన పిల్లలు పరాయి చోటికి వెళుతున్నారు కదా? అక్కడ ఎక్కువ సౌకర్యాలు ఆదాయము ఆనందము ఉన్నాయి అని, విచ్చల విడి డబ్బుతో అప్పుచేసైనా ఇంకొకరిని ముంచి అయినా, వారిని మనము పంపడం లేదా?

మరి సంస్కారం గల తల్లి దండ్రులు గా మన బిడ్డలను, ఇతర ప్రాంతాలకు పంపడం, జన్మభూమిని మాటలలో నటనతో మాత్రమే గౌరవించే మనకు తగునా?

మీ వలన పెరిగిన మీ పిల్లలకు, ఆ సంస్కారం అబ్బ లేదా అలవాటు చేయడం చేత కాలేదా? అంటే, మీకో నీతి, మీ పిల్లలకో నీతినా? అంత పచ్చి అవకాశవాదమా?

9. మన జాతకం లో కూడా, పుట్టిన ప్రదేశం చెప్పి వివరాలు చూస్తాము, ఎక్కడ బతుకుతున్నా కూడా. మరి ఇతర ప్రాంతాలలో ఉండే, మన పిల్లలు, అక్కడ యాక్సిడెన్ట్ లేదా ఇంకో ఘోరం జరిగితే, దేహాన్ని మనవూరు తెచ్చినా కూడా, ప్రాణం పోయిన ప్రదేశం, పరాయి నేలనే కదా? అది మారదు కదా, మనము ఒప్పుకోమా అది?

మరి మనము చావడానికి ఇష్టపడని పరాయి నేల, మన పిల్లల చావు కు అయితే ఒకేనా? ఇదేనా మన వంశ సాంప్రదాయం, అవసరాన్ని బట్టి 2 మాటలు?

కాబట్టి, వారి కుటుంబములో ఉన్న తప్పులను సమస్యలను కప్పిపుచ్చుకుంటూ దాచిపెట్టుకుంటూ, పైకి నటిస్తూ జనాలకు ఏవో మాయమాటలు చెప్పి, తమకు తామే ఆత్మ ద్రోహం చేసుకుంటున్నారు ఏమో కదా? తప్పులు ఉంటే, మన్నించి సరి చేయండి పెద్దలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,030; 104 తత్వాలు (Tatvaalu) and views 225,733
Dt : 06-Nov-2021, Upd Dt : 06-Nov-2021, Category : General
Views : 854 ( + More Social Media views ), Id : 1271 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : commitment , children , parents , stay , foreign , place , laststage
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content