చంద్రన్న కాలం లో సోషల్ మీడియా వాడిన గౌరవ కలెక్టర్ లు, జగనన్న కాలంలో ఆపేశారు అంటే అర్థం? - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1195 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1225 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* జగనన్న, చంద్రన్న, పవనన్నకు, వీరన్న
* నమ్మింది కలెక్టర్, ఎస్పీ లను, ఎమ్మెల్యేలు ను
* జగనన్న, ఎంపీ, ఎమ్మెల్యే అడుగుతారు
* వ్యవస్థ లో లోపాలు, లేదా కలెక్టర్ ల నిర్లక్ష్యం
* మోడీ డిజిటల్ ఇండియా లో, భాగమా కాదా?
* ప్రభుత్వ ఉచిత సెల్ ఫోన్ నంబర్లు, పేర్లు
* డీఆర్వో, ఆర్డీవో, ఎమ్మార్వో వాట్సాప్
1 min read time.

అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న, మంచి మనసు నిబద్ధత అనుభవం వృత్తి గౌరవం గల, అధికారులు మరియు నాయకుల కు, తలవంచి నమస్కారములు. మీ ముందు మేము ఓ చిగురుటాకులం, సందేహం లేదు. కానీ జగనన్న, చంద్రన్న, పవనన్నకు, వీరన్న కు మంచి చేయాలి, అంటే ప్రజలకు మంచి జరగాలి, అన్న సంకల్పం తో మాత్రమే ఈ ప్రయత్నాలు, మన్నించాలి.

మంచి విలేఖరి కి ఎల్లలు లేవు, ఆఫ్రికా నుంచి అంతరిక్షం దాకా, దేని మంచి గురించి అయినా, మంచి పదాలతో గౌరవం గా రాయవచ్చును, తప్పులు చూపిస్తే క్షమాపణలతో సరి చేసుకుంటాము. ఇప్పుడు ఎమ్మెల్యేలు నాయకులు వాడే, వారి కొత్త సాంస్కృత భాషను, వ్యక్తిగత విమర్శలు, ఎన్నటికీ వాడము.

ఎలక్షన్ కు ముందు ఎన్ని పార్టీలు బేధాలు ఉన్నా, ఆ తర్వాత ముఖ్యమంత్రి అందరు కూ ఒకటే కదా. జగనన్న నమ్మింది కలెక్టర్ లను, ఎస్పీ లను, ఎమ్మెల్యేలు ను, తన పధకాలను ప్రతి మనిషి కి చేరాలన్న తపన తో. జిల్లా ఎస్పీ లు అంటే ఐపీఎస్, ఆ పని చిత్తశుద్ధితో చేస్తున్నారు, డిజిటల్ ఇండియా లో భాగముగా.

ప్రతి జిల్లా నుంచి, కనీసం ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ లేదా ఒక జిల్లా స్ధాయి అధికారి, ఈ మెసేజ్ లు అందుకుంటున్నారు, ప్రతిపక్షాలు, ప్రజలు, విదేశాల తెలుగు వారి తో సహా. జిల్లా కలెక్టర్ లేదా జేసీ గారి నంబర్ దొరకకపోతే, ఆ జిల్లా స్ధాయి అధికారి, తన పై అధికారులు కు పంపుతారు తెలుపుతారు అన్న నమ్మకం తో, వారికి పంపుతున్నాము. ఆయన ఆ జిల్లా కలెక్టర్ మరియు జేసీ ల తో చెప్పాలి, మన జిల్లా అధికారులు, ఇంత వెనక బడి ఉన్నారు అని. జగనన్న, ఎంపీ, ఎమ్మెల్యే అడుగుతారు ఏనాటికైనా అని. ఎమ్మెల్యేలు అదే పని చేయాలి, ప్రభుత్వ క్షేమం కోసం. కొంతమంది వాట్సాప్ ఆపుకున్నారు.

కానీ వ్యవస్థ లో లోపాలు, లేదా కలెక్టర్ ల నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం, ఆ జిల్లా స్ధాయి అధికారులు మీద పడుతుంది. జిల్లా స్ధాయి అధికారుల నిర్లక్ష్యం, గ్రామ పట్టణ స్ధాయి అధికారులు మీద ఉంటుంది కదా.

చూడండి, జిల్లా కలెక్టర్ అంటే, ప్రధమ పౌరుడు మెజిస్ట్రేట్, తను చేస్తున్న పనులు గురించి సిబ్బంది గురించి, తమ సోషల్ మీడియాలో గౌరవం గా చెప్పడం లేదంటే, మోడీ గారి డిజిటల్ ఇండియా లో, వీరు భాగమా కాదా? భారత మరియు ఆంధ్రా ప్రభుత్వం ని గౌరవిస్తున్నారా?

ఐఏఎస్ అంటే, ఎంతో తెలివిగా చురుకుగా ప్రభుత్వం రెండు చెపితే, 4 చేసే అంటే ఇంకా రెండు ఎక్కువ చేసే పరిస్థితి ఉండవద్దా? అసలు చెప్పకుండానే, మంచి పనులు చేపించాలి. చంద్రన్న కాలం లో సోషల్ మీడియా వాడిన గౌరవ కలెక్టర్ లు, నేడు జగనన్న కాలంలో ఆపేశారు అంటే అర్థం? మీకు లిస్టు కూడా పంపాము గతంలో. Link.

వారికి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత సెల్ ఫోన్ నంబర్లు అధికారుల పేర్లు రాయకుండా, దాస్తున్నారు అంటే, ప్రభుత్వం ను జగనన్న ను ప్రజలను గౌరవించినట్లేనా? ప్రజలకు దూరంగా ఉండటం కాదా?

ఆలోచన చేయండి, ఒక డీఆర్వో, ఆర్డీవో, ఎమ్మార్వో జవాబు చెప్పకుండా వాట్సాప్ ఫోన్ లు ఆపుతున్నారు అంటే, ఆ జిల్లా కలెక్టర్ గారు అంటే, భయం గౌరవం ఉన్నాయా ఆ అధికారులు కు?

మనం మారాలి, మోడీ మరియు జగనన్న పధకాలను, ప్రతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు నుంచి పంచాయితీ సెక్రటరి దాకా అందరు, తమ సొంత మరియు ప్రభుత్వ సోషల్ మీడియాలో పెడుతూ ప్రజలకు చేరువలో ఉండి, ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్న జీతాలు సౌకర్యాలుకు, తగిన న్యాయం చేయాలి. ధన్యవాదములు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1225 General Articles, 47 Tatvaalu
Dt : 04-Oct-2020, Upd Dt : 04-Oct-2020, Category : Request
Views : 187 ( + More Social Media views ), Id : 734 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : collectors , social media , facebook , twitter , chandranna , period , time , stopped , jagannanna , ysrcp , govt
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content