చీరాల పెట్టుబడులకు ఆహ్వానం కరణం, వాడరేవు జాలర్ల విధానం లో గొడవలు ఆమంచి సంయోధ్య - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,185; 104 తత్వాలు (Tatvaalu) and views 217,389.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

1) శభాష్, చీరాల నాయకులు మధ్య, పోటీ ఇలా అభివృద్ధి లో ఉండాలి, కరణం తనయుడి ఫ్లెక్సీ ప్రయత్నం చూడండి, ఫ్లెక్సీ పాతది కావొచ్చు, పెట్టుబడులకు ఆహ్వానం, మత్స్య చేనేత పరిశ్రమలకు. మరి ఎవరన్నా, పెట్టుబడులతో ముందుకు వచ్చారా లేదా అన్నది తెలియలేదు, ప్రయత్నం బాగుంది. Karanam.

మంచి చేస్తున్న, కరణం బాబాయి అయినా ఆమంచి అన్న అయినా, అభినందించాలసిందే, వ్యక్తులు ముఖ్యం కాదు, వారు చేస్తున్న అభివృద్ధి ముఖ్యం, ప్రజలకు పట్టణానికి, వారి భవిష్యత్తు కు. మరి జగనన్న సలహా దారుల, చల్లని చూపు మన పట్టణం పై ఉందో లేదో, వచ్చే సంవత్సరం తేలిపోతుంది.

మరి కొత్త జిల్లా, కొత్త కార్యాలయాలు తేవడం లో కూడా, పోటీ చూపిస్తారా? చూద్దాం. ఎందుకంటే అభివృద్ధి ఆటోమేటిక్ గా వాటితో వస్తుంది, బయట వారితో, పని లేకుండా.

2) జరిగేవి అన్ని మనకు తెలీదు, ఎవరన్నా లింక్ పంపనిదే మిత్రులారా. ఇదీ నాయకుడి లక్షణాలు అంటే. జనాన్ని తెచ్చుకుని పూలతో ఊరేగడం అందరూ చేస్తారు. కానీ ప్రజల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు స్ధానికం గా ఉండి, వెళ్లి, సర్దిచెప్పి రావాలి. Amanchi.

శభాష్ ఆమంచి అన్న. ఎప్పుడూ, జనం కోసం పరుగులే. అభివృద్ధి నాణానికి ఒకవైపు అయితే, రెండో వైపు పిలిస్తే పలికడం, ఇందులో ఆమంచి గారిదే పై చేయి, నేటికి కూడా. ఫోటోలు చూడండి, ఎప్పుడూ సాక్ష్యం లేనిదే, పత్రికల మాటలు నమ్మలేము.

కరణం బాబాయి కి నచ్చ చెపుతుంది ఇదే , దయచేసి స్ధానికం గా ఉండండి, వెంటనే ఒంగోలు నుంచి రావాలంటే ఇలాంటి సమయంలో, కష్టం. అది వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు కు అడ్డం అని. రేపు లేదా రెండు రోజుల తర్వాత వచ్చి లేదా అనుచరులు వచ్చి పలకరించినా, ప్రయోజనం శూన్యం.

ఇది రాజకీయ గొడవ కాదు. కఠారిపాలెం వాడరేవు జాలర్ల విధానం లో తేడాలు, బల్ల వల మరియు ఐల వల అంట. ఇరువర్గాలు రెండో దానిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి తగువు మధ్యలో వెళ్లి నచ్చ చెప్పడం అంటే, కాస్త దమ్ము ధైర్యం జనం మీద పట్టు ఉండాలి, అందుబాటులో ఉండాలి.

కరోనా సమయంలో కూడా, ఆమంచి ప్రజలకు తోడుగా ఉన్న విషయం, గతంలో అనుకున్నాము. ఫేస్బుక్ లో 6 నెలలు వెనక్కి తిప్పి, మీరూ సరిచూడగలరు. ప్రజలందరినీ కలుపుకుని పోతే, ఆమంచి వన్నె తగ్గదు, పదవి ఉన్నా లేకపోయినా, ప్రజల మధ్యలో ఉండటం అభినందించాలి.

కానీ అభివృద్ధి కూడా కావాలి, అందులో ఆమంచి కరణం ఇద్దరూ వెనకబడి ఉన్నారు, బాపట్ల తో పోలిస్తే, కొత్త గా వచ్చిన అభివృద్ధి లో. ఇద్దరూ చీరాల బాగు పట్టించుకోకుండా ఉన్నారు అని, ప్రజలు భావన.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,185; 104 తత్వాలు (Tatvaalu) and views 217,389
Dt : 11-Dec-2020, Upd Dt : 11-Dec-2020, Category : Politics
Views : 890 ( + More Social Media views ), Id : 851 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : invitation , invest , karanam , chirala , vodarevu , katharipalem , conflicts , fishermens , net policy , amanchi , mediation
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content