ఇంటికో భస్మాసుర, కృతజ్ఞతలు సంస్కారం కనికరం లేకుండా, పేరెంట్స్ నెత్తినే చేతులు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1553 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1588 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇంటికో భస్మాసురుల ను, కూతురు కొడుకు ఎవరైనా ఒకటే సుమా, కృతజ్ఞతలు సంస్కారం లేకుండా, మోహం లో పెంచి పోషించిన, మన నెత్తినే కనికరం కృతజ్ఞతలు లేకుండా చేతులు పెడతారు పాతాళానికి తొక్కుతారు, అని ఇంకో ప్రత్యక్ష ఉదాహరణ చదవండి.

భారత దేశం, అతి కష్టమైన గంగా ఆపరేషన్ మొదలు పెట్టి, ఎంతో ప్రజా ఖర్చు తో, ఉక్రెయిన్ నుంచి జనాలను ఇంటి కి తెస్తుంటే, ఎంత ఘోరం గా వీరి సంస్కారం కృతజ్ఞతలు, ప్రతి నమస్కారం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ వీడియోలో చూడండి. ఇది వేరే విషయం, సంస్కారం గురించి మాత్రమే. వారి తల్లి దండ్రుల ను పొగడాలి కదా, డబ్బు ఎక్కువ ఉంది అని, ఉత్తమ గుణ సంపన్నులను వైద్యం కోసం పంపినందుకు.FB1 FB2.

ఈ తల్లి కన్నీరు మున్నీరు గా విలపిస్తూ, ధైర్యం గా పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. మరి పిల్లల ధనం మరియు పలుకుబడి ముందు, ఆ ముదుసలి తల్లి ప్రయత్నం సఫలం అవుతుందా, లేదా చూడాలి. పెద్దలు మీరూ సహాయము చేయాలి, అతనికి బుద్ది తెచ్చేందుకు.

ఇలాగే అందరూ ధైర్యం గా ముందుకు రావాలి, అలాగే ముందు జాగ్రత్తలు తో ఉండాలి, అన్ని ఆస్తులు గుడ్డిగా నమ్మి ఇవ్వకుండా ఉండాలి.

పిల్లల బుద్దులు పెళ్లి కి ముందు అంటే 20 ఏళ్ళు కే లేదా పెళ్లి తర్వాత సంవత్సరం కు అయినా, బయట పడతాయి మోహం వీడి జాగ్రత్త గా గమనిస్తే.

స్వార్ధం తో పిల్లలు, తమ సుఖాలు తాము చూసుకుంటూ, కన్న తల్లిదండ్రులు అంటే తమ సజీవ గురువు ల మీదనే, అబద్ధాలు పరంపర లో, తమ జీవితాలను భ్రమల్లో ఉంచుతూ పెంచుతూ, తాము కూడా చివరకు అదే దుర్గతి పడతారు.

కంటి ఎదురు, సొంత తల్లిదండ్రులు దౌర్భాగ్య బతుకును తామే కల్పిస్తూ, తమకు మాత్రం చివరకు అలా జరగదు, అని మూర్ఖులు గా మోహం లో ఉంటారు, పైగా పరాయి గురువుల పైపై పూజ నటన.

వృద్ధాప్యం బాధ, అశక్తత, నెప్పులు, మనిషి తోడు, ప్రేమ, ఆప్యాయత, అవసరం, దగ్గర ఉండి మనం చూడాలి, అప్పుడే దాని విలువ అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ వృద్ధాప్యం తప్పదు, జీవితము లో తాము చేసిన తప్పులు నెమరువేసుకోవడానికి.

ప్రతి తల్లి దండ్రులు ధర్మము గా ఉంటూ మోహం వ్యామోహం విడిచి, తమ పిల్లల కాటుకు గురి కాకుండా, తమను తాము రక్షించుకోవాలి. పిల్లల తప్పులు దాచిపడితే, మన బతుకును కూడా ఇలాగే నిర్దాక్షిణ్యంగా దాచేస్తున్నారు.

గన్నవరానికి చెందిన నాగకుమారి భర్త 2001లో రోడ్డుప్రమాదంలో మరణించాడు. ఒకే ఒక కుమారుడు వెంకట ఫణీంద్రకుమార్‌, ఉన్నత చదువులు చదివి విదేశాల్లో చదివి, ఉద్యోగం చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు. కానీ ధన సౌకర్యాల మోహములో, బంధానికి గతానికి విలువ లేకుండా పోయింది.

ఊరు బెంగళూరు, ఢిల్లీ, లండన్, దుబాయి, అమెరికా ఏది అయినా, మన జాతి రత్నాల సంస్కారం లో తేడా లేదు కదా.

భర్త చేసిన అప్పులు తీర్చాలని, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో, ఆస్తులు అమ్మి తీరుస్తానని, తన కుమారుడు చెప్పగా, తన పేరున, తన భర్త పేరున ఉన్న ఆస్తులన్నీ తన కుమారుడి పేరిట బదలాయించానని చెప్పింది.

అయితే తన కుమారుడు తనను నమ్మించి నయవంచన చేశాడని వాపోయింది. మిగతా వివరాలు, లింకు లో చూడగలరు. Sakshi.

ఈ విషయమై న్యాయం చేయాలని, ఏళ్ల తరబడి అధికారులు చుట్టూ తిరుగుతున్న, ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది.

తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నానని, ఇప్పటికైన అధికారులు స్పందించి కన్నతల్లికి అన్యాయం చేసిన కుమారుడిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు దీక్షను విరమించనని స్పష్టం చేసింది.

children like bhasmasura and putting Bloody hands on parents head without compassionate gratitude  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1588 General Articles, 54 Tatvaalu
Dt : 06-Mar-2022, Upd Dt : 06-Mar-2022, Category : General
Views : 212 ( + More Social Media views ), Id : 1311 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : children , kids , bhasmasura , hand , parents , head , compassionate , gratitude
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content