ముఖ్యమంత్రి, దేవాదాయ, తితిదే చైర్మన్ - బ్రమ్హం, రాఘవేంద్ర, వేమన గురువుల ప్రచారానికి చేయూత? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1446 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1481 General Articles, 50 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ముఖ్యమంత్రి, దేవాదాయ మంత్రి, తితిదే చైర్మన్ గార్లు - బ్రమ్హం, రాఘవేంద్ర, వేమన లాంటి తెలుగు గురువుల ప్రచారానికి చేయూత ఇవ్వరా?*

ఓం నమో గురుభ్యో నమః, ఓం నమో వీరబ్రహ్మేంద్రస్వామి యే నమః, ఓం నమో రాఘవేంద్ర స్వామి యే నమః, ఓం నమో యోగి వేమనాయ నమః.

పుట్టిన ప్రతి వ్యక్తి, మొదట గురువులు గా తమ తల్లి దండ్రులను జీవితాంతము గౌరవిస్తారు, క్రుతజ్ఞత విశ్వసనీయత మానవత్వం ఉంటే గౌరవించాలి కూడా. ఆ తర్వాత, బాబాయి పిన్ని, మామయ్య, అత్తయ్య, వారి ఇష్టం.

అలాగే తెలుగు జాతిలో పుట్టిన ప్రతి వ్యక్తి, మన తెలుగు గురువులను గౌరవిస్తారు, గౌరవించారు, గౌరవించాలి. రాయలసీమ నాయకులు మరియు ప్రజలు ఇంకా ఎక్కువ గౌరవించాలి, క్రుతజ్ఞతలు చూపాలి మరియు ప్రచారం చెయ్యాలి.

ఎందుకంటే, మనకోసం కాలజ్ఞానం చెప్పారు రాశారు. మన కోసం వేమన శతకాలు చెప్పారు. రామయ్య గొప్పతనాన్ని చాటారు. వీరి రచనలు అర్ధము చేసుకుని, ఆచరణలో చేసే ఓపిక మనకు లేకుండా పోయింది.

కానీ దానికి విరుద్దముగా జరుగుతున్నది, మన సంస్క్రుతి సాంప్రదాయం రచనలు మరుగున పడిపోతున్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్న నానుడి ప్రకారం, సొంత తల్లి దండ్రులను అనాధాశ్రమములో లేదా ఇంట్లో దూరం గా ఒంటరిగా వదిలినట్లు, తెలుగు గురువులను వదిలేసారు.

దూరపు కొండలు నునుపు, పాత రోత, కొత్త వింత అనే స్థాయికి దిగజారిపోతున్నాము.

ఊరికో 4 పరాయి భాషా గురువుల మందిరాల, వ్యాపారముతో వర్ధిల్లుతున్నాము, లెక్కలు లేకుండా వారి సొంత ఆస్తులు పెంచుతున్నాము, తెలుగు గురువుల సంస్క్రుతిని మరుస్తున్నాము.

ఈ మందిరాలు, మన రాష్ట్రము లో, హైందవ మందిరాలు గా దేవాదాయ శాఖ కింద ఉన్నాయా? లేక మైనారిటీ మతము కింద, హిందువుల గుడి కాదు, ఇవి వేరే అని సొంత గా నడుపుతున్నారో, మందిరము ఎదురు బోర్డ్ పెట్టి ప్రజలకు తెలియ చెప్పాలి.

విదేశాలలో కూడా, మన తెలుగు వారి, పరాయి భాషా గురువుల, పెద్ద పెద్ద మందిర వ్యాపారాలు, సమర్ధవంతముగా వర్ధిల్లుతున్నాయి, మన విజ్ఞాన చదువుకున్న, హ్రుదయము క్రుతజ్ఞత లేని తెలుగు వారి, మూర్ఖత్వం నిర్లక్ష్యం వలన. తమ ముదుసలి తల్లి దండ్రులనే పక్కన పెట్టుకోని వారు, తమ తెలుగు గురువులను ఇంట్లో పటాలు గా పెట్టగలరా, ఊరిలో గుడులు కట్టగలరా, అని పలువురు అంటున్నారు.

కరోనా గురువు వచ్చి, పాత కాలపు పద్దతులు తిరిగి నేర్పినా కూడా, బండబారిన బద్దక హ్రుదయాలు వాస్తవానికి వ్యాపారానికి మధ్యలో తేడా గుర్తించలేని, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి.

బ్రమ్హం, రాఘవేంద్ర, వేమన గార్లు - వీరు హైందవ దేవతలను కొలిచారు, వీరి పుట్టు పూర్వోత్తరాలు, కాలజ్ఞానం పద్యాలు వంటి రచనలు తెలుసు, సాక్ష్యాలు ఉన్నాయి. హైందవ అడ్డ/ నిలువు నామాలు వాడారు.

నేటి జనం తేలిక వ్యామోహ మాయలో ఉండి, గురువు కోరికలు తీర్చరు, కేవలం దైవం వైపు దోవ చూపుతారు అంటే నమ్మరు గాక నమ్మరు సాక్ష్యం ఉన్నా - గురువు దేవుడు కృష్ణయ్య అండతో పక్కన ఉన్నా, 18 సెకన్లు నిమిషాలలో కాకుండా, అర్జునుడి భారత యుద్ధం 18 రోజు లు జరిగింది అని తెలిసినా, మన వాళ్ళు వినే స్థితిలో లేరు.

రాయలసీమ ముఖ్యమంత్రులు మంత్రులు నాయకులు ఎందరో ఉన్నారు, వారంతా కూడా మరచారు, చరిత్రలో కలసి పోయారు. మరి మీరైనా చేయూతను ఇస్తారా? అని విజ్ఞులు మీ అండను కోరుతున్నారు.

తెలుగు గురువు ల గురించి, అలాగే వారు తేట తెలుగు లో రాసింది చదివి అర్థం కాని, దానిని ఆచరణలో చేయలేని, అరిషడ్ వర్గాల బానిస మూర్ఖులు, ఇతర బాష గురువు ల వెంట పడతారు, వ్యాపార మోహ మాయలో, చంచలమైన బలహీన మనసు తో. అలాగే తమ ముదుసలి తల్లి దండ్రులను కూడా వదిలేసి, ఇతరుల మెప్పుకోసం పరుగులు తీస్తారు.

గురువులు అందరూ ఒకటే అని అబద్ధాలు చెబుతూ చెప్పుకుంటూ, మన తెలుగు గురువు లకు, దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడా కూడా, ఊరికి ఒక గుడి కట్టించలేరు, ఇతర భాషల వారిని నమ్మించ లేరు మెప్పించలేరు, మన తెలుగు గురువు ల గురించి. మరి వీరు మాత్రం తేలికగా మోసపోతూ నమ్ముతారు, అందరూ ఒకటే అని పిచ్చిగా నమ్మి మరియు నమ్మిస్తారు.

సొంత తల్లి తండ్రిని అలాగే గురువు లను కృతజ్ఞతలు బాధ్యత విశ్వసనీయత, తన మన లేకుండా వదలి, వారి లోపం చెప్పకుండా నే, పరాయి పిన్ని బాబాయి ని పొగిడే నమ్మే, అదే పైకి గొప్ప అనుకుని భ్రమ పడే, మానసిక రోగులు ను వారి కుటుంబాలను, కనీసం ప్రభుత్వం అయినా విజ్ఞానం పెంచి తన మన తెలియ చెప్పి కాపాడాలి, వ్యామోహం నుంచి బయటకు లాగి అని పలువురి విన్నపము. మన ధనము పరాయి రాష్ట్రాలకు కూడా, వ్రుధా గా పోతున్నది, మన మూర్ఖత్వముతో, అని అందరూ బాధపడుతున్నారు.

రజనీకాంత్ మరియు ఎంటీయార్ లాంటి వారు, సినిమాలు తీసి ప్రచారం చేసారు గతములో. అదేవిధముగా ఇంకొందరు పెద్దలు విజ్ఞులు ముందుకు రావాలి.

ప్రభుత్వము మరియు తితిదే, తెలుగు గురువుల సంస్క్రుతి ప్రచారానికి, వారి ఉత్సవాలు నిర్వహించడానికి, మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు ఆ గురువులను దర్శించి, వారి ప్రాముఖ్యతను అందరికీ తెలియచెయాలి.

లేదంటే, నేటి మరియు రేపటి భవిష్యత్ తరాలు, తెలుగు గురువులను, సొంత తల్లి దండ్రులను, మరచిపోతారు, నీతి నియమాలు విలువలు, మరింత పతనము అవుతాయి సుమా.

Chief Minister, Endowments Minister, ttd Chairman - give a hand to the campaign of Telugu gurus like Brahmam, Raghavendra, Vemana  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1481 General Articles, 50 Tatvaalu
Dt : 18-May-2022, Upd Dt : 18-May-2022, Category : General
Views : 146 ( + More Social Media views ), Id : 1397 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : cm , chief , minister , devadaya , endowments , ttd , chairman , campaign , telugu , gurus , brahmam , raghavendra , vemana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content