చెన్నైలో ఆన్లైన్ పెళ్ళి, ఆన్లైన్ దీవెనలు, ఇంటికే పెళ్ళి భోజనము విస్తరాకు కారేజ్ ల తో - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,365; 104 తత్వాలు (Tatvaalu) and views 225,060.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పెళ్ళి అంటే నూరేళ్ళ పంట, ఓపికను బట్టి వంద మంది పైగా పిలిచి భోజనాలు పెట్టి, కోలాహలము గా కొన్ని రోజుల, పాటు జరిగేది. ఆతర్వాత 1 రోజుకి వచ్చింది మొత్తం కార్యక్రమం. 16 రోజుల పండగ అని మళ్ళీ కలిసే వారు కొంతమంది చుట్టాలు, ఇది గతం.

ఇప్పుడు కరోనా వచ్చి, 50 మంది కన్నా ఎక్కువ ఉండవద్దు అని, ఆరోగ్య రక్షణ కోసము పరిమితులు పెట్టింది. అయినా, లెక్క చేయకుండా, ఎక్కువ మంది వెళుతూనే ఉన్నారు. విచిత్రము ఏమిటి అంటే, ఎవరూ కరోనాకు భయపడి మాస్క్ లు ధరించడం లేదు, టీనేజర్స్ కి కూడా చెప్పడము లేదు. బయట, కరోనా 2 వ సారి వచ్చి పశ్చిమ దేశాలను వణికిస్తుంది అని వింటున్నా కూడా, జనాలలో మార్పులు రాలేదు, జాగ్రత్తలు లేవు.

ఇప్పుడు పెళ్ళి కొత్త పుంత లు తొక్కు తుంది. ఆన్లైన్ పెళ్ళి, ఆన్లైన్ దీవెనలు, ఇంటికే కమ్మని పెళ్ళి విందు భోజనము కారేజ్ తో. అంటే, మనము ఎక్కడకు వెళ్ళనవసరము లేదు. అందరు కరోనా తో ఇబ్బంది లేకుండా ఉంటారు, ముఖ్యముగా, కొత్త దంపతులు. నమ్మరా, ఫోటో చూడండి. స్టీల్ బాక్స్లు ఇచ్చిన విధముగా, ఓ నాలుగు బుట్టలు, నాలుగు డబ్బాలు వచ్చినట్లే మన వంట ఇంటికి.

చెన్నై లో జరిగిన ఒక పెళ్ళి వేడుక వివరాలు చూడండి, ఆ ఫోటోలో. స్పష్టము గా చెప్పారు, డిసెంబర్ 10 వ తేదీ పెళ్ళి అని, వెబ్సైట్ లింక్ లు ఇచ్చారు, లైవ్ గా చూడమని, ఇంత వరకు మనకు తెలుసు. కానీ ఆ తర్వాత నే కొత్త విషయము. అదే రోజు భొజనము ఇంటికి పంపుతామని, స్వీకరించమని కూడా కోరారు.

భోజనము ఎలా వస్తుందో, ఎన్ని డబ్బాలలో ఏ ఏ అయిటెం లు ఉన్నాయో కూడా వివరించారు. 4 విస్తళ్ళు ఉంటాయి ప్రతి ఇంటికి, విస్తరి మీద, ఎలా వడ్డించుకుని తినాలో, నంబర్ ప్రకారము రాసారు. పచ్చడి, పులిహోర, సంబారు అన్నము, కిళ్ళి, పయసము, హల్వా, బాదం పాలు, అబ్బో 25 రకాల విందు భోజనపు రుచులు.

డబ్బు ఉంటే, లేనిది ఏమి లేదు, కొండమీద కోతి అయినా వస్తుంది అంటారు చూడండి అలా.

చూడండి కరోనా వింతలు. ఏ ఒక్క అయిటెం కూడా తగ్గలేదు, హాయిగా ఇంట్లో నే వారి పెళ్ళి చూస్తూ, లేదా, సినిమా చూస్తూఅ, కుటుంబము మొత్తము విందు ఆరగించవచ్చు సుమా. ఇంకెన్ని విడ్డూరాలు చూడాలో రాబోయే రోజుల్లో మిత్రమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,365; 104 తత్వాలు (Tatvaalu) and views 225,060
Dt : 11-Dec-2020, Upd Dt : 11-Dec-2020, Category : General
Views : 861 ( + More Social Media views ), Id : 852 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chennai , online wedding , blessings , home delivery , food , dinner , carriages , banana leaves , jarda killi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content