APLatestNews.com top Banner

Social Media links
బాబు గారు, హైదరాబాద్ వ్యాపారం కుటుంబం ముద్దు, అధికారం ఇవ్వని ఆంధ్రా ప్రజలు వద్దా? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 నిమిష చదువు సమయం.

చంద్రన్న ఇసుమంత కూడా మారలేదు. గతంలో, లింకు లో అన్ని వివరంగా చెప్పాము. ఆయన చేస్తున్న పనులు, యువకిశోరం భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు మరియు తెదేపా భవిష్యత్తు ను, అగాధం లోకి నెట్టివేస్తున్నాయి.

మన పార్టీ బతికి ఉండాలి అంటే, మనము మారాలి లింకు లేదా ఓపిక లేకపోతే పార్టీ పగ్గాలు ఇతరులకు అప్పగించాలి. లేదంటే, ఎంటియార్ లక్ష్మీ పార్వతి గారి దగ్గర మనము ఎలా గౌరవ పద్దతిలో పగ్గాలు తీసుకున్నామో, అలాగే, ఇంకో యువ నాయకుడు, మన పార్టీ పరిస్తితి చూసి తట్టుకోలేక, తప్పనిసరి పరిస్తితి లో అంతే పద్దతిగా తీసుకుంటారు మన దగ్గర నుంచి.

హైదరాబాద్ నుంచి, జూమ్ మీటింగ్ వద్దు, కనీసం చాటుగా నే ఉండండి కనపడకుండా, ఆంధ్రా లో ఉన్నారు అనుకుంటాం, మాలాంటి పిచ్చి అభిమాన జనం. కష్ట కాలంలో, జనానికి, తోడుగా ఉండాల్సిన ప్రతి పక్ష నాయకుడు, రాష్ట్రం బయట ఇన్ని సార్లు ఉండకూడదు. మరలా లాక్ డౌన్ అంటే, కేంద్రం వద్దు అంది, మరలా 2 నెలలు ఇక్కడే ఉండి హెరిటేజ్ వ్యాపారం, కుటుంబం చూసుకుంటా అనేటట్టుగా ఉంటే, రాజీనామా చేసి అక్కడ నే ఉండండి. ఈ పనులు, పార్టీకి యువ నాయకుడికి నష్టం.

మీరు వ్యాపారం, కుటుంబం కోసం హైదరాబాద్ లో ఉంటే, మీ వాళ్ళ చెడు ను మీరే ఎత్తి ప్రజలకు చూపుతున్నారు. మీ సొంత కుటుంబ మే, మీ కన్నా వ్యాపారం ముఖ్యమని, ఇన్నాళ్ళు కష్టపడి పెద్ద వయసు లో ఉన్న మిమ్మల్ని జాలి లేకుండా అమరావతి లో ఒంటరిగా వదిలేస్తే, జనం కు ఇంక మీ మీద నమ్మకం, ఏ ముంటుంది, మీ వెనక ఎలా ఉంటారు? కుటుంబం ను ఆంధ్రా లో ఉంచుకోవడం తెలియని ఆయన, ఇంత పార్టీ ని రాష్ట్రం ను ఎలా నడుపుతారు అనుకోరా? మా లాంటి అభిమానుల, ఆశలు మీద నీళ్ళు పోసినట్టు కాదా.

150 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళను రాజీనామా చేయమని, 48 గంటల గడువు ఏమిటి (Video)? కరోనా సమయములో, ప్రజల ప్రాణాలకు విలువ లేదా? మనము అధికారములో ఉంటే, అలాగే దమ్ముతో చేస్తామా? 5 ఏళ్ళుగా, ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు, మనల్ని ప్రతిపక్ష నాయకునిగా రాజీనామా చేయమంటే, చేస్తామా?

పచ్చని 3 పంటల శాపము మన వెంట నడుస్తుంది లాగా ఉంది. అమరావతి రైతులకు అండగా ఆంధ్రా లో ఉండి, కనీసం తెదేపా ఎమ్మెల్యేల రాజీనామాలు అన్నా చేసి, గవర్నర్ కు ఇవ్వండి, స్పీకర్ కు ఇవ్వకుండా. స్పీకర్ అనుమతి ఇస్తే, మరలా జనం నెత్తిన ఎన్నికలు రుద్దాలి. మన పత్రిక లు ఆకాశానికి ఎత్తి రాస్తాయి. రాజకీయ చలనం ఉంటుంది.

మన మాజీ ఎమ్మెల్యే లు, కరోనా ఆసుపత్రికి వెళ్లి, జనాన్ని పలకరించి, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజేయవచ్చు, కానీ చేయడము లేదు, వైసీపీ అంటే భయమా లేక మన పార్టీ భవిష్యత్ లో ఇక ఎదగ కూడదనా? ఎవరో బాధ తో పంపిన వీడియో లు మాత్రమే కాదు, మన మాజీలు ప్రజలకు అండగా ఉంటే, అసలు ఆ పరిస్థితి రాదు కదా.

దయచేసి రాష్ట్రంలో ఉంటూ కనీసం రాష్ట్ర ప్రజలతోపాటు, కరోనా ను సమస్యను ఎదుర్కొనండి, దోవ చూపండి. ప్రతి రక్తపు బిందువు ఆంధ్రా ప్రజలకే అన్నారు వీడియోలో, కానీ ఆంధ్రా లో ఉండటమే లేదు గద సారూ, ఎట్లా మీ మాటలు నమ్మాలి. రక్తం బిందువు వద్దు, ఇక్కడ తోడుగా ఉంటే మీరు చాలు మాకు. రేపు, వైసీపీ వారు, మీరు అంధ్రా లో ఎన్ని రోజులు ఉన్నారు అని లిస్ట్ వేస్తే, మన పరువు పోతుంది.

మీరూ మమ్మల్ని ఒంటరి చేసి దూరంగా ఉంటారా, హయిగా మీ మిత్రులు కేసీయార్ జనరంజక పాలనలో? ఇంక తెలంగాణా లో తేదాపా బతుకుతుందా? మన నాయకుడే హయిగా తెలంగాణాలో జీవిస్తున్నప్పుడు నోరెత్తకుండా, ఇంక మనకు తెలంగాణా తెదేపా ఎందుకు అనుకోరా అక్కడ? మన వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ కన్న కలలకు మీరిచ్చే చరమాంక సందేశం ఇదేనా, హైదరాబాద్ వ్యాపారం కుటుంబం ముద్దు, అధికారం ఇవ్వని ఆంధ్రా ప్రజలు వద్దు, అంతేనా. పార్టీ అభిమానుల ఆవేదన అర్ధం చేసుకోండి, ప్లీజ్.

Sept 10, 2020 : గతంలో మనం చెప్పిన విధంగానే, పార్టీ క్షేమం కోరి ,

అయ్యన్న పాత్రుడు గారు కూడా, పార్టీ బాగుపడాలంటే అధినాయక‌త్వం రోడ్డు మీదకు రావాల్సిందే. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని విమర్శలు చేస్తే, పార్టీ నడుస్తుందా, అంటూ గట్టిగానే అడిగారు అని అనుకుంటున్నారు.

తప్పదు, ఆంధ్రా పరిస్థితి అలా ఉంది. ఫోన్ టాపింగ్ భయం ఉంటే, ఫోన్ వాడకుండా వేరే మార్గం చూసుకోవాలి, వ్యక్తిగతంగా కలవడం లేదా ఈమెయిలు లేదా ఇంకో దోవ. కానీ బాబు, లోకేష్ గారు, ఆంధ్రా లో ఇంట్లో ఉండి అయినా, పోరాడాలి లేదా కార్యకర్తలు ను నడిపించాలి, అని శ్రేయోభిలాషులు విన్నపము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 06-Aug-2020, Upd Dt : 06-Aug-2020, Category : Politics
Views : 166 ( + More Social Media views ), Id : 633 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : chandranna , hyderabad , heritage , business , family , andhra , people , without power , lokesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content