APLatestNews.com top Banner

Social Media links
విశాఖపట్నం గ్యాస్ లీక్ బాధితుల కై ఆంధ్రాకు చంద్రన్న, ఆనందోత్సవాలలో అభిమానులు - News
           
     
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

Update : మంగళవారం నుంచి దేశీయ విమానాలను ప్రారంభించాలని, అధికారులు తీసుకున్న నిర్ణయం కారణంగా, సిబిఎన్ రేపు అమరావతి చేరుకోనున్నారు.

ఆంధ్రా కు వస్తున్న నారా చంద్రన్న, ఆనందోత్సాహాలతో అభిమానులు. జగన్ సంవత్సర పాలన తప్పులు, ఏడాది తప్పటడుగుల గందరగోళం, ఇబ్బందుల పై ఫోటో వివరణలు చూడండి. కరెంటు ఛార్జీలు మోసాల, నష్టాల గురించి పూర్తి వివరణలు వీడియో లో.

గత 2 నెలలుగా, కేంద్ర లాక్ డౌన్ రీత్యా హైదరాబాద్ లో ఉంటూ, ఆన్లైన్ జూం మీటింగులతో ప్రజలను, ప్రవాసులను, నాయకులను ఎప్పటికప్పుడు పలకరిస్తూ, సంభాషిస్తూ, సలహాలిస్తూ, ప్రభుత్వ తప్పులను గట్టిగా ఎత్తిచూపుతూ, తెలుగు తమ్ముళ్ళ కు ధైర్యాన్ని నింపుతున్న, తెలుగు దేశం పార్టీ అధినేత ఆశాజ్యోతి, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రా ప్రతిపక్ష నాయకులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా, ఆంధ్ర ప్రదేశ్ నేలపై కాలు పెడుతున్నారు.

తెలంగాణా మరియు ఆంధ్రా ప్రభుత్వ డీజీపీ ల అనుమతి తీసుకుని, రేపు ఉదయము విశాఖ వస్తున్నారు. అక్కడ గ్యాస్ బాధితులను కలుసుకుని పరామర్సిస్తారు. వీరిని కలవడము ఇదే మొదటి సారి. గతములో విమానము ద్వారా వద్దామని, రాష్ట్రాలకు అనుమతి పత్రం లేకుండా, కేంద్రానికి అనుమతి దరఖాస్తు చేసుకున్నారు, కానీ వారి నుంచి అనుమతి రాలేదు.

ఇప్పుడు నిభంధనలతో కూడిని అనుమతిని ఇచ్చారు, ఆంధ్రా డీజీపీ. ఆరోగ్యరీత్యా 60 దాటిన వారికి ఉన్న జాగ్రత్తలు తీసుకుంటూ, రాత్రి 7 నుంచి ఉదయము 7 వరకు ఉన్న నిషేదాజ్ఞలను పాటిస్తూ, రెడ్ జోన్ల జోలికి పోకుండా, గుంపులు గుంపులు గా గుమి గూడకుండా, జాగ్రత్తగా ఉండాలి తమ పర్యటణలో. ఏ మాత్రము ఏమరిపాటుగా ఉన్నా, క్వారంటైన్ కి వెళ్ళవలసి వస్తుంది, పోలీసులకు అవకాశము ఇచ్చినట్లుగా ఉంటుంది.

ఆయనతో పాటుగా, ఆయన కుమారుడు లోకేష్ బాబు కూడా వస్తున్నారు, డ్రైవర్ తో కలిసి. కరోనా కష్ట సమయములో రాష్ట్రము లో లేరు అన్న అపవాదుకు మరియు అధికారపక్ష ఆరోపణలకు, స్వస్తి పలికే మరియు గట్టిగా జవాబు చెప్పే విధముగా ఉంటారు అని వినికిడి.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను పర్మిషన్ అడిగారు, ఎట్టకేలకు ఈ-పాస్ వచ్చింది. వైజాగ్ వరకూ ఫ్లయిట్, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కరకట్టకు, చేరుకుంటారు. విమాన నియమ నిబంధనలు ఉంటాయి, అక్కడ కరోనా పరీక్షలు చేస్తారు, ఒక వేళ పాజిటివ్ వస్తే, కనీసము ఇంట్లో అయినా 2 వారాలు క్వారంటైన్ ఉండాల్సి వస్తుంది.

అభిమానులు కూడా ప్రస్తుతానికి సంతోషాన్ని మనసులో ఉంచుకుని, ఎలెక్ట్రానిక్ మీడియా లేదా ఫోన్ ల ద్వారా ఆనందాన్ని అభిమానాన్ని ప్రేమను తెలుపుతూ ఉండాలి కానీ, గుంపుగా వచ్చి కలసి, నాయకునికి ఇబ్బంది కల్గించకూడదు. అలాగే పోలీసులకు పని చెప్పకూడదు.

శ్రీమతి నారా భువనేశ్వరి గారితో కలసి వచ్చి, అమరావతిలోనే ఉండి, మధ్య మధ్యలో కుప్పమును సందర్శిస్తూ, అందరికీ ఆదర్శప్రాయముగా ఉంటారు, అని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

Photo 1 : Apr 27 - ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కలిసి మీకు నేనున్నా అనే భరోసా ఇవ్వడం కోసం, వస్తున్నా.. మీకోసం పేరుతో, నేను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ఏడేళ్ళ క్రితం ఇదే రోజున విశాఖలో ముగిసింది. సుమారు 7 నెలల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ 62 ఏళ్ళ వయసులో 2,817 కిలోమీటర్లు నడిచాను.

నాటి పాదయాత్రలో నేను స్వయంగా తెలుసుకున్న ప్రజల కష్టాలను తీర్చడానికి గత ఐదేళ్ళ పాలనలో రోజుకు 18గంటలు పనిచేసాను. 208 రోజులు, 16 జిల్లాల్లో సాగిన, వస్తున్నా... మీకోసం, పాదయాత్రలో అడుగడుగునా నా వెన్నంటి నిలిచి, నాకు స్ఫూర్తినిచ్చిన కార్యకర్తలు, నేతలు, ప్రజలందరికీ ధన్యవాదాలు.


Sri NCBN addressing the media about the discrepancies in the Electricity billing process in AP- Live (Video 1)

Power Bill Hike Shocks Andhrapradesh During Corona Virus Pandemic || Ys Jagan Failed CM (Video 2)

చంద్రబాబుకి ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో దారి పొడవునా ఘన స్వాగతం పలికిన #టీడీపీ కార్యకర్తలు, అభిమానులు (Video 3)  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 811 General Articles, 46 Tatvaalu
Dt : 24-May-2020, Upd Dt : 24-May-2020, Category : News
Views : 204 ( + More Social Media views ), Id : 560 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : nara chandranna , lokesh , andhra , visakhapatnam gas leak victims , telugu desam party fans happy , karakatta , amaravati

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content