చంద్రబాబు, లోకేష్, వీర్రాజు/ కన్నా, పవన్ గార్లు, చీరాల ఎమ్మెల్యే కరణం గారిని ఊళ్ళో ఉండేందుకు సహాయం - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,058; 104 తత్వాలు (Tatvaalu) and views 225,020.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చంద్రబాబు, లోకేష్, కన్నా, పవన్ గార్లు, చీరాల ఎమ్మెల్యే కరణం గారిని ఊళ్ళో ఉండేందుకు (ఉంచేందుకు) సహాయం చేయండి

తెలుగుదేశం ఆశాజ్యోతి యువనాయకులు, లోకేష్ గారు స్పందించాలి, బీజేపీ వీర్రాజు/ కన్నా గారు, జనసేన పవన్ కళ్ళాణ్ గారు, చీరాల ఎమ్మెల్యే కరణం గారిని ఊళ్ళో ఉండేందుకు మీకు వీలైన సహాయం చేయండి బాధ్యత గుర్తు చేయండి.

లోకేష్ గారు ప్రత్యర్ధులు నోళ్లు మూయించాలి, మీరు ఇష్టపూర్వకముగా కోవర్టుగా పంపలేదు అని చీరాల ప్రజలకు తెలియజెప్పాలి కదా. రాజన్న, జగనన్న మీద ప్రజలకు ఉన్న విశ్వసనీయత చంద్రన్న లోకేషన్న పై కూడా పెరగాలి అని మా ఆకాంక్ష.

చీరాల ఎమ్మెల్యే గారు, మన పార్టీలో ఉంటే, దయచేసి కనీసం చీరాలకు 4 రోజులు కేటాయింపు చేయమనండి. పార్టీ తరపున బహిరంగంగా చెప్పండి. మేము 7 రోజులు అడగము, అంత దురాశ లేదు. ఆయన వినకపోతే, ఆయన పార్టీ మాట వినడం లేదు, పార్టీ ది తప్పు లేదు అని జనము అనుకుంటారు.

లేదా వైసీపీ ఎమ్మెల్యే గా చలామణి అవుతున్నారు అంటే, పార్టీ కి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నారు అని మీరు భావిస్తే, ఎమ్మెల్యే ఎందుకు చీరాలలో ఉండరు అని నిలదీయండి, పార్టీ రాష్ట్ర జిల్లా పట్టణ నాయకుల తో, మిగతా సమస్యలు మీద ప్రభుత్వం ని నిలదీసినట్లే. జనం అప్పుడు మనలను విశ్వసిస్తారు.

లేదా మనమే కోవర్టుగా పంపాము కాబట్టి, సంవత్సరం గా ఉన్నట్లు సైలెంట్ గా ఉండటమే మంచిది అనుకుంటే, గమ్ముగా ఉండటమే ఉత్తమము. మన ఎమ్మెల్యేని మనము నిందించడము ఎందుకు. ఎందుకంటే మరలా వైసీపీ టికెట్ రాకపోతే, మన టీడీపీ నుంచి ఇవ్వవచ్చు కదా.

జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కన్నా/ వీర్రాజు గారు, కరణం గారి చీరాల తో పెళ్ళి ఒంగోలు తో కాపురము వంటి బాధ్యత లేని చర్యలను ఖండించండి, అర్ధము అయ్యేలా చెప్పండి. చీరాల పట్టణ, జనసేన మరియు బీజేపీ నాయకులను అడగమనండి, ప్రజా సమస్యలను పట్టించుకోకుంటే గుర్తింపు ఎలా వస్తుంది.

మిమ్మల్ని పెద్ద కోరికలు కోరడం లేదు, చీరాలకు ఫిషింగ్ హార్బర్ వస్తుంది అన్నారు, చేనేత పార్కు వస్తుంది అన్నారు, ఇంకేదేదో వచ్చేస్తున్నాయి అన్నారు, ఏమీ రాలేదు, రావు కూడా. ఎందుకంటే మా నాయకులు పట్టించుకోరు వారు ఇంటి సమస్యలతోటి అని.

కనీసం మా ఎమ్మెల్యే ను మా ఊళ్ళో ఉంచండి, ఆ సహాయము అయినా చెయ్యండి. ప్రజలకు అన్యాయం జరిగితే, వెంటనే వెళ్లి కలవమనండి. పెద్ద పనులు జరగకపోయినా, కనీసం మనిషి కళ్లు ఎదురు గా నిండుగా కనపడుతూ ఉంటే, అదో తృప్తి. చీరాల ప్రజలు అల్పసంతోషులు, ఆ భాగ్యం అన్నా కలిగించమని ప్రార్ధన చేస్తున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,058; 104 తత్వాలు (Tatvaalu) and views 225,020
Dt : 26-Jul-2020, Upd Dt : 26-Jul-2020, Category : Request
Views : 865 ( + More Social Media views ), Id : 615 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chandrababu , lokesh , kanna , pawan , chirala , mla , karanam , stay , assembly , constitution , somu veerraju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content