చలం దేవుడమ్మ - ఎక్కడో దూరాన కూర్చున్నావు, పాపలు మంచికి రూపాలూ, తల్లి తండ్రి నీవే నరసిమ్హా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చలం ఒక మంచి తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత, విలువలతో కూడిన ఎన్నో మంచి సినిమాలు తీసారు. 100 కి పైగా చిత్రాల్లో కథా నాయకుడిగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా నటించాడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు.

చలం, రామకృష్ణ, లక్ష్మి, తమిళనాడు సిఎం జయలలితల కాంబినేషన్‌లో గొప్ప చిత్రంగా వచ్చిన దేవుడమ్మ చిత్రం గొప్ప చిత్రం.

మనుషుల్లో రకరకాల స్వభావాలున్న వ్యక్తులుంటారు. అది మంచైనా చెడైనా, మనం చూసిన దాన్ని బట్టే, నిర్ణయించుకుంటాం. కానీ కొంతమంది మంచి వారి మనసులో గొప్పతనం ఉండదని, మనం మంచి వారు కాదని అనుకున్న వారి జీవితంలో కూడా చాలా గొప్పదనం ఉంటుందని, ఈ చిత్రం చెబుతుంది.

అందుకనే లోతుగా మనిషి గురించి తెలుసుకుని మాత్రమే, మంచి చెడు నిర్ణయం చేసుకోవాలి, అందుకు తగ్గ అనుభవం కూడా ఉండాలి సుమా.

కర్ణుడు మంచి వాడు అంటారు మూర్ఖులు, ఆయన ఉంది, దుర్యోధనుడు వైపు అంటే పాపం వైపు ఉన్నారు. అతను యుద్దం చేసింది దేవుడైన క్రుష్ణుని కి వ్యతిరేకముగా. కాబట్టి ఎంత దానకర్ణుడైనా, అతను ఉంది దుష్టచతుష్టయము లో, అహంకారం ఆధిపత్యం భోగాలలో అవసర అవకాశాల లో.

బ్రతుకుతెరువు కోసం పట్నానికి వచ్చిన అన్నదమ్ములతో పాటుగా వచ్చిన చెల్లెలు జీవితం నగరంలో ఎలా పతనమైంది అన్న కథనంతో పాటుగా, నగరంలో పతితురాలైన అబల జీవితం ఎలా చిగురించి, ఉన్నత స్థాయికి వెళ్లింది అన్న మరో కథనాన్ని కీలకంగా తీసుకుని, ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతముగా రూపొందించారు.

ఈ మూడు పాటలలో ఎంత అర్ధము ఉందో చూడండి. 1) దేవుడిని ప్రశ్నిస్తూ అమాయకము గా అంటున్నాడు. అసలు మోహము లో మునిగి, బ్రమలలో తేలుతూ, గారడీలు చేస్తుంది మనము, అంటే మనుషులము. దేవుడు తప్పులు చేయమని చెప్పలేదు, అరిషడ్వర్గాలకు దూరముగా ఉండమనే చెప్పారు, కానీ మనము వినము. శిక్షలు వచ్చేటప్పుడు మాత్రం, గుడులకు పరుగులు తో అంటాము, దేవుడు నిర్దయ గల వారు, ఇన్ని కష్టాలు ఇచ్చారు. ఆ కష్టాలన్ని మనమే తెచ్చుకున్నామని మాత్రం ఒప్పుకోము.

2) పసి పిల్లలు దేవుని రూపాలు అని ఎంత మధురముగా చెప్పారో చూడండి. వారిని భావి తరాలకు ఆదర్శము గా పెంచాల్సిన తల్లి దండ్రులు, తామే సంస్కారం వీడి, పిల్లలను దూరము గా ఉంచి, తాము ధన సంపాదనలో, వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. ఏది మంచో ఎది చెడో తెలియని స్థితిలో ఉంచుతున్నారు.

3) నరసిమ్హ స్వామి గురించి ఇంత మంచి పాట ఉందని తెలీదు. ఆయనకు ఉన్న బహు రూపాలు గురించి బాగా వివరించారు.

చూడండి, పేరుకు సినిమా పాటలైనా, జీవిత సత్యాలను నేర్చుకుంటున్నాము. ఇదే పుణ్యం పురుషార్ధం అంటే. మీరు మీ పిల్లలూ పాడుతూ, మీ స్నేహితులతో పంచుకుంటారు కదూ.


1) ఓ ఓ ఓ ఓవో ఓ ఓ ఓ ఓవో ఓ ఓ ఓ ఓవో

ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు సామీ - మొత్తం 2 సార్లు
ఎక్కడో దూరాన కూర్చున్నావు

లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు 2
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ, ముచ్చటగా హ హ చేసేస్తావు సామీ ||ఎక్కడో దూరాన కూర్చున్నావు||

పెరుగుతుంది వయసనీ అనుకుంటాము
కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము హ హ హ మొత్తం 2 సార్లు
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
మా కళ్ళముందు మాయ
తెరలు కప్పేస్తావు సామీ

ఎక్కడో దూరాన కూర్చున్నావు హ హ హ
ఎక్కడో దూరాన కూర్చున్నావు మ్మ్హ హ హ
ఎక్కడో దూరాన కూర్చున్నావు సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు


2)పాపలు మంచికి రూపాలూ, దేవుడి గుడిలో దీపాలూ
పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలూ.. దీపాలూ.. దీపాలూ

మచ్చలేని మాణిక్యాలు, ముచ్చటైన అరవిందాలు 2
కరుణకు ప్రతిబింబాలు, కనిపించే దేవతలు

పాపలు మంచికి రూపాలూ దేవుడి గుడిలో దీపాలూ.. దీపాలూ.. దీపాలూ
తాం తతై, తైత తాతై, దిగిత తాం తతై, తైత తాతై, దిగిత

చరణం 1 :
అభం శుభం తెలియనివారు, కల్ల కపట మెరుగని వారు 2
అసత్యాలు ఆడనివారు, అరమరికలు లేనివారు
చిలకలవలె పలికేవారు, చిరునవ్వుల పసివారు ||పాపలు మంచికి||

చరణం 2 :
చిన్ని చిన్ని పాపలు నేడు, రేపు దేశ పౌరులు మీరు 2
కాని పనులు చేయరాదు, నీతిబాట వీడరాదు
మన దేశం గర్వించేలా, మంచి పేరు సాధించాలి||పాపలు మంచికి||

3) తల్లి తండ్రి నీవే, దేవా (ఓరి) నరసిమ్హా
మా తోడూ నీడా నీవే, దేవా (ఓరోరి) నరసిమ్హా
నమ్మిన వాళ్ళను కాచేవాడా, ముల్లోకాలను ఏలు వాడా ||తల్లి తండ్రి||

అంతర్వేదిన వెలిసితి వయ్యా, లక్ష్మి నరసిమ్హా ఆ
అహోబిలములో ఉన్నావయ్యా, ఉగ్ర నరసిమ్హా ఆ
సిమ్హాచలమున కులికితి వయ్యా, వరాహ నరసిమ్హా ..
తిరుపతి గిరిపై వెలిగితి వయ్యా, యోగ నరసిమ్హా..
ఊరేదైనా నీ పేరేదైనా 2 అన్ని నీవే, మా నరసిమ్హా

హారి, హారి లో రంగా హారి
తారకనామా హారి
వైకుంఠధామా హారి
నరసిమ్హస్వామి హారి
హారిలో రంగా హారి 3 ||తల్లి తండ్రి|| స్లోగా

ప్రహ్లాదుడు నిను పిలిచిన వెంటనే, పరుగున వచ్చావూ..
హిరణ్యకసిపుని గుండెలు చీల్చి, నెత్తురు తాగావు..
వన్నెల చిన్నెల చెంచులక్ష్మిని, వలచి వరించావు
నిన్నే నమ్మిన జనాలకోసం, గుడిలో నిలిచావు

నిండుగ నీవు, మా గుండెలలో నా, 2 ఉండాలయ్యా ఓ నరసిమ్హా

చిత్రం : దేవుడమ్మ (1973)
సంగీతం : సత్యం, గీతరచయిత : రాజశ్రీ, నేపధ్య గానం : సుశీల, బాలు
chalam devudamma ekkado durana kurchunnaavu papalu manchiki rupalu talli tandri nive narasimha  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 26-May-2022, Upd Dt : 26-May-2022, Category : Songs
Views : 322 ( + More Social Media views ), Id : 1405 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chalam , devudamma , ekkado , durana , kurchunnaavu , papalu , manchiki , rupalu , talli , tandri , narasimha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content