అమ్మ నాన్న కు కొన్నాళ్ళ పాటు విదేశం చూసే, ఆరోగ్యం పొందే, సేవ త్యాగం మీకు నేర్పే, భాగ్యం కలిగించవా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1731 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1766 General Articles and views 1,289,295; 90 తత్వాలు (Tatvaalu) and views 176,161.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*దయచేసి అమ్మ నాన్న కు కొన్నాళ్ళ పాటు విదేశం చూసే, ఆరోగ్యం పొందే, సేవ త్యాగం క్రుతజ్ఞత ఆధ్యాత్మికత నేర్చుకునే, మీకు నేర్పే, భాగ్యం కలిగించవా? అమ్మ పై జాలి చూపవా? మాకు మీ అమ్మ నాన్నకు సేవ చేసే భాగ్యం కలిగించవా?*

దేవుడు ఎప్పుడూ మనల్ని కని పెట్టి ఉంటారు. మన ప్రతి ఆలోచన అడుగు కాల గమనములో నమోదు గా ఉంటాయి, దేనినీ తప్పించుకోలేము. కానీ మనము దేవుడిని లెక్క చేయము, దేవుని వైపు చూడము. ఆధ్యాత్మికముగా మానసికముగా ఎదగము.

కేవలము కపట నటన మొక్కుబడి పూజలు సేవలతో రోజులు గడిపేస్తాము, ఎవ్వరూ గమనించడం లేదు అనుకుంటాము. మానసిక శుద్ది త్రికరణ శుద్ది వదిలేసి, తీర్ధ యాత్రలు భజనలు తొమాల సేవలు అంటూ తిరుగుతాము. చేదు దోస కాయ ను ఎన్ని తీర్ధాలు లో తిప్పినా, ఎన్ని పూజలు చేసినా చేదు మారదు. కాబట్టి, ముందు మన మానసిక మురికి వదిలించుకోవాలి.

అలాగే, మన మంచితనానికి తగిన మంచి సహాయం చేయడానికి, మన తోటి మంచి వారు, ఎదురు చూస్తూ ఉంటారు.

కానీ అరిషడ్వర్గాల బానిసలమై, వాస్తవం విడిచి, వారిని గేళి చేస్తూ అవమానిస్తూ, అహంకారముతో, వారితో తగవు పెట్టుకుని మరీ, వారికి దూరముగా వెళతాము. వారికి ఏ విషయాలు చెప్పకుండా దాచి పెడతాము, మనము మన కుటుంబము, పతనం అవుతాము. చివరికి ముదుసలి తనములో, ఒంటరిగా అనాధలా, మా గోడు వినేవారు ఎవరూ లేరు అని, ఎంత ఏడ్చినా ప్రయోజనము లేదు. అది స్వయంక్రుతాపరాధం.

సహాయం చెయ్యి అందించినా, దానిని అందుకునే ఉత్తమ గుణం లేకపోగా, మా వాళ్ళు ఉన్నారు అండి, ఏమి సుఖం, దేనికి పనికి రారు, ఏవిధమైన సహాయం చెయ్యరు, అని ఈసడించుకుంటాము. వారికి ఎటువంటి చిన్న సహాయము కూడా చెయ్యకుండా దూరముగా గమ్ముగా ఉంటాము. మనకు సహాయం అడిగే అర్హత చిత్తశుద్ది నీతి నియమము ఉన్నాయా? అని మాత్రం పట్టించుకోము. అదే 75 శాతం మంది దౌర్భాగ్యము. అని సోము, గోపి తో ఇలా చెపుతున్నాడు -

అబ్బాయి/ అమ్మాయి, మీ తమ్ముడు/ అన్న/ అక్క/ చెల్లి తో ఒక్కసారి మనస్పూర్తిగా క్రుతజ్ఞత విశ్వసనీయతతో మాట్లాడు. దయచేసి అమ్మ నాన్న కు కొన్నాళ్ళ పాటు అంటే వారం, నెల, 6 నెలలు, విదేశం (అమెరికా, బ్రిటన్, దుబాయి, మలేసియా, . . ., కనీసం బొంబాయి కలకత్తా మద్రాసు బెంగలూర్, . . .) చూసే, మనకు నమ్మకం ఉన్న వారిదగ్గర సేద తీరే, ఆరోగ్యం పొందే, సేవ త్యాగం క్రుతజ్ఞత విశ్వసనీయత చూసి నేర్చుకునే, మీకు నేర్పే, భాగ్యం కలిగించవా? అమ్మ పై జాలి చూపవా?

మీ ఇద్దరూ మరియు ఇంట్లో అందరు (కోడళ్ళు/ అల్లుళ్ళు/ బంధువులు) ఓకే అనుకుంటే , విదేశీ వీసా తీసుకుని, టికెట్ కొని అమ్మ కు ఇవ్వండి. టూరిజం వీసా ఎవరికైనా ఇస్తారు, ఇతరులతో లేదా మాతో సంబంధం లేదు. ఇది మీ సేవానిరతికి క్రుతజ్ఞత విశ్వసనీయత లకు ఋజువు.

మీ ఇద్దరు కు ఉన్న ఉద్యోగం, ఆస్తి పాస్తులను బట్టి, 2 లక్షల దాకా ఖర్చు భరించే స్ధాయి ఉంది. ఆనాడు నాన్న ఉన్నప్పుడు కూడా ఇద్దరు నూ కలసి రమ్మంటే, అప్పుడు కుదరదు అన్నారు. ఖర్చు లేదా మీ భవిష్యత్ కు భయపడి కావచ్చు. ఇది సగం ఖర్చు మాత్రమే.

మీ ఇద్దరు కూ ఇష్టమేనా, పంపుతారా ఖర్చులు భరించి, అప్పు చేసైనా? పిల్లలు చదువు లు ఉద్యోగం కోసం, తల్లి తండ్రులు అప్పు చేయలేదా చిన్నప్పుడు. మీ నిర్ణయం, మీ కృతజ్ఞతలు విశ్వసనీయత లు మీవే కదా.

ఎవరికైనా, అవకాశం ఇవ్వడం వరకే మనపని, అంగీకరించడం తిరస్కరించడం వారిష్టం. ఎదైనా తప్పు లేదు, ఇబ్బంది లేదు. మనము అడిగిన మాట నిలబడి పోతుంది కదా?

విదేశం లో హోటల్ ఖర్చు, కారు ఖర్చు, తిండి ఖర్చు, ఇంకా ఎన్నో ఖర్చులు ఉంటాయి. కోట్లు ఉన్నా, మనల్ని నమ్మకముగా అన్ని తిప్పి చూపించి, క్షేమముగా పంపే వారు లేరు అని, భయపడే జనాలు చాలా మంది ఉన్నారు.

ఎందుకంటే, పెద్ద నగరాలు హైదరాబాద్ బొంబాయిలలో ఆటో ఎక్కితే, ఎక్కడ దిగుతామో, ప్రాణాలతో తిరిగి వస్తామో కూడా మనకు తెలీదు. అసలు మన ఇంట్లో వారే, ఎప్పుడు మనకు వెన్ను పోటు పొడుస్తారో కూడా తెలీదు కదా?

మిగతా సగం ఖర్చు, ఇక్కడ ఖర్చు, మనము భరిస్తాము, వారం లేదా నెల లేదా 6 నెలలు సమయం మీ ఓపిక ఇష్టమును బట్టి, అని అప్పుడు కూడా చెప్పిన. ఇవి ఉపయోగాలు

1. అమ్మ కూడా విదేశం చూడటం తో పాటుగా, తల్లి ప్రేమ, తనయుల సేవ త్యాగం క్రుతజ్ఞత విశ్వసనీయత ఎలా ఉంటుంది చూసి నేర్చుకుంటుంది. తర్వాత మీకు నేర్పిస్తుంది. మంచి ఉద్దేశ్యం తో మంచి ఆలోచన చెయ్యాలి.

2. అంతేగాక, మంతెన సత్యన్నారాయణ లాగా లేదా ఏర్పేడు/ తిరుపతి ఆశ్రమము లాగా, నీతి నియమాలు, 6 కు నిద్ర లెగవడం, వ్యాయామం, నేల నిద్ర చేయడం, పూజ పునస్కారం, వేపాకు కాకర త్రిఫలం లాంటి 16 పొడుల మూలికల మిశ్రమాలు, 4 రకాల రసాలు ఒక్కో రోజూ తాగుతూ, కషాయం, పౌష్టిక కల్తీలేని ఆహారముతో, కేవలము సత్యం వాస్తవం మాట్లాడే మనసులతో, ఆత్మ జ్ఞానం నేర్చుకుంటూ, ఆరోగ్యమును సరి చేసుకుని, బీపీ షుగరు ని కంట్రోల్ చేసే, సదవకాసం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది.

3. మన శని వారం, అరిషడ్వర్గాల సాధనలో పాలు పంచుకుంటారు కదా. అదే నిజమైన భగవంతుని సాధన అని గ్రహిస్తారు. పరోపకార మనస్తత్వం ఉండి ఓపిక ఉంటే చేయాలి అని అనుకుంటే, మా ముదుసలి అమ్మ సేవ చేయవచ్చు ఇవి అలవాటు చేసుకుంటూనే, అది నేను ఉన్నంత వరకు ఇతరుల అవసరము లేదు.

4. గతి తప్పాక, ఆసుపత్రి లో రోగానికి లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు, ఇవి నేర్చుకుని ఆరోగ్యముగా 10 కాలాలు బతకడానికి, మన కుటుంబాన్ని బతికించుకోవడానికి, ప్రయత్నం చేయలేమా?

5. ఇలాంటి లక్షణాలు గుణాలు (కోర్సులు) యూనివర్సిటీలు నేర్పవు. యూనివర్సిటీల చదువులు అరిషడ్వర్గాల బానిసత్వాన్ని నేర్పుతాయి. మరి మన శిక్షణ, ఆధ్యాత్మిక ప్రగతిని నేర్పి, వాస్తవాన్ని చూపి, ప్రాపంచిక మోహాలనుంచి బయటకు తెస్తాయి.

ఇది మనతో సంవత్సరం పైగా, కుటుంబ కష్ట నష్టాలు దాపరికము లేకుండా, మాట్లాడే వారికే. ఎందుకంటే, మన మరియు వారి గుణ గణాలు తెలీకపోతే, 2 రోజుల్లో పారిపోతారు. వామ్మో, పొద్దున్నే 5 కి లేపి, వేపాకు కాకరకాయతో కషాయం తో మా ప్రాణాలు తీస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మేము బరువు రోగాలు తగ్గి, ఆరోగ్యం గా మారితే ఆసుపత్రులు మూసేయరా, వందలమంది రోడ్ పాలు కారా, అని బాధపడతారు.

కాబట్టి కపటం నటన వదలి, మనసు విప్పి మాట్లాడుతూ, అరిషడ్వర్గాల బానిసత్వం వీడిన వారే, దేహశుద్ది ఆరోగ్యశుద్ది మానసిక శుద్ది కి ప్రయత్నం చేస్తారు, మనల్ని తట్టుకోగలరు. ఇతరులు తట్టుకోలేరు, తమ తప్పులు అజ్ఞానం చేతగాని తనం, ఒప్పుకోలేరు. ఎందుకంటే, భవిష్యత్ లో వారికి అసలు భౌతిక మానసిక జ్ఞానం, కూతురు/ కొడుకులు నేర్పుతారు, సవివరముగా.

ఒకరు అడిగారు, మరి మీలో ధనం సమ్రుద్దిగా లేని వారు ఉంటారు కదా, వారికి సహాయం ఎలా అని. మనకు స్నేహితులు బంధువులు ఇతరులు, 3 రకాలు గా ఉంటారు. ఇందులో మనకు తప్పు లేదా ఒప్పు అయినా, స్తిరమైన ఆలోచనలతో ఉన్న విశాల గుణము మాత్రమే ముఖ్యం. అశాస్వతమైన వారి ధనం హోదా పదవి కి, పంచభూతాల ముందు కాలం ముందు విలువ ఉండదు, మన దగ్గర అంతే. మన పరిస్తితి బాగోకపోయినా, వారి పరిస్తితిని బట్టి సహాయం చెయ్యడానికి, మనం ఎప్పుడు సిద్దమే.

1. మమ్మల్ని రమ్మన్నారు, అదే పది వేలు. దేవుడి దయవలన, మాకు మా పిల్లలకు ఖర్చులు భరించే శక్తి ఉంది. తప్పక వస్తాము ఆశ్రమానికి వస్తాము లాగన, అన్ని సర్దుకుని ఉండి, కష్టపడి నేర్చుకుంటాము. చివరలో ఆసుపత్రి రోగాల కంటే, అకాల మరణం కంటే, ఇదే గౌరవం మర్యాద. మాకు ఆరోగ్యం ఆధ్యాత్మికత అరిషడ్వర్గాల సాధన మాత్రమే కావాలి, అనే వారు కూడా ఉంటారు.

2. గతాన్ని మరువకుండా, క్రుతజ్ఞత విశ్వసనీయత తో, మాకు సగమైనా చేయూత నిస్తున్నారు, ఉత్సాహపరుస్తున్నారు, పర్లేదు. సంతోషం. మాకూ ఆరోగ్యం కావాలి, తప్పక వస్తాము, అనే వారు ఉంటారు.

3. మాకు ధన శక్తి లేదు ఊరంతా అప్పులు, అన్ని మీకు 3-5 ఏళ్ళు గా తెలుసు, ప్రతి వారం నెల అన్ని చెప్పాము కదా. మీకు అన్నిటిలో సహాయకముగా ఉన్నాము, ఎనాడూ నటించలేదు. అయినా అప్పు చేసి, అమ్మ/ నాన్న ను పంపుతాము. మీరే ఆదుకోవాలి అనే వారు ఉంటారు. వచ్చి వెళ్ళి న తర్వాత, వారి పెద్ద ఖర్చులు, వారికి వెనక్కి ఇద్దాము.

ఎందుకంటే, గతములో ఒకరికి అన్ని మనము పెట్టుకుందాము అంటే, వారు చివరలో మాకు పనులు ఉన్నాయి, అని మొఖము చాటు వేసారు. మొత్తం ధనం నష్టం. కాబట్టి వారికి బాధ్యత నేర్పాలి అంటే, ముందు వారి ఖర్చు తోనే రావాలి. వారి ఆర్ధిక స్తితి గురించి, తప్పకుండా గత 3-5 ఏళ్ళు గా వారు, మనకు చెప్పి ఉంటారు కదా? తప్పక వారికి మనము సహాయం చేస్తాము.

ఇది ఇప్పుడే కాదు, 2014 నుంచి, దాని ముందు కూడా, అందరికీ చెప్పాము. శివ ఆజ్ఞ లేనిదే, చీమైనా కుట్టదు కదా?

ప్రపంచంలో అందరూ నీతి నియమాలను తప్పారు, అన్న విషయం తో మనకు ఉపయోగం లేదు. మనం మరియు మన కుటుంబం, నీతి నియమాలతో ఇన్నాళ్లు ఉందా? ఇది ఉపయోగం.

మనకు నీతి లేనప్పుడు, మన పిల్లలు నీతి నియమాలతో ఉంటారా? ఉండకపోతే తప్పు ఎవరిది? మన పాపం బాధ్యత ఉండదా? లేకపోతే, ఎందుకు నటన బంధాలు, ఎవరికి ఉపయోగం?

మొన్న కధనం అదే కదా, మూగబోతున్న ముదుసలి గొంతు లు/ మనసు లు. ఎవరి పాపం వారి వెంటనే పడుతుంది అని ఒప్పుకోమా, పశ్చాత్తాపం పడమా?

అని సోము, గోపి తో ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు, తను, తన బంధువులు స్నేహితులు నమ్మిన వారికి, ఇస్తున్న ఇవ్వబోతున్న అండ గురించి.

నిజమేరా, మంచి చేసే వారు ఉన్నా, మనము అహంకారముతో అన్ని పోగొట్టుకుంటాము. మన లోపాలను ఒప్పుకోము, సరి చేసుకోము. ఇంకా ఇతరులనే నిందిస్తాము. అసలు ఫోన్ లోనే 10 నిమిషాలు పలకడానికి, మేము బిజీ అండి సొంత గోతులతో అంటారు అందరు. మరి మీరు ఇతరులకు సహాయం చెయ్యడానికి కనీసం మాట అయినా ఇచ్చావు, ముందుకు వచ్చావు, అదే 10 వేలు. దేవుడు సహాయం చేయలేదు అని అంటాము. అసలు దేవునే మొసము చేస్తున్నాము, ముందు అరిషడ్వర్గాలను జయించాలి, త్రికరణ శుద్ది గా, దేవుని గుణాలను ఆచరిస్తూ, ఆ విషయాలు అందరితో పంచుకుంటాను అని గోపి, సోము తో అన్నాడు. .

Can you gift mom dad to travel abroad for weeks, get healthy, learn and teach sacrifice service spirituality to you? Can you show pity on parents? Can you give lucky to us to serve your dad and mom?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,289,295; 90 తత్వాలు (Tatvaalu) and views 176,161
Dt : 21-Aug-2022, Upd Dt : 21-Aug-2022, Category : General
Views : 255 ( + More Social Media views ), Id : 1501 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : gift , mom , dad , parents , travel , abroad , healthy , teach , sacrifice , service , spiritual
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content