పురాణ అలాగే నేటి సామాజిక ఉదాహరణలతో, మీరు ఆచరిస్తున్న సాక్ష్యం తో వివరించగలరు? ఒక్కసారి దయచేసి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,487; 104 తత్వాలు (Tatvaalu) and views 225,762.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Can you explain well, with examples from mythology as well as today's society, with evidence from your practice? Can you please tell us once?

*ఏవండీ మీరు చెప్పింది నిజం, మా పెద్దలకు/పిల్లలకు/మనుమలకు చెప్పలేక పోతున్నాము. మానసిక బలం పెంచలేక పోతున్నాము. అధికారం పదవి ఆస్తులు ఆశలు ఎన్ని ఉన్నా, ఇంట్లో ఓడిపోతున్నాము. మా స్నేహితులు బంధువులు అంతా మా లాంటి వారే, మానసిక బలం లేదు.*

*మీరు అయితేనే బాగా చెప్పగలరు, పురాణ అలాగే నేటి సామాజిక ఉదాహరణలతో, మీరు ఆచరిస్తున్న సాక్ష్యం తో వివరించగలరు? ఒక్కసారి దయచేసి చెపుతారా?*

*జవాబు* - గురువు గారు మీ నమ్మకానికి ధన్యవాదములు. కని పెంచి అన్ని సౌకర్యాలు ఇచ్చిన, మీ మాటే వినలేదు అంటే, ముక్కు మొఖం తెలియని మా మాటలు వింటారు అని మీరు ఎలా భావిస్తున్నారు? మాత్రు దేవోభవ, పిత్రు దేవొభవ అన్న సాధన లేదు అనుకోవాలా? లేదు మీ వాళ్ళు మా మాటలు విని, ఏమిటీ ఈ బోర్ కొట్టే మాటలు ఈ రోజుల్లో కూడా అంటే, అంతులేని ప్రాపంచిక ఆనందమే ముఖ్యం అంటే, మన ఇద్దరికీ ఉపయోగం ఉందా?

మా గురించి వారికి, ఏమని తెలుసు? మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తారు? తిండి పెట్టే వారి మాటలు బోధనల కే దిక్కు లేదు, మీ సోది ఏంది అండి అని అనరా?

మీరు ఎప్పుడైనా, ఇదిగో ఈ శని వారం పనులు మీరు చెయ్యగలరా? అని మీ పెద్దలను/ స్నేహితులను/ బంధువులను/ పిల్లల్ని అడిగారా? పోనీ మీరు ప్రయత్నం చేసారా? మన వంశములో ఇలా చేసే వారు ఎవరూ లేరు అని, వారికి చెప్పారా? అతను మా శిష్యుడు, అతను చెపితే మేము ఏమైనా చెయ్యడానికి, అన్ని వదులుకోవడానికి సిద్దము అని చెప్పారా?

9 ఏళ్ళ సజీవ గురువు సేవ, 180 వారాల 108 ప్రదక్షిణలు 1 గంట 15 నిమిషాలు ఉత్త కాళ్ళతో, శాఖాహారముతో చాపనిద్రతో, 100 చెడిపోయే దోవలు క్షణములో పొందే అవకాశం ఉన్నా ఇంత నిగ్రహముగా కామ క్రోధ మద లోభ మోహ మాత్సర్యాలను వీడి ఉండటం, మా వలన కాదు అని చెప్పారా? లోకం తీరు కధనాలు, గొంతు పాటలు చూపారా?

ఇవన్నీ చెప్పి వారికి చూపి ఉంటే, వారికి మన మీద గట్టి నమ్మకం గౌరవం మర్యాద ఉంటుంది/ ఉండే అవకాశం. అమ్మో మా తల్లి దండ్రులే ఆయనకు తలవంచుతున్నారు అంటే, మేము తల వంచాలి అని, మనసుకు బుద్ది కి అనిపిస్తుంది. అది లేనప్పుడు, మా మాటలు వారికి ఎక్కవు, నమ్మకం కలగదు. అందుకే ఇంటి సంస్కార పెంపకం ఉండాలి అని, 5 ఏళ్ళుగా మేము మొత్తుకుంటుంది. దైవ పూజ కూడా వారికి మీరు నేర్పాలి.

5 ఏళ్ళుగా మీరు ఎప్పుడు, మా కుటుంబములో ఇలా చెప్పాము, మా వారికి అందరికీ, ఈ పనులు గురించి విన్నారు, మా వలన కాదు అన్నారు, అన్న మాట అనలేదు. వారి స్పందన చెప్పలేదు. మీకు ముందు పరిపూర్ణ నమ్మకం ఉంటే కదా, పిల్లలకు ఇతరులకు నమ్మకం కలిగేది? మీకు నమ్మకం లేనప్పుడు, మనది వ్రుధా ప్రయత్నం మాత్రమే, వారిని అనవసరముగా ఇబ్బంది పెట్టడం అవుతుంది.

ఇప్పుడు మన పిల్లలకు, తప్పుడు మాటలు విచ్చల విడిగా బహిరంగముగా మాట్లాడాలి అంటే, నేర్పే గురువు ఎవరు అంటే? మనకన్నా ముందే, మన 25 ఏళ్ళ లోపు పిల్లలు చెపుతారు. మాజీ మంత్రివర్యులు కొడాలి వంటి పుణ్యాత్ములను, చంద్రన్న పెంచి పోషిస్తే, మన జగనన్న కొనసాగిస్తున్నారు అని. కాబట్టి ఇప్పుడు కొడాలి ఓ మంచి గురువు గా మన పిల్లలకు నేర్పితే, అవి వారు ఈజీగా నేర్చుకుంటారు, తలవంచి నమస్కరించి. ఎందుకంటే, మీరు, అలాగే సమాజం, టీవీ, సోషల్ మీడియా అన్ని ఆయన సంస్కార మాటలను విపరీతముగా ప్రచారం చేసి, 25 ఏళ్ళ లోపు పిల్లల మనసును చెడగొడుతున్నాయి.

మరి మంచి పనులను ప్రచారం చేసే, పది మందికి చూపే పెంపక సంస్కారం, మన ఇంట్లో వంట్లో వంశములో సంఘములో పార్టీలో వర్గములో ఉందా అని, ఎవరికి వారు మనలో మనమే ప్రశ్నించుకోవాలి. లేకపోతే నష్టం ఎవరికి? మనకే మన కుటుంబానికే, మన పిల్లలు/ మనుమలకే. ఎందుకంటే చెడువైపు వారు తేలికగా వెళతారు, మంచి ఎక్కడ వెతకాలో ఎవరిని అడగాలో తెలీదు.

ఎందుకంటే, మన పిల్లలు/ పెద్దలు, మానసిక బలహీనతతో, కోరికలను ఆశలను అణుచుకోలేరు మాయను అర్ధం చేసుకోలేరు, ఆవేశములో ఏదో ఒక తప్పు దోవ పడతారు. వారు పతనం అవుతూ, తమ తోటి వారిని, అలాగే మనల్ని మన కుటుంబం ను కన్నీళ్ళ పాలు చేస్తారు. 25 ఏళ్ళ లోపు పిల్లలు - ఆత్మహత్యలు, హత్యలు, దొంగతనాలు, అబద్దాలు, చాటుతనం, ఎదిరించడం, లెక్కచేయకపోవడం, పెద్దలగౌరవం మంటగలపడం, పెద్దల పనులు చేయడం, ఇతర తప్పుడు పనులు, ఎంత దిగజారిపోయామో స్పషముగా తెలుపుతున్నది కదా? అలా వారిని పెంచి పతనము చేసింది మనము, మన అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం మాత్రమే గురువు గారు.

మీ/మన పిల్లలకు/ పెద్దలకు, మీ/మన మాటలు చేష్టలతో, మన శనివారం పనుల గురించి నమ్మకం కలిగితే, అది మీ మాటలలో సాక్ష్యం తో కనపడితే, తప్పకుండా పిల్లలకైనా పెద్దలకైనా, మీ కుటుంబ సభ్యుల సమక్షము లోనే, మాట్లాడి వారి ఆలోచనా తీరుని పసిగట్టి, మీకు వివరముగా పరిష్కార మార్గాలు వివరిద్దాము. మీరు మారితేనే, వారు మారతారు, ఇది సత్యం, ఇది మాత్రమే పరిష్కారం. మన్నించాలి, అన్యధాభావించవద్దు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,487; 104 తత్వాలు (Tatvaalu) and views 225,762
Dt : 18-May-2023, Upd Dt : 18-May-2023, Category : General
Views : 255 ( + More Social Media views ), Id : 1752 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : examples , mythology , society , practice , evidence , children , kids , parents , issues , character
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content