APLatestNews.com top Banner

Social Media links
సోదర సోదరీ అంటూ నే, పల్లెటూరు ల లో దిట్టమైన కంచెలు, బయట వారిని రానీయడం లేదు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

ఆ ముగ్గురు సోదరులు మనల్ని చూసి, నవ్వుతూ ఉన్నారు, ఏమనో తెలుసా. చదివాక, చివర ఉన్న మానవ జూ చిత్రము చూడండి. నళ్ళ కళ్ళజోడుతో, కెమారా తో జంతువులు మనల్ని బోనుల్లో ఎలా చూస్తున్నాయో చూడండి.

మావా, మన సోదర మానవజాతి, 2020 సంవత్సరానికి మార్స్ గ్రహం లో కాలు పెడతాం అని చెప్పారు, చూడు , ఆ పిచ్చి వాళ్ళ ను ఇప్పుడు, కనీసం వీళ్ల దుంపతెగ ఇంటి బయటకు రావాలంటే భయపడి ఛస్తున్నారు. ఓ చిన్న సూక్ష్మ జీవి కరోనా కోవిడ్ 19 ను చూసి. ఇన్ని రోజులు మనల్ని బంధీలుగా జూలో పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ను ఓ చిన్న జీవి, బంధించింది.

అల్లుడు, మరి ఇది ఉత్త జ్వరం, మామూలు షాపులో దొరికే మందు కు రోగం పోతుంది అని, మంత్రి గారు నుడివారు కదా టీవీ మైకులో.

అవును మామ, ఎలక్షన్ కదా అని అలా చెప్పారు. తర్వాత లేదని తెలిసాక, అంతా లాక్ డౌనే. ఇంకోటి మామా, మనము కూడా జాగ్రత్త గా ఉండాలి, పాడు మానవులకు దూరముగా ఉండి, ఎందుకంటే, న్యుయార్క్ లో ఉన్న మన పులి కి కూడా, కరోనా అంటించారు అంట, మాంసము తోనో లేక ఇంకో దానితోనో.

మరి పాశ్చాత్య దేశాల సంగతి ఏమిటి అల్లుడు? అయ్యో , ఇందాకా నేను చెప్పినది వారి గురించే, మామా. ఎక్కువ దడుచుకుని చస్తుంది వారే. బయటకు వస్తే చలానా రుసుము లేదా జైలు. పాలు గుడ్లు అన్ని ఒక్కొక్కటే, అన్నటికీ కటకట. ఏ వైపు నుంచి కరోనా వస్తోంది తెలీదు, ఫ్రిజ్ లో కూడా కూరలు తో పాటు, కరోనా ను దాచేసారు తమకు తోడుగా నీడగా.

మరి మన స్వదేశం లో ఎలా ఉంది అల్లుడూ. అబ్బో అదో చిత్ర విచిత్రమైన కధ, గాధ. ఎవరిమాట ఎవరూ వినరు కదా.

ఓ వైపు అందరూ నా సోదర సోదరీ మణులు మాణిక్యాలు అంటూ నే, పల్లెటూరు ల లో దిట్టమైన కంచెలు కట్టేశారు. బయట వారిని రానీయడం లేదు, గ్రామములో ఇప్పుడు ఉన్న వారు తప్ప, ఎవరో ఒక్ సర్పంచ్ అక్కడే కుర్చి వేసుకుని కూర్చున్నారు అంట.

ఇంకొందరు, ఎవరినీ లెక్క చేయకుండా, వాళ్ళ ఇంట్లో కూడా, ఒకరికి అయినా ఫోటో కి దండ వేయాలని ఆత్రంతో, అబద్ధాలు చెపుతూ బయట తిరుగుతూ, కరోనా కి ఎదురు పరుగెత్తుతున్నారు.

హెల్త్ కేర్ వర్కర్లు కూడా, కరోనా జాగ్రత్తలు చెపడానికి ప్రజల వద్ద కు, గుంపుగా 6 అడుగుల దూరం లేకుండా, మాస్క్ గ్లౌజులు లేకుండా, ప్రతి ఇంటికి తిరిగి, వారితో కరచాలనం చేస్తూ, కుర్చీలో కూర్చుని, రోగం పెరగడానికి శాయశక్తులా, ప్రయత్నం చేస్తున్నారు.

గ్రామ వాలంటీర్ లు పంచాయతీ ఆఫీసు కు, డీలర్లు రేషన్ షాపు కు, రా రమ్మని జనాన్ని పిలుస్తూ, పెరగడానికి తమ వంతు కృషి తాము చేస్తున్నారు. జనము కూడా, కరోనా జాగ్రత్తలు మరచి, గుమిగూడుతున్నారు.

ప్రధాని ఇంట్లో దీపాలు వెలిగించమంటే, కాగడాలు పట్టి గుంపులు గా గ్రామములో తిరుగుతూ, ఓ కరోనా వెళ్ళు వెళ్ళు అంటూ నినాదాలతో, తమవంతు కరొనా ను తమ ఇంటికి తెస్తున్నారు.

ఇంకొంత మంది, తెచ్చి న కూరలు డబ్బాలు పాకెట్ లు, వేడి నీళ్ళు లేదా సబ్బు నీళ్ల తో, శుభ్రం చేసి భద్రపరుస్తున్నారు. ఇంకొంతమంది వైరస్ పోవాలని, వాటిమీద రసాయన మందులు చల్లుతున్నారు, ఒకటి పోయి ఇంకోటి రావాలనేమో.

మరి వీరెవరికీ భయం లేదా? పాశ్చాత్య దేశాల వార్తలు చూడరా?

చూస్తారు వింటారు, కానీ భయపడరు, పక్కన ఇంట్లో జరిగిన కూడా, మా ఇంట్లో మాకు జరగదు, అతీంద్రియ శక్తులు ఉన్నాయి, అని ఓ పిచ్చి భావన.

ఇప్పుడు ఎలక్షన్ పెట్టమన్నా, ఓ పెట్టు పెట్టు అనేవారు 50 శాతం పైనే ఉంటారు. వీరందరి లక్ష్యం ఒకటే, శాంతి స్ధాపన జరగాలని, మంచి వాళ్ళు మాత్రమే మిగలాలని.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 584 General Articles, 46 Tatvaalu
Dt : 06-Apr-2020, Upd Dt : 06-Apr-2020, Category : General
Views : 149 ( + More Social Media views ), Id : 477 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : corona , kovid 19 , animals laughing at humans
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content