కాలీఫోర్నియా అంటే భూతల స్వర్గం, పంచ భూతాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది మరి - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,567; 104 తత్వాలు (Tatvaalu) and views 226,010.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సోమవారం రాత్రి 4.7, మంగళవారం 3.4 స్ధాయి భూకంపాలు వచ్చాయి. అందరూ కాలీఫోర్నియా అంటే భూతల స్వర్గం అంటారు, అది నిజమే, దానితో పాటు ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయి ప్రతి క్షణం. గులాబీ కింద ముళ్ళు లాగా సుమా. పంచ భూతాల ప్రభావం, మా రాష్ట్రం మీద ఎక్కువగా ఉంది.

భూకంపాలు సర్వ సాధారణం ఇక్కడ. అప్పుడప్పుడు నిద్ర లో కదిలి నట్టు, ఊగినట్టు, వణికినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇళ్ళు మరియు ఒళ్లు. మా రాష్ట్ర జనాభా కు, అది మామూలు విషయమే. పెద్ద భూకంపం అంటే మాగ్నిటూడ్ స్కేల్ (కొలమానం) లో 6 దాటాలి అనుకుంటా. అలాంటి పెద్దది కూడా రాబోతోంది వచ్చే ఏళ్ల లో అంటున్నారు. అది వస్తే ఇబ్బందే.

మరి మా రాష్ట్రంలో జనాభా, ఆదాయం, పన్నులు, పేరు ప్రఖ్యాతులు మిగతా అమెరికా రాష్ట్రం ల కన్నా చాలా ఎక్కువ. ఎప్పుడూ సందడే సందడి. సిలికాన్ వాలీ ఉంది శాన్ ఫ్రాన్సిస్ కో దగ్గర - అది సాఫ్ట్వేర్ రంగానికి మూలం, హాలీవుడ్ ఉంది లాస్ ఏంజిల్స్ దగ్గర - అది ప్రపంచ సినీ రంగం కు మూలం, ఇవి ప్రపంచం అంతా తెలుసు.

డబ్బు తీసుకోకుండా, రాష్ట్రం దేశం కోసం కష్టపడేవారికి ఓటు వేస్తారు. కాబట్టి, మా రాష్ట్రం లో అందరికీ ప్రభుత్వ ఖర్చుతో సదుపాయాలు, హేల్త్ కేర్ అనే సిద్దాంతము కూడా ఉంది. అంటే ఎలా వచ్చారు, పౌరులా కాదా అన్నది ప్రశ్న కాదు. అందరూ మనుషులే కాబట్టి అందరికీ సదుపాయం సేవ అందాలి.

ఆ పాయింటే దేశ అధ్యక్షులు ట్రంప్ గారికి నచ్చడం లేదు, పౌరులకు మాత్రమే ప్రభుత్వ ఖర్చుతో సౌకర్యాలు అని వీరి వాదన. ఇక్కడ ఎప్పుడూ, డెమోక్రట్లే గెలుస్తారు, అంటే అధ్యక్షులు ఒబామా, క్లింటన్ గెలిచిన పార్టీ అన్నమాట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి పౌరులకు మంచి చేస్తాయి.

మినీ అమెరికా, మినీ భారత దేశం, మినీ తెలుగు దేశం ల ను ఇక్కడే చూడవచ్చు. అన్ని భారత భాషలుకు సంఘాలు ఉన్నాయి. ఆగస్ట్ ఇండియా పరేడ్ లో పాల్గొంటారు. అబ్బో, హింది, తెలుగు, తమిళం, మళయాలం, . . . సినిమాలు హోటళ్ళు ఆలయాలు. ఒక్కోసారి, ఇండియాలోనే ఉన్నామా అని అనిపిస్తుంది.

కాలిఫోర్నియా దేశము అన్నా తప్పులేదు, ఎందుకంటే, ఎన్నో జాతుల వారు ఇక్కడ ఉన్నారు సామరస్యముగా. పెద్ద నగరాల దగ్గర ఇళ్ళు , లేదా అద్దెలు చాలా ఎక్కువ. టూరిజం కి మంచి స్థానము మంచి ఆదాయము.

భూకంపం ఒకటే కాదు, అన్ని రకాలుగా ఆనందం, ఉద్యోగాలు, సంపద, ఇబ్బందులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎంతో మందికి ఉపాధి ఇస్తుంది.

ఒక వైపు ఎండలు, ఇంకో వైపు మంచు, ఇంకోవైపు ఎడారి, ఇంకో వైపు అందమైన పొడవైన సముద్ర తీరం, ఇంకోవైపు చక్కటి వాతావరణం. గాలి పంకాల కు, సూర్యుని నుంచి విద్యుత్ లాగే సౌర పలకలకు నెలవు.

మా రాష్ట్రం దక్షిణ కొన నుంచి ఉత్తర కొన కి వెళ్ళాలి అంటే కారులో 12 గంటలు పైనే పడుతుంది. అంటే తూర్పు అమెరికా రాష్ట్రాలలో, కనీసం 7 రాష్ట్రం లు దాటేస్తాము తేలికగా అదే సమయములో. మా రాష్ట్రాన్ని కూడా అభివ్రుద్ది కోసము విడగొట్టాలని, కొంత మంది ఎప్పటి నుంచో ప్రయత్నము చేస్తున్నారు కూడా.

కొండల మయం, అడవుల మయం, కావలసిన అంత ఖాళీ స్ధలం. అందుకే గాలి దేవుడు కి కోపం లేదా హుషారు వచ్చి విపరీతంగా వీస్తే, ఆయనకు అగ్ని దేవుడు తోడై, కొండల మీద అడవుల మీద దాడి చేసి, వన పంక్తి భోజనం మొదలు పెడతారు.

మా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లు వెంటనే అప్రమత్తమై విమానాలు, హెలికాప్టర్ సహాయం తో వరుణ దేవుని (నీళ్ళను, మంటలు ఆర్పే పొడి లేదా వాయువు) వారిపై ప్రయోగిస్తారు. వాయు అగ్ని దేవులు అలసిన తర్వాత ఎప్పుడో, చిన్నగా శాంతిస్తారు. ఎంతో మంది ఇళ్ళు కాలిపోయి, తిరిగి కట్టుకున్నారు. రహదారులూ మూసేస్తారు, ప్రయాణిస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా.

సముద్ర తీరం దగ్గర, అంటే గాలి వానలు , సునామీ ల కు కూడా దగ్గరే. పెద్ద వాన వచ్చినా , గాలి వచ్చినా , పెద్ద అగ్ని ప్రమాదం ఏర్పడినా ముందు జాగ్రత్త తో కరెంటు ఆపేసే అవకాశాలు ఎక్కువ.

కానీ వీటన్నింటినీ ఎదుర్కొంటున్నాము ధైర్యంగా ఎన్నో ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలము. కష్టాలు ఉన్నాయి అని భూమి ని, సొంత రాష్ట్రం ని వదులుకుంటామా అంటున్నారు ఇక్కడి ప్రజలు. వారి ధైర్యం కి , కష్టపడే తత్వానికి వందనాలు. ఒక్కసారి వచ్చి, ఈ రాష్ట్ర ప్రకృతి అందాలను చూసి వెళ్ళాలని మా కోరిక, తప్పక వస్తారు కదూ.  
5 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,567; 104 తత్వాలు (Tatvaalu) and views 226,010
Dt : 16-Oct-2019, Upd Dt : 16-Oct-2019, Category : America
Views : 1527 ( + More Social Media views ), Id : 190 , Country : USA
Tags : California , earthquake , mountain fire , silicon valley , hollywood , attractions and issues

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content