ఆత్మను చంపి, బిడ్డల భవిష్యత్ నాశనం చేసి, కూతురు లాంటి ఓటును, సంఘ ద్రోహుల నోటుకా? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1209 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1239 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

వర్గానికి అవసరానికి మందుకు నోటుకు ఓటు అమ్ముకోము,
మంచి దేశం కోసం, ఆత్మాభిమానం సంస్కారం గల ఓటరు గా,
ఇతరులకు నచ్చచెప్పి, రాజ వంశ కుటుంబ బానిస పాలన వదలి,
మనలాంటి కొత్త నీతి వారికి అవకాశం ఇచ్చి, బాధ్యతతో వెళ్ళి ఓటు వేస్తాము -
అని ప్రతి భారతీయుడు వారి కుటుంబం, ప్రమాణం చేసుకోవాలి.

ఆత్మను చంపుకుని, సొంత బిడ్డల భవిష్యత్ ను స్వహస్తాలతో కాలరాచి, కూతురు లాంటి ఓటును, వారము లోనే ఖర్చు అయ్యే, పచ్చ పిచ్చి నోటుకు అమ్ముకోవద్దు.

5 ఏళ్ళ ఓటు, 5 లక్షల పైన ఖరీదు. మూర్ఖత్వముతో దాని విలువ తక్కువ చేసుకుని, తక్కువకి మోసపోతూ క్షణికావేశములో అమ్ముకోవద్దు, మన పిల్ల జీవితాల బంగారు భవిష్యత్తును మిత్రమా.

పాలించే నాయకులు దొంగలు మోసగాళ్ళు కేటుగాళ్ళు అని అరిచే మనము, మందుకో అవసరాలకో వర్గానికో కులానికో బిర్యానీకో అమ్ముడుపోయి, మనమే మొదటి కుటుంబ సంఘ ద్రోహులమై కేటుగాళ్ళమై,

తప్పుడు మనుషులకు తప్పుడు ఓటు వేసి లేదా అసలు వేయకుండా ఇంట్ళో దాంకుని లేదా ఊరు మీద బలాదూర్ తిరుగుతూ,

మన కన్నా పెద్ద కేటు గాళ్ళకు మాయ గాళ్ళకు, దొంగలకు తాళాలు అవకాశము ఇచ్చి, ఆ పాపాన్ని కూడా తరాలు మూటగట్టుకుని,

రాష్ట్రా జిల్లా పట్టణ సంపదను, వారి చేతిలో మనసు చంపుకుని పెడితే, వారు కావల్సినంత దోచుకుని భూములు తాకట్టి పెట్టి, మన నోటిలో మట్టి కొట్టక మానరు.

ఆ సమిధలోనే మనమూ ముందు, ఆ తర్వాత వారు, మాడక మసి అవ్వకా తప్పదు ఎటూ.

ఇకనైనా మేలుకో, ఇతరులను నీ చుట్టూ మేలుకొలుపు, చుట్టూ తగలిబడితే, మనము ప్రశాంతము గా ఉండలేము కదూ.

మన పన్నుల ధనముతో, చేపట్టిన పధాకాలకు నిస్సిగ్గుగా తమ కుటుంబ పేర్లు పెట్టుకుని, మన రాష్ట్రాన్ని మనల్ని అప్పులలో ముంచి, భవిష్యత ఆశలను తుంచి, అప్పులను తగ్గించడము చేతగాని చవటలను,

రూపాయికి అమ్ముడు పోయి, మందు మత్తులో, నోటు చిత్తులో ఎన్నుకునే, మొదటి చవటలము, దద్దమ్మలము, తప్పుడు వారము మనమే కదా, మిత్రమా?

అందుకే మన సత్యమైన మాట ఎప్పుడూ - తప్పుడు నాయకులది ఏనాడు తప్పు కాదు, వారిని వ్యామోహములో ఎన్నుకునే, మన నెత్తిన అంటే గద్దె మీద కూర్చో బెట్టే, తప్పుడు మనషులం మనదే, మొదటి తప్పు, నాతో కలిపి కూడా.

ధనం కాదు చూడాల్సింది, గుణము, ముందు మనకు గుణము అంటే తెలియాలి, ఉండాలి కదా? మనము నేర్చుకోనిది, మనకేలా తెలుస్తునిద్, ప్రపంచ భ్రమలలో.

ఎన్నికైన తర్వాత, లక్ష రూపాయలు తెల్ల జీతము తీసుకుంటూ, కోట్ల రూపాయల నల్ల ధనము దోచుకుని దాచుకుంటూ, పదవి హోదా సౌకర్యాలు పొందుతూ,

ఆ తర్వాత ఫించను తీసుకుంటూ, మనకు ఊళ్ళో నెలకు 20 రోజులు కుడా అందుబాటులో ఉండని, తమ సొంత వ్యాపారాలలో మునిగి ఉండే నాయకులను,

ఎన్నుకునే దరిద్రపు మోసగాళ్ళము కేటుగాళ్ళము, మనము కాదా? అందరూ దొంగలైనప్పుడు, చిన్న దొంగను లేదా నీతి గల కొత్త వారిని ఎన్నుకోవాలి కదా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1239 General Articles, 47 Tatvaalu
Dt : 09-Mar-2021, Upd Dt : 09-Mar-2021, Category : Politics
Views : 242 ( + More Social Media views ), Id : 1019 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : killing soul , destroying , future , children , election , vote , daughter , not for note , india , andhra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content