APLatestNews.com top Banner

Social Media links
అలా చేస్తే, బావ లాగ తయారు కాకుండా, బాధ్యత గా ఉంటారు, మిమ్మల్ని కూడా బాధ్యత గా - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

గోపీ తన చెల్లెలుతో, పిల్లలకు భర్త కు బాధ్యత నేర్పమని, భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, అని నచ్చ చెపుతున్నాడు ఇలా.

బాధ్యత గల భార్య లా, ఖర్చు పొదుపు గురించి చెప్పావు చెల్లెమ్మా, సంతోషము. మరి బాధ్యత గల, తల్లి లాగా కూడా చెప్పు. కష్టం తెలిసేలా పిల్లల ను పెంచుతాను, అని ఓ పది మాటలు చెప్పు, వాళ్ళ చదువు కష్టాలు సంబంధించి కాకుండా.

బావ ఒప్పుకున్నాడు, మా వంశంలో ఉదయం 5 కి లెగవము, అందుకే మా పిల్లలను లేపము అనీ.

వాళ్ళ కష్టం గురించి మాత్రమే చెప్పాలి, చెమట, కన్నీళ్లు, చెప్పకుండా చేసే బాధ్యత గల పనులు. అందుకే ఉదయం 5అం అని ఒక ఉదాహరణ కు. అలాగే వారానికి ఒక రోజు పచ్చడి తో అన్నం, ఒకరోజు అసలు చిరుతిండి లేకపోయినా సర్దుబాటు చేసుకుంటారు, వాళ్ళ నాన్న ని ఉదయము 6 కల్లా లేపుతారు వీకెండ్ లు. ఇలా, మంచి బాధ్యత గల జవాబులు.

అలా చేస్తే వాళ్ళు, బావ లాగ తయారు కాకుండా, బాధ్యత గా ఉంటారు. మిమ్మల్ని కూడా బాధ్యత గా చూస్తారు.

బావని ఆ రోజు అడిగా,కనీసము పిల్లల చేత వారి తల్లి కి కాళ్ళు కడిగిస్తావా? ఆ ఓర్పు నేర్పు ఉన్నాయా అని? లేక వాళ్ళ అమ్మతో చెప్పి, తండ్రి కి కాళ్ళు కడిగించమంటావా అని?

సమర్ధత లేని వాడు, నా వలన కాదు ఒక్క నిమిషం పని అయినా కూడా, పిల్లలు నా మాట వినరు అంటే, నిజాయితీగా ఉంటుంది. బీరాలు పోయాడు, నేను ఈరోజు చేపిస్తా అని.

నువ్వేమో, వంద నెప్పులు చెప్పి, తర్వాత రోజుకు నెట్టావు. ఇప్పుడు కు కూడా, ఆ చిన్న పని చేయించలేక పోయారు.

అందుకే అత్త మామలు, మిమ్మల్ని ఎదగని వారిగా, పట్టించుకోరు అంటే వినరు కదా. పిల్లల పెంపకం రాదు, మా ఆయనకు అను, ఓ మాటలో, అయిపోతుంది, సమర్ధన ఎందుకు.

రాత్రి లేటుగా ఉన్నాడు అని తొందరగా లేవక పోవడం తప్ప , ఆఫీసు మరియు టిఫిన్ మానడు కదా? రాత్రి నిద్ర వలన ఇబ్బందితో, మానితే అన్ని మానాలి లేదా అన్ని చేయాలి. అంటే చచ్చి నట్టు పొద్దున్నే లెగవాలి, ఎప్పుడు నిద్ర పోయినా లేదా అసలు నిద్ర పోకపోయినా. అదే మరి కష్టం మరియు బాధ్యత అంటే.

ఆ కష్టం లో నుంచి, ఆలోచన వస్తుంది, పిల్ల వాడిని రాత్రి ఎలా తొందరగా నిద్ర పుచ్చాలో, అది నేర్చుకోవాల్సిందే లేదా పొద్దున్నే లెగవాలసిందే.

సగం చెడు బావ లో ఉంటే, మిగతా సగం తప్పులు, నువ్వు సమర్ధించి పూర్తిగా చెడగొడుతున్నావు.

బావ ఇలా మొద్దు గా, తయారు కావడానికి ఇద్దరు కారణం - సగం తల్లి, సగం భార్య.

బావ కు, తన భార్య ఎన్నింటికి పడుకుంటుందో, ఎన్నింటికి లెగుస్తుందో, అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్న వాడిలా ఉంటే, ఆయనకు తెలియక పోవచ్చు.

వీడియో తీసి చూపించు. ఇంట్లో ఉన్న ముగ్గురు మొద్దులకు. ఇదిగో రాత్రి పదకొండు కు పడుకున్నా నిన్న, ఈ రోజు ఉదయం ఐదు కి లెగిచి, ఈ పనులు అన్ని చేసా. నేనూ మనిషి నే, మీ లాగ అని.

మగ వారి భౌతిక బలం ఎక్కువ, ఆడ వారి కన్నా. మరి నాన్న ఎందుకు లెగవడు? అని పిల్లలకు, వాస్తవాలు చూపించు సాక్ష్యం తో.

మొన్నే అనుకున్నాం కదా, 8 గంటల ఉద్యోగం కన్నా, 12 గంటల పైన, ఇంటి పని ఎక్కువ అని. ఇప్పుడు తండ్రి మాటలు చేష్టలు చూసి, పిల్లలు నేర్చుకోవడం లేదా.

భార్య పనిమనిషి, యంత్రం లా తిరిగి చేయాలి. తక్కువ సమయం నిద్ర పోవాలి, అని వారూ అనుకోరా?

భర్త అంటే, ఆఫీసు పని మాత్రమే చేసి, ఉదయం 7 తర్వాతనే నిద్ర లెగవాలి అని నేర్చుకుంటే ఏమి అవుతుంది. రేపు పిల్లల భార్యలు, ఇలా పని మనిషి లాగా పని చేయకపోతే, వాళ్ళు వాళ్ళు తన్నుకుని చావరా? అవే బుద్దులు, పెళ్ళి కన్నా ముందే, తల్లి దండ్రులు మీద చూపరా?

పిల్లలు మన ప్రతి అడుగు గమనిస్తూ గుర్తు పెట్టుకుంటారు. పదేళ్లు లేదా బలం వచ్చిన తర్వాత, మొత్తం బయట పెడతారు. అప్పుడు ఏమి చేయలేము, మార్చలేము. వినరు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 29-Apr-2020, Upd Dt : 29-Apr-2020, Category : General
Views : 164 ( + More Social Media views ), Id : 522 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : kids husband responsible , care for parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content