APLatestNews.com top Banner

Social Media links
బిజెపి పదవులు తెలుగు రాష్ట్రాలకు - అరుణ అప్పుడే కేసీఆర్ పై, పురంధేశ్వరి, ల‌క్ష్మణ్, సత్య - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

తెలుగు రాష్ట్రాల‌ నుంచి డి.కె.అరుణకు ఉపాధ్యక్షురాలిగా అవ‌కాశం ఇవ్వ‌గా, మరో సీనియర్‌ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి ని, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరితో పాటు తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.ల‌క్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియ‌మించగా, ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు. అభినందనలు.

మొత్తం మీద, మొన్నటి దాకా క్రియాశీల‌కంగా ఉన్న జీవీఎల్‌, రాంమాధవ్‌, మురళీధర్‌రావు ల‌కు పార్టీ జాతీయ కార్యవర్గంలో ఎటువంటి స్థానం కల్పించకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మొదటి ఇద్దరు వైకాపాకు, మిగతా టీఆరెస్ కు మద్దతుగా ఉన్నారు అని భావిస్తున్నారు. కాగా జీవీఎల్‌, రాంమాధవ్‌ల‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని, అందుకే పార్టీ పదవుల్లోకి వారిని తీసుకోలేదనే మాట వినిపిస్తోంది.

డి.కె.అరుణ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు దేని కోసం అయితే పోరాడారో, ఎందుకు తెలంగాణ రావాలని కోరుకున్నారో, బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ నే, వికసించేది కమలమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి, ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. తనకు జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించినా, ఫోకస్ మాత్రం రాష్ట్రము పైనే ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, అభినందనలు. భగవంతుడు తగిన శక్తి ఆయురారోగ్యాలను ఇచ్చి, ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టడానికి పెంచడానికి, ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ పదవి మరియు పలుకుబడి తో, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి, రాష్ట్రానికి మరియు చీరాల పరిసర ప్రాంత ప్రజలకు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.

ఇక నుంచి పురంధేశ్వరి గారు మరియు ఇతర ఆంధ్రా నాయకులు, స్థానిక నాయకులను మేల్కోలిపి, వైకాపా ప్రభుత్వం పైన విమర్శల వర్షం కురిపిస్తారు అని, బీజేపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 800 General Articles, 46 Tatvaalu
Dt : 26-Sep-2020, Upd Dt : 26-Sep-2020, Category : Politics
Views : 96 ( + More Social Media views ), Id : 725 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : bjp posts , andhra , telangana , dk aruna , kcr , purandeswari , laxman , satya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content