APLatestNews.com top Banner

Social Media links
బీజేపీ జనసేన - రాజధాని లో ఆన్లైన్ మాటలు ఎక్కువ, పట్టణాలలో ఆన్సైట్ చేతలు తక్కువ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

* పార్టీ సమస్య కాదు, ప్రజలు సమస్య
* తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలు, మోదీ ఇద్దరు సీయెం ల తో
* వీర్రాజు గారి, జన్మదిన శుభాకాంక్షలు
* రాష్ట్ర స్థాయిలో పర్లేదు, కానీ అన్ని జిల్లాలలో ఆదమరచి గాఢనిద్ర
* బీజేపీ రాష్ట్ర పదాధికారులు గూట్లో నుంచి
* జాతీయ పదవులకు, స్థానికముగా బలము
* జనసేన లో, పవనన్న కాకుండా రెండో మనిషి
* పవన్ షెడ్యూల్, దీక్ష, 4 సినిమాలు, 4 స్టేట్మెంట్లు
* ఆటలో అందరూ ఆడితేనే మజా
ఇది ఒక పార్టీ సమస్య కాదు, మన ప్రజలు అందరి సమస్య. మన పార్టీలో, మన ఊళ్ళో కూడా, ఇలాంటి పరిస్తితి ఉందేమో చూడండి. మన జనం కోసం అడిగే, నిబద్దత గలిగిన, నాధుడు ఒకడు కూడా లేడు, అన్నదే ఈ బాధ.

తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల గురించి, మోదీ ఇద్దరు సీయెం ల తో, పరిస్తితి గురించి వాకబు చేసారు, అండగా ఉంటామని హామీ.

హైదరాబాద్ లో వీధి వీధికి, చెరువు కాలువ పధకం, కేసీయార్ మానిఫెస్టోలో లేనప్పటికి, వర్షాలకు విజయ వంతముగా అమలు చేస్తున్నారు, ప్రజల ఆనందము కోసం. కార్లు, బైకులు నీళ్ళ లో తేలుతున్నాయి. పాములు, మొసళ్ళు, చేపలు కూడా ఇళ్ళలో మోకాలు పైన నీళ్ళలో ఉచితముగా దొరుకుతున్నాయి. గంటలు గంటలు ట్రాఫిక్ సమస్యలు. దుబ్బాక లో ఎమ్మెల్సీ గా కవిత గెలిచారు బీజేపీ పై, క్వారంటైన్ లో ఉన్నారు.

నిజాయితీ, నిక్కచ్చితనం, నిబద్ధత అనే నియమాలతో, 42 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో, నిర్భయంగా ప్రభుత్వ వైఖరుల నిగ్గు తేల్చే నాయకులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి, జన్మదినం సందర్భంగా మనఃపూర్వక శుభాకాంక్షలు.

అలాగే పవన్ గారి దీక్ష విజయవంతగా పూర్తి కావాలని కోరుకుందాం. ఈ జంట క్రుషి ఫలించాలని, వారి 2024 ఆశలు తీరాలని ఆశిద్దాం. కానీ, దానికి కష్టపడి పనిచేయాలి, మరి వారి శ్రమ ఎలా ఉందో ఉదాహరణ తో చూద్దాము.

గతములో, కన్నా తో ఉన్నా అనిపించినా, చంద్రన్న నీడలో, పవన్ తోడులో, వికసించని ఆంధ్రా కమలం - అని ఆర్టికల్ రాశాము గుర్తు ఉందా. ఇవి పార్టీల కోసము కాదు, జనం బాగు కోసం. Link

ఆంధ్రా బీజేపీ కి కొత్త నాయకుడు వీరన్న వచ్చారు జులై 2020 లో అంటే, అంతా మారిపోతుంది, పరుగులే పరుగులు, అలజడి మొదలు అవుతుంది, ప్రతి జిల్లా పట్టణ గ్రామ, కార్యకర్తలలో కష్టపడి పని చేయాలి, అన్న కసి పెరుగుతుంది అనుకున్నాము. స్థానికముగా సమస్యలను ప్రస్థావిస్తూ, ధర్నాలు ఫేస్బుక్ పోస్ట్ లు ఉధ్రుతము గా ఉంటుంది అనుకున్నాము, ఎక్కడికక్కడ నాయకులు ఉంటారు కాబట్టి.

రాష్ట్ర స్థాయిలో పర్లేదు, గర్జనలు బాగున్నాయి గతము కన్నా, ఆన్లైన్ లో సందేశాలు బాగున్నాయి. కానీ అన్ని జిల్లాలలో ఆదమరచి గాఢనిద్ర లో ఉన్న, కార్యకర్తలను లేపడము వీరన్న కు కూడా కష్టము గా ఉంది, అని అనిపిస్తుంది. దేవాలయాలకు ఇబ్బంది వస్తే తప్ప, స్థానిక మనుషుల ఇబ్బంది కి, సమస్యలకు మాత్రము కదలరు మెదలరు.

బీజేపీ రాష్ట్ర పదాధికారులను ప్రకటించారు, వారు గూట్లో నుంచి, బయటకు రారు స్థానికముగా. సమస్యలపై పోరాడరు. అలాగే జాతీయ పదవులకు, పేర్లు ప్రకటించారు, వారికి స్థానికముగా బలము లేదు, సొంతము గా గెలవలేరు. వారు స్థానిక సమస్యలపై గొంతు లేపరు, ఎప్పుడో ఒక, కంటి తుడుపు, మాట తప్ప.

జనసేన లో, పవనన్న కాకుండా రెండో మనిషి, కనపడరు వినపడరు. రంగుల సినిమా ప్రపంచములో, సరదాగా విజిల్ వేసే చప్పట్లు కొట్టే బాధ్యత లేని అభిమానులు వేరు, ఒళ్ళు వంచి కష్టపడే బాధ్యత నిబద్దత గల కార్యకర్త వేరు. ఇది ఎప్పుడు పవనన్న గ్రహిస్తారో, చంద్రన్నకు జగనన్నకు మూడో పోటీ గా, ఎప్పుడు తనను తాను మలచుకుంటారో, ఆయన నిర్మాతలకు తప్ప, సామాన్య ఓటరు జనానికి తెలీదు.

మన పవన్ అన్న ప్రస్తుత షెడ్యూల్, చాతుర్మాస దీక్ష, ఆ తర్వాత 4 సినిమాలు, ఈ మధ్యలో 4 స్టేట్మెంట్లు ఫోటోలు వీడియోలు, అంతే. స్థానిక సమస్యలపై రోజూ పోరాటాలు బహుశా ఉండవేమో ఎప్పటిలాగనే.

బీజేపీ నాయకుల నంబర్లు 4 పట్టుకోగలిగినా, జనసేన ప్రధాన నాయకుల నంబర్లు, అంతరిక్షములో తప్ప ఎక్కడా కనపడవు. అసలు ఎవరు ప్రధాన నాయకులో కూడా, తెలీదు. బీజేపీ అంటే, ఒక జీవీయెల్, కన్నా, విష్ణు రాజు, ఇలా కొంత మంది ఎప్పుడు వార్తలలో ఉంటారు.

కానీ జనసేన లో కనపడరు. ఇక స్థానికముగా ఎలా ఉంటుందో, ఊహించుకోవచ్చు. ఇద్దరి కలయికను సరిగ్గ వాడుకోలేక పోతున్నారు, అని అభిమానుల ఆవేదన. బీజేపీ కి వ్యవస్థ ఉంది, పవన్ కి మాస్ అభిమానులు ఉన్నారు, కానీ ఒక్క అడుగు ముందుకు పోవడము లేదు, ఆన్లైన్ పోస్ట్లు ట్వీట్లు తప్ప.

క్రమశిక్షణ ఉన్న పార్టీకి, ఎక్కడైనా ఏ నియోజకవర్గమైనా ఒకటే గదా? ఒక నియోజకవర్గము ఉదాహరణ తీసుకుందాము. చీరాల బీజేపీ కొత్త ఫేస్బుక్ పేజి, అక్టోబర్ 3 న పెట్టారు. 8 వ తేదీ దాకా, ఇతర బీజేపీ నాయకులవి షేర్ చేసారు, సొంత పట్టణం పోస్ట్ లు లేవు. ఆ తర్వాత ఇప్పడు దాకా, ఏమీ లేవు. మరలా నిద్రావస్థ లో కి వెళ్ళారు.

కొత్త పేజీ పెట్టినప్పుడు, చీరాల కార్యవర్గం ఎవరు, ఈ శాఖ అధ్యక్షుడు ఎవరు? పేర్లు నంబర్లు ఫోటోలు ఏవి? ప్రజలు సమస్యలు వస్తే, ఎవరికి ఫోన్ చెయ్యాలి, స్థానికి సమస్యాలపై మాటలు, సూచనలు, విమర్శలు ఏవి? ప్రకాశం జిల్లా బీజేపీ శాఖ కూడా అంతే, 7 వ తేదీ తో పోస్ట్లు ఆపేసారు. BJP Chirala, BJP Prakasam, Janasena Chirala, Prakasam Janasena.

జనసేన చీరాల కూడా అంతే, నాయకులు ఎవరో తెలీదు, స్థానిక సమస్యలు ఎత్తరు. అసలు ఏపేజీ ఇప్పుడు నడుస్తుందో కూడా తెలీదు, సెప్టెంబర్ అక్టోబర్ లో పోస్ట్లు లేవు. ప్రకాశం జిల్లా శాఖ నయ్యం, అక్టోబర్ లో 1 పోస్ట్, సెప్టెంబర్ లో 1 పోస్ట్ తో మమ అనిపించారు.

ఆటలో అందరూ ఆడితేనే మజాగా ఉంటుంది కదా, ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ రెండు పార్టీలు, అలాగే తెదేపా ఇలా నిద్రావస్థ లో ఉండి, ఎలెక్షన్ పోయాక, ఎందుకు ఓడిపోయామో, అర్ధము కావడము లేదు, లోన చర్చించుకుంటాము, అని ఒక స్టేట్మెంట్, ఇంత నిర్లక్ష్యము గా స్థానిక శాఖలు, సరైన నాయకులు లేకుండా ఉన్నాయని, తెలిసి కూడా. హతవిధీ, మోదీ అమిత్షా వస్తే తప్ప ఈ స్ధానిక నాయకులు కదలరు మెదలరు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 796 General Articles, 46 Tatvaalu
Dt : 14-Oct-2020, Upd Dt : 14-Oct-2020, Category : Politics
Views : 82 ( + More Social Media views ), Id : 755 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : bjp , janasena , somu , pavan , online , talk , high , capital , onsite , works , low , sleepy , towns , chirala , prakasam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content