Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం. భారత పైలట్ విక్రమ్ అభినందన్, పాకిస్థాన్ కు పట్టుపడ్డారు. భారత యుద్ధ విమానం మిగ్-21, తమ భూభాగంలో కూలినప్పుడు, పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకిన ఆయనను, అదుపులోకి తీసుకున్నట్టు చెప్పింది. ఈ శుక్రవారం(Mar 1st, 2019) విడుదల చేస్తాము అని చెప్పింది , భారత ప్రభుత్వ అంతర్జాతీయ దౌత్యము వత్తిడితో తట్టుకోలేక, విధిలేక జెనీవా ఒప్పందం ప్రకారం.
అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్ మార్షల్‌గా పనిచేశారు. దేశంపైకి దండెత్తిన శత్రు విమానాలను వెంటాడుతూ దాయాది దేశానికి పట్టుబడ్డ ఆయన చిత్రహింసలు ఎదుర్కొంటున్నారు.
Update March 1st -
పాక్ ఆర్మీ అధికారులు, అభినందన్‌ను భారత కు అప్పగించడం తో , సరిగ్గా 9:15 గంటలకు వింగ్ కమాండర్ అభినందన్ మాతృభూమిలో కాలుమోపాడు.
అతడికి స్వాగతం పలికేందుకు, సరిహద్దు వద్ద వేచి చూస్తున్న వందలాదిమంది, భారత్ మాతాకీ జై అంటూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వాట్సప్ లో తిరుగుతున్నాయి ఈ వాక్యాలు -
కేవలం ₹500 నోటు కు ఓటు తో పాటు అమ్ముడుపోయే మా కోసం మీరు ప్రాణాలే త్యాగంగా పెట్టారు...
బిర్యాని పాకెట్ కి, క్వార్టర్ మందుకే మేము పార్టీలు మారతాం.. మీకెలా అబ్బింది సార్ ఇంత దేశ భక్తి..
కులాలతో, పక్కింటి వారితో, ఐన వారితో కూడా తగువులతో మేము రోడ్ మీద పడుతుంటే, మాకోసం నువ్వు ధైర్యంగా దేశ సరిహద్దు అవతల పోరాడి వారికి చిక్కావు. ఇప్పుడైనా మాకు సిగ్గు రావాలి.
కోట్లకు కోట్లు డబ్బులు ఉన్నా, ఆపదలో ఉన్న సొంత మనుషులకే, ఏ మాత్రం సహయం చెయ్యని, మాకు లేని ఆత్మాభిమానం దేశాభిమానం మీ సొంతం ....
నేను నా కుటుంబం చల్లగా ఉంటే చాలు, పక్క వాళ్ళు ఏమైపోయినా, అనుకునే మా స్వార్థపు మనుషుల వలే కాకుండా....మీ కుటుంబం గురుంచి ఆలోచించకుండా, దేశమే నా ప్రాణం అనే మీరు ఎంతో ఉన్నతం ..
శత్రువుల చేతికి చిక్కినా మొక్కవోని నిబ్బరంతో, మీరు చెబుతున్న జవాబులు, మా స్వార్థపూరిత శవ జీవితాల్ని ప్రశ్నిస్తున్నాయి...రూపాయి కోసం ఎన్నో మాటలు మార్చే మాకు సిగ్గు తెస్తున్నాయి
ప్రభుత్వాలు మాకెమిచ్చాయని నిత్యం ప్రశ్నించే, మా బతుకుల పరమార్థాన్ని, మీ మనోనిబ్బరం, మమ్మల్ని దోషిగా నిలబెడుతోంది..
ఏ కాంట్రాక్ట్ లో ఎంత మింగచ్చో అని నిత్యం ఆలోచించే మా రాజకీయ జీవితాలు, మీ అనితర త్యాగం ముందు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి, తల వంచుతున్నాయి!
జయహో వీరుడా..జయహో శత్రుగడ్డపై, మీ ఉనికి, మాకు కర్తవ్యం నూరిపోస్తోంది...
మిమ్ము రక్షించుకోలేకపోతే మా జీవితాలు, వృథాగా తోస్తున్నాయి...
మరుజన్మ అంటూ ఉంటే మీలాంటి జవానుగా భరతమాత ముద్దు బిడ్డగా జన్మించాలనుంది!
శత్రుమూకలను చీల్చిచెండాడాలనుంది!!!
మేరా భారత్ మహాన్.. వందేమాతరం.. జైహింద్.. భారత్ మాత కు జై...తల్లి భారతి నీకు వందనం
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1121 General Articles, 47 Tatvaalu Dt : 28-Feb-2019, Upd Dt : 12-Apr-2019, Category : News
Views : 601
( + More Social Media views ), Id : 53 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
vikram abhinandan ,
Indian Pilot అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments