సత్యాన్ని నమ్మితే, మంచి మాట లెక్క చేయకుండా, ప్రపంచములో ఫోన్ ఆపుకుని ఎక్కడికి పోగలవు, అంతటా నానుంచి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,259; 104 తత్వాలు (Tatvaalu) and views 225,902.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సత్యాన్ని నమ్మితే, మంచి మాట లెక్క చేయకుండా, ఈ ప్రపంచములో ఎక్కడికి పారిపోగలవు ఫోన్ ఆపుకుని, అంతటా ఉన్న నా నుంచి?

If we agree a mistake heartfully, how much happy our heart will feel? We need dare for that. if we disagree our mistake then it will be burning coil to everyone including our family and will destroy, but more damage for our heart. No use for anyone. Friend, do you agree?

మన ఒక తప్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, మన హృదయం ఆత్మ ఎంత ఆనందాన్ని పొందుతుంది? దానికి ధైర్యం కావాలి. మన తప్పును మనం అంగీకరించకపోతే, అది అందరికీ అంటే మన కుటుంబ సభ్యుల తో కలిపి, అగ్ని లా మండుతుంది నాశనం చేస్తుంది చిన్నగా, కానీ మన హృదయానికే ఎక్కువ నష్టం. ఎవరికీ ఉపయోగం లేదు. అంతేనా మిత్రమా?

అందరమూ తప్పులు చేస్తాం, తప్పు ను చేయనివాడు మనిషి కాదు.

కానీ తప్పులు ధైర్యంగా ఒప్పుకుని, సరిచేసుకోలేకపోవడం మాత్రం క్షమించరాని నేరం, మరలా మరలా అదే తప్పు చేయడం దైవ ద్రోహం.

అది ఒప్పు అని, నీ(మీ)కు మనస్సాక్షి అనేది ఉండి, నిజముగా అనుకున్నప్పుడు, నీ కుటుంబమునకు నీ బంధువులకు నీ పిల్లలకు అయినా నువ్వు అది మంచి పని అని చెప్పగలిగినప్పుడు, ధైర్యంగా అందరి ముందు చెయ్యి, అదే అందరికీ చెప్పు, కనీసం అహంకార రాక్షస ప్రవ్రుత్తి గల, దుర్యోధనుడు మరియు రావణుడు లా తక్కువ శిక్షతో మిగులు.

నువ్వు నేల మీద అడుక్కునే వాడివి అయినా కూడా, నిన్ను మనస్పూర్తిగా గౌరవిస్తా, తలవంచి నమస్కరిస్తా. ఎందుకంటే, నటించే వారికన్నా, ఉన్నది ఉన్నట్టు గా తప్పు అయినా ఒప్పు అయినా దాచకుండా చెప్పే, మంచి మనస్సు నీకు ఉంది, 2 నాల్కలు లేవు, 2 అపరిచితులు లేరు.

ఆత్మ ద్రోహం చేసుకుంటూ, రాక్షస ప్రవ్రుత్తి కంటే నీచుడుగా నటించవద్దు, ఎందుకంటే అది నీ (మీ) వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుంది.

అందరం ఆత్మ స్వరూపులం దైవ బిడ్డలము అని నమ్మితే, మన శరీరం పంచభూతాల నిర్మితం, ఒట్టి చేతులతో మట్టిలో నుంచి వచ్చి ఒట్టి చేతులతో మట్టి లో కలుస్తాం అన్న సత్యాన్ని అయినా, నువ్వు మీ వంశం నమ్మితే, మంచి మాట లెక్క చేయకుండా ఈ ప్రపంచములో ఎక్కడికి పారిపోగలవు ఫోన్ ఆపుకుని, నా నుంచి?

అణుక్షణం నీ లో ఉండే నిన్ను వేధించే ఆత్మ అనే నన్ను ధ్యానం లో ఎప్పుడైనా పలకరించావా? కళ్ళు మూసుకుని అరగంట నాతో మాట్లాడే ధైర్యం నీకు ఉందా?

ఆ ధైర్యం నీకు లేదు, నువ్వు కళ్ళు మూసుకుంటే, నీ అబద్దాలు మోసాలు తప్పులు అన్ని నీ ముందు గిర్రున సినిమా రీల్ లాగా తిరుగుతుంది.

అలాగే నిరంతరం బయట వెంట ఉండే కాపలా కాసే పంచభూతాలు నుంచి తప్పించుకోలేవు సుమా.

ఎందుకంటే, సాధనతో ఆత్మ జ్ఞానం కలిగితే, నువ్వు నేను వేరు కాదు, అత్మ గా ఇద్దరము ఒక్కటే, ఆత్మబంధువులమే.

ఆడ మగ అనేది కూడా భౌతిక తేడా మాత్రమే, కాని ఆత్మ అనేది ఆధ్యాత్మిక ఏకత్వం. కఠిన సాధన ధ్యానము లో పరమాత్మ తో ఏకం అవుతుంది.

వచ్చే జన్మలో, మన బతుకు ఆడో మగో బీదో ధనికో కూడా మనకు తెలీదు, కానీ మన ఇన్నాళ్ళ ఖర్మ మన చావుకు ముందు తెలుపుతుంది తప్పకుండా, అపస్మారకము లో ఉన్నప్పుడు.

రోజు నాలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా, వినకుండా పారిపోయినా, అప్పుడు నువ్వు కదలలేవు, మెదలలేవు. ఒకవైపు నీ పిల్లల ఎత్తి పొడుపులు, విమర్శలు, చీత్కారాలు. ఇంకోవైపు మనసు బాధ, చచ్చినట్లు వింటావు, ఆ నరకయాతన భరించలేక కన్నీరు మున్నీరు గా ఏడుస్తావు, ఎంత కాలం వ్రుధా చేసాను అనవసర విషయాలకు అని.

కానీ అప్పుడు ఇక ఎవ్వరమూ మార్చలేము, ఎందుకంటే, తర్వాత జన్మ స్థానం, ఆల్రెడీ సిద్దం చేయబడింది, నీ సొంత అహంకార నటనల కర్మల ఫలితాల కోరిక మేరకు.

దేవుడు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని, కాల రాశావు నీ చేతులతో నువ్వే. అందుకే నీ కర్మకు నువ్వు బాధ్యత వహించాలి, నీ హోదా ఆస్తి అధికారం, అక్కడ గడ్డి పరక సుమా.

కాబట్టి ఆత్మ నమ్మే, నిజము సత్యము, కూడా ఎప్పుడూ ఒక్కటే. కాబట్టి నిజము నుంచి తప్పించుకోలేవు, అంతరిక్షములో ఇంకో గ్రహం లో ఉన్నా కూడా. ఎందుకంటే ఆకాశం కూడా ఒక పంచభూతమే.

వాస్తవం నిజం సత్యం నువ్వు నేను ఆత్మ ఒక్కటే, వేరు వేరు కాదు, అది వేరుగా చూపించేది, మాయ లో ఉంచే మరియు ముంచే, మన అరిషడ్వర్గాలు.

అందుకే మాయలో నువ్వు ఉన్నావు, మాయ బయట నీకోసం నేను మరియు దేవుడు ఉన్నాము. చాయిస్ నీదే.

if you believe truth, without listening good word, where in this world can you run away with stopped phone from me all over.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,259; 104 తత్వాలు (Tatvaalu) and views 225,902
Dt : 21-Apr-2022, Upd Dt : 21-Apr-2022, Category : General
Views : 505 ( + More Social Media views ), Id : 1360 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : believe , truth , listening , good , word , world , run , away , stopped , phone , me , universe , allover
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content