Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 నిమిష చదువు సమయం.
చాలా మంది పెద్దలు, తమ పిల్లలు బాగా చదవాలి అని సంస్కారవంతులు కావాలని అనుకుంటారు. దానికోసము చాల కష్టపడి సంపాదించి, మంచి స్కూల్, కాలేజ్ లో చదివిస్తారు. కాని చదువు సంపాదన కీర్తి వేరు, సంస్కారము బాధ్యత ప్రేమ వేరు.
కొంతమంది ఎంత ఖర్చు పెట్టినా, పిల్లలు చదువులో ముందుకు పోలేరు. తర్వాత పెద్దల వ్యాపారాన్ని లేదా ఆస్తిని హరతి కర్పూరం చేస్తారు. సరే మనము సంస్కారము, బాధ్యత గురించి మాట్లాడుకుందాము. కొన్ని చిన్న ఉదాహరణలు చూద్దాము, మన ఇళ్ళలో.
1. పెద్దలు ఉదయము 8 గంటలకు లెగుస్తున్నారు. పిల్లలను ఉదయం 5 కి లెగవమంటే లెగుస్తారా? ఇప్పుడు భయంతో లెగిచినా, 15 ఏళ్ళ తర్వాత లెగుస్తాడా?
2. పెద్దలు చెడు అలవాట్లులో(మందు, ముక్క, ధూమపానం, మత్తుమందు, జూదం) మునిగి తెలుతున్నారు. మరి పిల్లల మనసులో అది ముద్ర పడి, తర్వాత వారు అదే పని దొంగ చాటుగా మొదలు పెట్టరా? ఈ రోజులలో దూరంగా పెట్టి చదివిస్తున్నారు, లేదా ముసలి తల్లి దండ్రుల దగ్గర వదిలేస్తున్నారు. ప్రతి క్షణం దగ్గర ఉండి, మనము గమనించ గలమా మంచిగానే ఉన్నారు అని?
3. పక్కింట్లో కి చెత్త చిమ్మడము, చెత్త వేయడం, పక్క వారి వస్తువులు వాడడం పెద్దలు చేస్తుంటే, పిల్లలు అవి బాగున్నాయి మంచి పద్ధతులు అని పాటించరా. పక్క పిల్లలను అయినా వేధించడం మొదలు పెడితే సర్ధుబాటు తనం లేక, ఎదిగిన తర్వాత వారి పరిస్తితి ఏమిటి?
4. తల్లి నాకు వంటరాదు అని పని మనిషితోనో లేదా భర్త తోనో చేపిస్తే, రేపు కూతురు వంట చేస్తుందా? పక్క వారిని తిట్టడం, చుట్టాలను అరవడం అగౌరవ పరచడం చేస్తుంటే? ఓర్పు, సహనం, తన మన, పెద్ద చిన్న, అలవాటు అవుతాయా? రేపు భర్తను, తన కుటుంబాన్ని పది మంది లో తూర్పారబట్టదా?
5. మనము ముసలి తల్లి దండ్రులను వదిలి దూరంగా ఉండి, మనకు 60 యేళ్ళు వచ్చాకో లేక రోగం తో మంచము ఎక్కిన తర్వాత, మన పిల్లలు మనల్ని వదిలేసారు అని ఏడిస్తే ప్రయోజనం? మన పిల్లలకు నేర్పినది మనమే గదా, డబ్బు ముఖ్యం అన్నిటికన్నా అని?
6. పెద్దలు, దొంగ పద్దతిలో సంపాదించడము, మోసముతో వేరే వారి ఆస్తి కొట్టేయడము, నీతి నియమాలు లేకుండా ఉండటము, దురాశ, కోపము, కక్షలు, . . . ఇవి అన్ని పిల్లలు ఉచితముగా, తమ పెద్దల దగ్గరే నేర్చుకుంటారు.
మరలా మనమే, అబ్బే రోజులు పాడయ్యాయి అండి, బయట సినిమాలు మంచివి కాదు, బయట పిల్లలు మంచివాళ్ళు కారు అంటాము. ముందు మన బంగారాలను చెడ్డవాళ్ళు గా లేదా చెడుకు దూరంగా ఉండేవాళ్ళు గా పెంచలేని అసమర్ధులము అని ఒప్పుకోలేము.
లోకం చెడ్డది అంటాము. మనలాంటి భాధ్యత లేని తల్లిదండ్రులే కదా అన్ని చోట్ల ఉన్నది, అబ్బే మన తప్పు ఒప్పుకోము. జనరేషన్ గాప్ అంటాము తప్పించుకోవడానికి.
ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విషయాలు వస్తాయి, ఇవి అందరికి తెలిసినవే. మరి పెద్దల మరియు చిన్న వాళ్ళ వాదనలు చూడండి:
పెద్దల వాదన - డబ్బు ఇచ్చాం, మంచి బడికి పంపాం, పంతులు ను పెట్టాం, మంచి విద్యను, ఆస్తి ని ఇచ్చాం. చాలదా, అవి లేని వారు ఎంతో మంది ఉన్నారు. మేమెందు సంస్కారంగా, బాధ్యత గా ఉండాలి. మాకు లేకపోయినా, మన పిల్లలు బుద్ది గా ఉండాలి. అది పిల్లల బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు కోసం అంటాము.
పిల్లల వాదన - మీరు ఆడమన్నట్లు గా ఆడాము, చదవమన్నవి చదివాము. కానీ మీకే లేని మరియు మీకే కష్టం అయిన సంస్కారం బాధ్యత, మాకెందుకు వస్తుంది. కింద నుండి ఎదిగిన లేదా తాతల ఆస్తి తో ఎదిగిన, మీకు రాని లేదా లేని సంస్కారం, ఆస్తి లేదా అన్ని ఉన్న మాకేల వస్తుంది. అలా రావాలి అనుకోవడం, అన్యాయం మరియు అసాధ్యము. మీకు 2 చెడు అలవాట్లు ఉంటే, మాకు 8 చెడు అలవాట్లు ఉంటాయి, ఇది నేటి కాలధర్మం. మీకు 10 మంచి అలవాట్లు ఉంటే, మాకు కనీసం 5 అలవాటు అవుతాయి.
తల్లి గేదె(బర్రె) పొలం లో మేస్తుంటే, పిల్ల (దూడ) ను గట్టు న మేయమనడం అన్యాయం కదూ. అంటే గట్టున మేస్తే రైతుకి ఇబ్బంది లేదు, కానీ పొలం లో మేస్తే పంట నష్టము. మొత్తుకొని చెప్పినా వినదు, అది తల్లి నే అనుసరిస్తుంది. అంతే కదూ?
పెద్దలకు రామాయణ భారతాలు తెలీవు, పిల్లలకు నేర్పరు, బడిలో నేర్చుకున్నా వాటిని పిల్లలు ఆచరించరు. సంస్కారము బాధ్యత లేకుండా, ఐఐటీ లో చదివి, లక్షలు సంపాదించినా పెద్దలకు ఎటువంటి ఉపయోగము లేదు. ఎందుకంటే, కన్న తల్లి కింద పడి, మంచములో ఉంది అని చెపితే, వచ్చే సంవత్సరం వస్తా అంటాడు.
ఎందుకంటే తనకు డబ్బు, చదువు తప్ప, ప్రేమ బాధ్యత మనము నేర్పలేదు. పోనీలే అని తమ పెద్దలు గమ్ముగా ఉన్నా, భార్యతో కూడా అలాగే ఉంటాడు. తర్వాత తగువులు, తన్నులాటలు, ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఇంక వారి పిల్లల పెంపకం, గోవిందా గోవిందా. ఇంటి పెద్ద అంటే ఒకరు కాదు, తల్లి తండ్రి ఇద్దరు కూడా సంస్కారం, ప్రేమ, బాధ్యతగా ఉండాలి.
గురువు చాగంటి గారి మాటలు పండిత భాషలో చూడండి చిత్రములో. సంస్కారము ఎప్పుడూ పెద్దల నుంచే రావాలి. లేకపోతే, అది కరెక్టే అని పిల్లలు దానిని అనుసరిస్తారు. పరానుకరణము - అంటే తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 966 General Articles, 46 Tatvaalu
Dt : 28-Aug-2019, Upd Dt : 28-Aug-2019, Category : General
Views : 916
( + More Social Media views ), Id : 156
, State : AP/ Telangana (Telugu)
, Country : India
Tags :
elders behavior ,
kids behavior ,
chaganti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments