బాలినేని, చంద్రబాబు, జగన్ గారు, చీరాల ఎమ్మెల్యే కరణం గారిని ఊళ్ళో ఉండమని చెప్పలేరా? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,045; 104 తత్వాలు (Tatvaalu) and views 225,016.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

చీరాల అస్సెంబ్లీ టికెట్ ఇచ్చింది చంద్రబాబు గారు, ఈ మిగతా 4 ఏళ్ళు అయినా చీరాల లో ఉండాలి అని బహిరంగంగా చెప్పండి, వింటారా లేదా అనేది తర్వాత మాట. ఇంకా మన పార్టీ గుర్తు పైనే ఉన్నారు కదా అఫీషియల్ గా. మీరు గమ్ముగా ఉంటే, 23 మందిని కూడా అదుపులో పెట్టుకోలేరా, కనీసము నోటీసులు జారీ చేయలేరా అని తప్పుగా ప్రజలు భావిస్తారు. అద్దంకి నుంచి చీరాల మీద రుద్ది, ఇప్పుడు మన పార్టీ గమ్ముగా దూరముగా ఉంటే, మనమే కావాలని పంపినట్లు గా ఉంటుంది కదా ఆలోచన చెయ్యండి అని అభిమానుల ఆవేదన.

చంద్రబాబు గారు, అద్దంకి అబ్బాయి కరణం గారిని, మంచివాడు ధైర్యవంతుడు చలాకీ ఆరోగ్యవంతుడు మీకు ఎల్లవేళలా తోడు ఉంటారు ఎప్పుడూ అన్ని సమస్యలకు అని, చీరాల ప్రజలను మీకున్న 40 ఏళ్ళ అనుభవముతో నమ్మించి, మీరు లోకేష్ గారు ఇతర పార్టీ జిల్లా పెద్దలతో కలిసి, చీరాల తో పెళ్ళి చేసారు. గత సంవత్సరముగా, చీరాలకు నెలకు కొన్ని రోజులు అతిధిగా వస్తూ, నేను తోడుగా ఉంటా కష్టము ఉంటే పిలువు అని చెపుతూ, అధికార పనులలో అప్పుడప్పుడూ కనపడుతూ, ఒంగోలు తో కాపురము చేస్తూ అక్కడే ఉంటున్నారు దూరముగా.

పెళ్ళి చీరాలతో, కాపురము ఒంగోలుతో తప్పు కదా, అని అడిగే నాధుడు చెప్పేవారు లేరు. మిమ్మల్ని పరస్పర అంగీకారముతో విడిచారు అని, అందుకే మీరు గమ్ముగా ఉన్నారు అని, ఆయన తప్పులను జిల్లా లేదా పట్టణ పార్టీ నాయకులు ఎత్తి చూపరు, మౌనము గా ఉంటారు అని అనుకుంటున్నారు.

ఆ తర్వాత, అదే పరాయి చోట కాపురము అబ్బాయిని, జిల్లా మంత్రి వర్యులు బాలినేని గారు జగన్ గారికి బుద్దిమంతుడుగా పరిచయము చేసి, హామీలు ఇచ్చి ఆహ్వానం చేసారు. కాని అబ్బాయి తీరు మాత్రము మారలేదు కదా? చీరాలతో పెళ్ళి, ఒంగోలు తో కాపురము కొనసాగుతూనే ఉంది, ఈ గూటిలో కూడా. జగన్ గారి కి, ఇది తలవంపులు గా ఉండదా. అదే అరాచకాన్ని, మనమూ కొనసాగిస్తామా? బాలినేని గారు, వైసీపీ పార్టీలోకి తెచ్చిన తర్వాత, అది మీ బాధ్యత కాదా?

ఒంగోలు లో మీకు తోడుగా దగ్గర లో పెట్టుకున్నారు, అని ప్రజలు అపోహ పడుతున్నారు. ఆయన చీరాల కు రాకుండా ఆపుతుంది, అడ్డుపతుంది మీరే అని ప్రజలు అనుకుంటే, మన పార్టీ కి చెడ్డ పేరు కాదా? చీరాల ప్రజల మాట ఎటూ వినరు మరలా ఎలెక్షన్ దాకా, ఇప్పుడు కనీసం మీ మాట కూడా వినరా? వారానికి 4 రోజులు కనీసం చీరాల ఇంట్లో ఉండలేరా నటించలేరా? మిగతా 4 సంవత్సరాలు కూడా చీరాల ఎమ్మెల్యే, చీరాలకు అతిధి ఏనా? ఇదేనా ఓటేసి గెలిపించిన ప్రజలకు చూపే మర్యాద?

మీకు గుర్తు ఉందా, గత మే నెలలో ఈ ఆర్టికల్ చదువుకున్నాము, కరోనా సమయంలో కూడా, అతిథిగా వచ్చి వెళ్ళారు అని. పెద్దాయన కరణం గారు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా, ఊళ్ళో నే ఉండి జనం దగ్గరగా ఉండాలి.

గత వారంలో ఒక చీరాల యువకుడి దుర్ఘటన సంఘటన విషయంలో, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వెంటనే వెళ్ళి పరామర్శించారు, వారి బాధ, వేదన, ఆవేదన చవి చూసారు, నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. జాయింట్ కలెక్టర్ గారు, చెక్కు పంపిణీ చేస్తున్న సమయంలో పక్కన ఉన్నారు.

కానీ అక్కడ ప్రజల బాధను లేదా కోపాన్ని చవి చూసి, ఓదార్చడం, ప్రస్తుత ఎమ్మెల్యే గారు కదా చేయాలి. కానీ ఆయన ఊర్లో లేరు, ఇక్కడ ఉండరు కదా. అంటే, ఇంకా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే గారే మీకు తోడుగా నీడగా ఉంటారని, స్వయముగా మీరే చెపుతున్నారా, ఒప్పుకుంటున్నారా? పెద్ద వయసు లో ప్రతి విషయం కు చీరాల ఒంగోలు మధ్య తిరగడం కష్టం, కాబట్టి చీరాల లోనే ఉండవచ్చు కదా.

ఎమ్మెల్సీ సునీత గారు పరామర్శించారు, ధైర్యము చెప్పారు, ఓదారచారు. యువ నాయకుడు కరణం వెంకటేష్, ఏదో పెళ్ళికి వచ్చి, వీరిని కూడా పరామర్శించారు.

ఇంతకు ముందే అనుకున్నాం ఆమంచి స్వాములు గారు పర్యటిస్తే, కృష్ణ మోహన్ గారు వచ్చినట్టు కాదు. అంటే అన్న వస్తే, తమ్ముడు వచ్చినట్టు కాదు. అలాగే కొడుకు వస్తే, ఎమ్మెల్యే అయిన తండ్రి వచ్చినట్టు కాదు. బంధువులు దగ్గర సరిపోతుంది కానీ, పదవి హోదా తో ప్రజల దగ్గర సరిపోదు కదా.

ఎమ్మెల్యే గారు తప్పక ఉండాలి. లేదా ఆయన ఆరోగ్య కారణం రీత్యా లేదా తెదేపా కి పులిలా ధైర్యముగా రాజీనామా చేస్తున్నా అంటే, బాలినేని గారు, యువనాయకులు వారి అబ్బాయి కరణం వెంకటేష్ గారికి వైసీపీ టిక్కెట్ ఇప్పించి, అఖండ మెజారిటీ తో గెలిపిస్తారు. వెంకటేష్ గారు చీరాలలో ఉంటూ, తండ్రి గారి పేరు చీరాల పేరు నిలబెట్టవచ్చు. ఊళ్ళో ఉండరు అంటే పెళ్ళి ఒకచోట కాపురము ఒకచోట, అని అపవాదు ఉండదు కదా.

లేదా పెద్దాయన కరణం గారికి మంత్రి పదవి ఇస్తే, ఇక ఊళ్ళో ఉన్నారా లేదా అని ఎవరూ పట్టించుకోరు, ఎందుకంటే జగన్ గారికి సెక్రటేరియట్ లో దగ్గరగా ఉండాలి కాబట్టి. పెద్దాయనకు మంచి గౌరవం దక్కింది అని శ్రేయోభిలాషులము మేమూ సంతోష పడతాము.

దయచేసి బాలినేని గారు, చంద్రబాబు గారు, చీరాల నియోజకవర్గ ప్రజల మీద జాలి చూపించి, బాధ్యత గుర్తు చేసి, త్వరలోనే చీరాలకు 4 రోజుల కరణం గారి అమూల్యమైన సమయం ను కేటాయించ ప్రార్ధన. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,045; 104 తత్వాలు (Tatvaalu) and views 225,016
Dt : 26-Jul-2020, Upd Dt : 26-Jul-2020, Category : Request
Views : 855 ( + More Social Media views ), Id : 614 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : balineni , chandrababu , jagan , chirala , mla , karanam , stay in constitute
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content