APLatestNews.com top Banner

Social Media links
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ కి బెయిలు, మన రాష్ట్ర జిల్లా మీడియా పరిస్తితి - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

మహారాష్ట్ర ప్రభుత్వం, మూసేసిన ఆత్మహత్య కేసు తెరచి, కేవలం ప్రేరేపించారు అని ఉన్నందుకు, కావాలని అవమానకరంగా, రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ ని అరెస్ట్ చేసి, ఢిల్లీ నుంచి ముంబై తీసుకుని వెళ్ళింది అని, మీకు తెలుసుకదా.

ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా వ్యక్తి లేదా సంస్థ మీద, కక్ష సాధించడం భారతం లో కొత్త కాదు, చివర కాదు, పదవీ వ్యామోహం లో.

మన రాష్ట్రంలో లో కూడా గతంలో చంద్రన్న సాక్షి మీద, ఇప్పుడు జగనన్న పచ్చ పత్రికలలో వచ్చే, తప్పులు ఒప్పులు ఖండించడం చూస్తున్నాము. తెలంగాణాలో కేసీయార్ మరీ ఘోరం, అంతా తమ గుప్పెట్లోనే.

మన చిట్టి ఆరోపణలే తీసుకోండి, మీరు మీ ప్రభుత్వం మీ వారసులు, దైవ అనుగ్రహం తో, రాజకీయ అందలం ఎక్కడానికే, ఇవి ఉపయోగం, మంచి మనసు పెట్టి ఆలోచన చేస్తే.

మీకు ఇవి పంపడం వలన మాకేమైనా లాభం ఉందా? మా వెబ్సైట్ లో ఒక ప్రకటన కూడా లేదు కదా. మరి దేనికి ఇవి అన్ని? మనం మన ఇల్లు మన సమాజం ఎప్పటికైనా మారుతుందేమో, అని ఓ చిరు ఆశ.

బాధ్యత గలిగిన ప్రభుత్వ మంత్రి లేదా అధికారి, ఇది అబద్ధం అని రుజువు ఇస్తే, మనం క్షమాపణ తో రాయాలి. అంతే గానీ, కోప తాపాలు పెట్టుకోకుండా ఉండాలి.

ఉదాహరణకు

1* ఒంగోలు మంత్రి గారు, ప్రజలకు బంధువులకు వడ్డీ అసలు ఎగకొట్టి న ఆయన పుత్రునకు, ఎదో తీసుకొని కార్పోరేషన్ సీటు ఇచ్చి, నగరం ఇంకా దోచుకోమన్నారు అని వార్త. ఆయన ఏమి చెయ్యాలి, గుర్తు లేకపోతే వివరాలు అడగాలి. లేదా అనుచరుడు తో అందరికీ ధనం వెనక్కు ఇచ్చి, సెటిల్ చేసుకుని రా, అప్పుడే మరలా ఎన్నికల సీటు కు అని చెప్పాలి. అంతే గానీ, విలేఖరి మీద అలగకూడదు కదా.

2* ప్రజా పన్నుల ధనం తో, పధకాలకు నాయకులు పేర్లు కక్కుర్తి అని వార్త, అది లేదు అని నిరూపించాలి. లేదా ముందు వారు అదే చేసారు అని, గమ్ముగా తమ పని లో తాము ఉండాలి, ఫీల్ కాకుండా. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముందు వాళ్ళ ను, మూలన కూర్చో పెట్టిన విధంగా, మనల్ని పెడతారు సుమా.

3* చీరాల (మిగతా అసెంబ్లీ లేదా పార్లమెంటు నిద్రమత్తు నాయకులు అంతే) లేదా బాపట్ల పార్లమెంటు టీడీపీ, బీజేపీ, జనసేన, బాబూ మీరు ప్రచారం లోకి రాండి, పేరు తెచ్చుకోండి ఫేస్బుక్ వాడి అంటే, అలిగి ఫేస్బుక్ టాగ్ లు ఆపుతున్నారు, అధికారంలో లేనప్పుడే. ఇవి రాష్ట్ర నాయకులు కు వెళుతున్నాయి అని తెలిసీ కూడా. నేను లెగవను, నన్ను నిద్ర లేపవద్దు అంటే, ఇదే కదా. మేము గట్టిగా నిబద్దత గా ఉంటే, మా జిల్లా రాష్ట్ర నాయకులు కు పోటీ అవుతామని, నిద్ర మత్తులో ఉండే వారినే, స్థానిక నాయకులు గా పెడతారు అని గమ్ముగా ఉండవచ్చు.

ఇలాంటి వి ఎన్నో ఉదాహరణలు.

ముందు హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు, ఇలా ఎంతమంది సుప్రీం కు వెళ్ళగలరు, మీరు చెప్పండి? అంతకుముందు అర్నాబ్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, బెయిల్ ఇస్తూ, సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వాలు వ్యక్తుల భావజాలం, భిన్నాభిప్రాయాలు తెలిపిన వారిని, లక్ష్యంగా చేసుకుంటున్నాయని అభిప్రాయపడింది.

అటువంటి వారి స్వేచ్ఛకు, అత్యున్నత న్యాయస్థానం, రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.

భారత ప్రజాస్వామ్యం గొప్ప భావాలను కలిగి ఉందని, తన చానల్‌లో అర్ణాబ్‌ భావజాలం ఎలా ఉన్నప్పటికీ, మహారాష్ర్ట ప్రభుత్వం, దాన్ని విస్మరించాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఇలాంటి సందర్భంలో, అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోకపోతే, వినాశన మార్గంలో పయనించినట్లు అవుతుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.

భారత్ మాతాకి జై, వందేమాతరం, అంటూ నినాదాలు చేస్తూ జైలు నుంచి బయటకు వచ్చిన అర్ణబ్ గోస్వామి. జైలు బయట దీపావళి జరుపుకున్న జాతీయవాదులు. జైలు నుంచి నేరుగా రిపబ్లిక్ స్టూడియోకి చేరుకున్న అర్ణబ్. రానున్న 17 నెలల్లో రిపబ్లిక్ ఛానల్ ను, గ్లోబల్_నెటవర్క్ చేసి తీరుతానని ప్రతిఘ్న చేసిన ఆర్నబ్. తెలుగు లో కూడా.

2 వీడియో లు చూడండి.

స్వార్థ పరులు, దొంగలు రౌడీలు, అవకాశవాదులు, అవినీతి పరులూ దర్జాగా హాయిగా, ప్రభుత్వ ధనం ఆస్తులు దోచి , వాటినే పంచి ,తమ లాంటి అవినీతి అక్రమ వారసులు వేసిన ఓట్లు తో గెలిచి, ప్రజలను వారి బాధలను లెక్క చేయక, బయట హయిగా తిరుగుతూ ఉంటే,

ఇతర రాష్ట్రాలకు పోయి కరోనా లేదా ఇతర చికిత్సలు కు పోతుంటే, మరియు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంటే,

మంచి వారు, నోరు ముక్కు మూసుకుని, గమ్ముగా కూర్చుని గోళ్లు గిల్లుకుంటూ టీవీ చూస్తూ, ఊళ్ళో దిక్కు మాలిన ఆసుపత్రిలో నే పుడుతూ ఛస్తూ ,

కనీసం గొంతు లెగవని మనకన్నా, సమస్యలు అభివృద్ధి గురించి ప్రశ్నించే ఇంకొకరి మాటలు అన్నా, ఇతరులకు పంపాలన్న ఇంగితం కూడా లేకుండా , స్వార్థం తో భయపడి ఛస్తుంటే దాంకుంటే , ఏనాటికైనా తప్పు మనది మాత్రమే, నాయకులు ది కాదు, మిత్రులారా.

మనం నోరెత్తం , నోరెత్తే వారిని నోరు మూయిస్తాం , ఇతరులకు చేరకుండా ఆపుతాం. ఇంక మనకు భవిష్యత్తు ఎక్కడ ఉంది? తలరాత ఎప్పుడు మారుతుంది?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 855 General Articles, 46 Tatvaalu
Dt : 11-Nov-2020, Upd Dt : 11-Nov-2020, Category : Politics
Views : 98 ( + More Social Media views ), Id : 804 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : bail , republic , tv chief , arnab goswami , telangana , andhra , state , district , media situation
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content