బడి పంతులు - భారత మాతకు జేజేలు, మీ నగుమోము నాకనులారా, ఎడబాటెరుగని పుణ్యదంపతుల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,167; 104 తత్వాలు (Tatvaalu) and views 225,125.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సొంత కన్నబిడ్డల కన్నా, సాయం పొందిన బైట వారే, మానవత్వంతో కనికరం గా వ్యవహరిస్తారని, ప్రేమతో పలకరిస్తారని, క్రుతజ్ఞతలతో సహాయం చేస్తారని, తెలియజేస్తుంది ఈ అద్భుతమైన చిత్రకథ.

తమ అమ్మ నాన్నలను, బిడ్డలు, ఆస్తులు పంచుకున్న విధముగా, ఒక్కొక్కరును పంచుకుని, చెరొక చోటకు విడదీసి తీసుకుని వెళ్ళి, పెట్టిన హింసలు అవమానాలు చూసి, ఎన్నోసార్లు మనము కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాము.

వృద్ధుల సమస్యల పై, ఎన్నో మలుపులు సంఘటనలతో రూపు దిద్దిన, ఈ బడిపంతులు ఎప్పటికీ అందరూ చూడదగ్గ సినిమా.

మీకు తెలుసా, కొంత మంది పెద్దవారు, ఇలా పంపితే మాకు మనశ్శాంతి గా ఉంది, మా పిల్లలు చదవకపోయినా, మీ పాట గొంతు అయినా వినిపిస్తాము, మేము చెప్పలేని మాటలు, మీరు సూటిగా గుండెల్లో గుచ్చుకునే విధం గా రాసినవి చదివి వినిపిస్తాము అంటూ, కొంత మంది పంపిన పాటల ఆధారం గానే, మీరు చూస్తున్న కొన్ని కధనాలు.

వారి వ్యక్తి గత కధలు బాధలు వింటుంటే గుండే తరుక్కు పోతుంది, ఏమీ చేయలేము. కనీసం మాటలు పాట్లు అయినా పంచుకుందాము, ఏమంటారు?

మీ దగ్గర లో కూడా, ఎవరైనా వ్రుద్దులు, తమ పిల్లలతో ఇబ్బందులు పడుతూ ఉంటే, మీరూ కధ లాగా తెలుగు లో రాసి పంపితే, మేము తప్పులు సరి చేసి, ప్రచురిస్తాము. కనీసం పిల్లలలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేద్దాం, ఆపైన దేవుని దయ. ఏమంటారు సాత్విక మిత్రులారా గురువు లారా?

ఇంక పాటలు చూడండి, భారత మాత గురించి ఎంత బాగా వివరించారో ఆనాడు. ఈనాడు అంత మంచి పాటలు రావడం లేదు.

ఇక మీ నగుమోము అనే పాట, మన అమ్మ అమ్మమ్మ పిన్ని అత్త, పాడితే వారి పతి దేవుళ్ళతో, ఎలా ఉంటుందో వినండి, చదవండి. ఎంత బాగా పాట రాశారో. ఈ రోజుల్లో అలా అనుకునే దంపతులు ఉన్నారా, చిర్రు బుర్రు లాడుకోకుండా, ఒకరిపై ఒకరు పెత్తనము అధికారం చూపించుకోకుండా?

ఇక మూడవ పాట, ఎడబాటెరుగని పుణ్యదంపతుల, విడదీసిందీ, విధీ నేడు. విధి కాదు, సొంత పిల్లల సంస్కారము అని ముందు అంగీకరించాలి.

1) భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు 2
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు 2 ||భారత మాతకు||

త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి ||భారత మాతకు||

శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన neహ్రూ 2
విప్లవ వీరులు వీర మాతలు 2 విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి .. ||భారత మాతకు||

సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి ||భారత మాతకు||


2. మీ నగుమోము నాకనులారా.., కడదాకా.. కననిండు 2
ఈ సూత్రముతో ఈ కుంకుమతో.., నను కడతేరీ, పోనిండు ||మీ నగుమోము||

ఉపచారాలే చేసితినో, ఎరగక అపచరాలే చేసితినో 2
ఒడుదుడుకులలో తోడైఉంటిని.., మీ అడుగున అడుగై నడిచితిని ||మీ నగుమోము||

రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు అలిసి మీరున్నారు (మనమున్నాము) 2
పండుటాకులము మిగిలితిమి 2 ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి ||మీ నగుమోము||

ఏ నోములు నే నోచితినో, ఈ దేవుని పతిగా పొందితిని 2
ప్రతి జన్మ మీ సన్నిధిలోనా.., ప్రమిదగ వెలిగే వరమడిగితిని ||మీ నగుమోము||


3) ఎడబాటెరుగని పుణ్యదంపతుల, విడదీసిందీ.. విధీనేడు 2
తోడు నీడగా ఉండే వయసున, గూడు విడచి వేరైనారు
గూడు విడచి వేరైనారు ||ఎడబాటెరుగని ||

జంటను వీడిన ఒంటరి బ్రతుకై, జాలిగ కుమిలే..రు 2
ఎదలో దాగిన, మూగ వేదన, ఎవరికి చెప్పేరు..
ఎలా భరించేరు ||ఎడబాటెరుగని ||

ఒకే తనువుగా ఒకే మనువు గా, ఆ దంపతులు జీవించారు 2
ఆస్తి పాస్తి వలే, అన్నదమ్ములు, ఆతలి దండ్రుల పంచారు..
ఆ తలిదండ్రుల పంచారు ||ఎడబాటెరుగని ||

తారాగణం - నందమూరి తారక రామారావు, అంజలీదేవి, బేబి శ్రీదేవి, కొంగర జగ్గయ్య, జి. రామకృష్ణ, రాజబాబు, రమాప్రభ
badi pantulu telugu cinema songs - bharata mataku jejelu mi nagumomu nakanulara Edabaterugani punyadampatula  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,167; 104 తత్వాలు (Tatvaalu) and views 225,125
Dt : 08-Jun-2022, Upd Dt : 08-Jun-2022, Category : Songs
Views : 833 ( + More Social Media views ), Id : 1419 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : badi , pantulu , bharata , mataku , jejelu , nagumomu , nakanulara , edabaterugani , punyadampatula , ntr , anjali , jaggayya , krishnamraju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content