APLatestNews.com top Banner

Social Media links
అత్త, మామయ్య చాలా మంచి వారు, అత్త క్షేమ సమాచారం ఇప్పటి వరకూ లేదు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఇప్పుడే అమ్మను ఆసుపత్రిలో, పాదాలు పరీక్ష చేయించి తెస్తున్న. షుగర్ వచ్చిన వారికి, ఆ పరీక్షలు చేయాలి. ఏ పుండ్లు వచ్చిన, తెగీనా తొందరగా మానదు. పాదానికి కొబ్బరి నూనె రాయాలి ఎప్పుడూ ఈ వయసులో అని చెప్పారు.

చూడండి, పెద్ద అత్త కూడా అమెరికా లో, అమ్మతో పాటుగా హాయిగా, కబుర్లు చెపుతూ ఉండాలి, అన్ని బాగున్నట్టు అయితే. మనకు ఆ భాగ్యం లేదు. కానీ పెద్ద అత్త, పెద మామయ్య చాలా మంచి వారు. మామయ్య ఇప్పుడు లేరు. నన్ను ఎంతో ప్రేమగా చూసారు చూస్తారు.

అందుకే చివర సారి 3 ఏళ్ళు క్రితము, ఒంటరిగా ఉన్న అత్త దగ్గరకు పోయి, పైన ఇల్లు అంతా చూసి బాధపడి, విదేశీ మడిచే చేతి కర్ర ఇచ్చి వచ్చా. దానికి ముందు, వాళ్ళ అబ్బాయితో ఉండి, కారు దిగేటప్పుడు కాలుకు ఏదో అయినది అని, ఆపరేషన్ జరిగి, ఇంటి దగ్గరే నర్సులను పెట్టుకుని, ఒంటరిగా ఉంది చాలా కాలము.

అప్పుడు నాతో అంది ఇంక ఎక్కడ కూ వెళ్ళను, మా ఇల్లు వదలి, మా ఊరు వదలి అని. ఈ ఊరులో మాత్రమే ఉంటాను అని, అప్పుడు అప్పుడు ఫోన్ చేయిరా, నీ మాటలతో కాలక్షేపం అనీ అంది. అలాగే అత్తా, నేను మరచినా, నువ్వు కూడా రింగ్ ఇవ్వు చేస్తాను అన్నా.

పిన్ని కి చెప్పిన, ఈ ఊళ్ళో ఉంటే, నీదే ఆమె బాధ్యత, నీకు పెళ్లి అయినా కూడా. ఎందుకంటే దేవుడు మీకు అందరి కంటే ఐశ్వర్యం, శక్తి , అంగ బలం ఇచ్చారు ఆమె ను చూడటానికి, ఇంట్లో నే పెట్టుకో. ఒంటరిగా వదలి ఏ నష్టం జరిగినా, మీకే ఆ పాపం అని.

ఆమె నాతో ఉండదు నాన్న ఇల్లు వదలి అంది. అలాగే చెపుతారు మన ఇంటి గొడవలు బుద్దులు చూడలేక, అది మనకు అనవసరం. ఆమె కు ఈ ముదుసలి వయసులో ఏది మంచో, మనం బలవంతంగా అయినా చేయాలి చేయించాలి నచ్చచెప్పి బాగా చూసుకుంటూ అని చెప్పాను.

మా అమ్మ కూడా, మా నాన్న ఇల్లు వదలి రానంది మొదట. సర్ది చెప్పి, నచ్చ చెప్పి, కారులో వేసుకుని పోయాను. ఆమె ఒంటరిగా ఉండి పడితే దిక్కు ఎవరు అని.

చిన్నప్పుడు, మనము బడికి వెళ్ళం అంటే అమ్మ ఊరుకుంటుందా? ఊరుకుంటే, మన బతుకు ఏమి అవుతుంది, ఏమి అయిఉండేది? అలాగే మనమూ బాధ్యత గా ఉండాలి అని చెప్పాను. స్వార్థ పరులు, నటించే వారు అమ్మ వినడం లేదు, అని ఒంటరిగా దూరముగా వదులుతారు.

తర్వాత అత్త క్షేమ సమాచారం ఇప్పటి వరకూ లేదు, 2 సంవత్సరాల నుంచి. మరి పిల్లల దగ్గర ఉందో, ఎక్కడన్నా పెట్టారో దేవునికే తెలియాలి.


జవాబు లేదు, చిన్న అత్త , పిన్ని నుంచి. ఆమె క్షేమంగా ఉందా? పిల్లల దగ్గర ఉందా?

విదేశము వెళ్ళినా, వీసా తో 6 నెలల కు మించి, ఉండ నివ్వరు. కొంచెం పొడగింపు 3 నెలలు. మరి ఎక్కడ ఉంది? ఏదో మిస్టరీ ఉంది.

పిన్ని కి నా మీద కోపమున్నా, తల్లి నంబరు మరియు క్షేమ సమాచారం చెపడం లేదు అంటే, అనుమానం వస్తుంది. చెప్పకపోవడం అంటే, నన్ను కాదు, ఆమె కన్న తల్లి ని అవమానించినట్టు. మా అమ్మ గురించి ఎటూ అడగదు, తప్పు లేదు.

కానీ వాళ్ళ అమ్మ గురించి నేను, మా అమ్మ అడిగినప్పుడు అయినా చెప్పాలి. చూసారా, పిన్ని మనసు ఎంత ధన మోహం లో చిక్కి ఉందో, కన్న తల్లి విషయం చెప్పలేనంతగా. ఏ మంచి బిడ్డ అయినా సిగ్గు పడతారా , దాస్తారా తల్లి క్షేమం ను?

ఆమె నాకు మేనత్త, నేనన్నా , మా నాన్న అన్నా అభిమానం. దయచేసి మీకు సమాచారం తెలిసినా చెప్పగలరు. అడిగి నట్టు చెప్పగలరు. నంబరు ఉంటే ఇవ్వగలరు. వాట్సప్ లో చూప గలరు.


మా అమ్మకు కలలో వస్తుంది ఆడబిడ్డ అంట, వదినా నాతో మాట్లాడు ఒకసారి అని అమ్మను అడుగుతుంది అంట, అంటే పెద్ద అత్త, పిన్ని వాళ్ళ అమ్మ.

దయచేసి పెద్దల ఎడల , ముదుసలి వారి ఎడల మీకు గౌరవం, కృతజ్ఞతలు, ప్రేమాభిమానాలు ఉంటే, పెద్ద అత్త నంబరు ఇవ్వగలరు. లేదా వాట్సప్ లో చూపించి మాట్లాడించ గలరు.


రూపాయి రూపాయి నువ్వు ఏమి చేస్తావు అంటే

అన్నదమ్ములు ను విడగొడతాను, అక్క చెల్లెళ్ళు ను విడగొడతా, అబ్బా కొడుకు ల ను విడగొడతా, అమ్మ కూతురు ను విడగొడతా అంది అంట.

ఎగకొడుతున్న డబ్బు మాది. అందులో కూడా, ఛీ దరిద్రం కక్కుర్తి ఏమిటి అంటే, 74 ఏళ్ల ముదుసలి తల్లిది. అంటే కనికరం జాలి దయ మానవత్వం, ఏ కోశాన లేవు అనే కదా.

ధన వ్యామోహం లో ఇంత బండ బారి పోతుందా, వారి మనసు. సొంత తల్లి క్షేమ సమాచారం, చెప్పలేనంత దౌర్భాగ్య స్ధితికి.

మేనత్త క్షేమ సమాచారం చెప్పను అనే హక్కు వారికి లేదు. అంత నీచానికి కూడా దిగుతారు అని నేననుకోను. ఏమిటీ వైపరీత్యం? ఎందుకు ఈ దాపరికం?

మనమూ 60 కి వచ్చాము, మనమూ ఒంటరిగా ఉంటే, నలుగురు చుట్టాలు తో మాట్లాడుతూ నవ్వుతూ ఉండాలి అని ఉండదా. మన తల్లి కి ద్రోహం చేస్తే , రేపు మన పరిస్ధితి ఏమిటి? మన బిడ్డలు మన మీద కనికరం తో ఉంటారా?


అయ్యా , మీకైనా నమస్కారం చేసి అడుగుతున్నా , మా పెద్ద అత్త , రాజధాని నగరం రెండవ లైను లో ఉండే అత్త బంగారు తల్లి, ఎవరినీ ఒక మాట అనదు. దేవుని నమ్ముకుంది , దేవుడు అన్యాయం చేయడు.

మా మామయ్య ధర్మాత్ముడు ధర్మరాజు , లేటు రావు గారు, ఇప్పుడు లేరు. చాలా మంచి వారు. ఇంతమంది పిల్లల ను బాగా చదివించి ప్రయోజకులను చేశారు.

మీరైనా కనుక్కొని, క్షేమం గా ఉంది, ఊళ్ళో పెద్ద కూతురు ధన వ్యామోహం లో పట్టించుకోకుండా ఉంటే, ఏదో ఒక కూతురు దగ్గర క్షేమంగా ఉంది అని అయినా చెప్పగలరు. మీకు పుణ్యం ఉంటుంది. వీలైతే వాట్సాప్ లో మాట్లాడించ గలరు.

మా పెద్ద అత్త కు, మా పెద మామయ్య కు, మా నాన్న అన్నా, నేను అన్నా వల్లమాలిన అభిమానం. ధనం పెరిగి, రెండవ అంతస్థు వచ్చినా కూడా, పిల్లల పెల్లిళ్ళు అయినాక కూడా, వాళ్ళు పాత ప్రేమాభిమానాలు, ఆప్యాయత బంధాలును వదలలేదు.

ఎక్కడ ఉన్నా పెద్ద అత్త, ఏసయ్య అండతో, యెహోవా రక్షణలో, క్షేమము గా గౌరవం గా, సొంత పిల్లల దగ్గర ఉందని భావిస్తున్నా. మీరు క్షేమ సమాచారం చెప్పిన, అమ్మకు తెలియపరచగలను. మీకు పుణ్యం కూడా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 06-Feb-2020, Upd Dt : 06-Feb-2020, Category : General
Views : 220 ( + More Social Media views ), Id : 319 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content