Arishadvarg- 6 Internal Mind Enemies/ Poisons- Kama, Krodha, Lobha, Mada, Moha, Matsarya - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,869; 104 తత్వాలు (Tatvaalu) and views 225,623.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

#Arishadvarg - 6 Internal #Mind #Enemies/ #Poisons - #Kama, #Krodha, #Lobha, #Mada, #Moha, #Matsarya Examples. We already read article about #Ashtavyasan/ #Saptavyasan.

అరిషడ్వర్గాలు - 6 అంతర్గత మానసిక శత్రువులు/ విషాలు - కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యా ఉదాహరణలు. అష్టవ్యసనాల/ సప్తవ్యసనాల సంగతి గత కధనములో చూసాము.

అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. అరిషడ్వర్గాలు అన్నది సరైన మాట కాదు, అరిషడ్వర్గము అనాలి. భారతీయ శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించే క్రమంలో తనలోని, ఈ 6 శతృవులను జయించాలి. ప్రాపంచిక మోహములో, కోరికలు గుర్రాలై పరుగులు తీస్తుంటాయి.

Arishadvarg means six internal enemies. According to Indian science, a human being must overcome these 6 enemies in himself in order to achieve salvation. In worldly lust, desires run like horses.

In Hindu theology, Arishadvarga or Shadripu/ Shada Ripu are the 6 enemies of the mind, which are: kama (desire), krodha (anger), lobha (greed), Mada (arrogance), moha (delusion), and matsarya (jealousy); the negative characteristics of which prevent man from attaining moksha.

కోరికలు - ఆ ఆనందం/ వస్తువు/ భవనం/ వాహనము/ ఆస్తి/ ఆభరణం/ దుస్తులు/ ధనం/ పదవి/ తిండి/ సౌకర్యం/భూమి/ వీసా/ వ్యాపారం/ భాగస్వామి/ సంతానం/ సినిమా/ టీవీ - ఒకటి/ చాలా/ అన్ని మాకు కావాలి.

Desires - That Happiness/ Object/ Building/ Vehicle/ Property/ Jewel/ Cloths/ Money/ Position/ Food/ Comfort/ Land/ Visa/ Business/ Partner/ Children/ Cinema/ TV - one/ many/ all we want.

1. కామ/ Lust - అవి ఎలాగైనా, ఏ దోవలోనైన పొందాలి. We should obtain them, at any cost in any way. మితిమీరిన ఏదైన కోరిక.
ఉదాహరణ - నరకాసురుడు, జరాసంధుడు అనేక స్త్రీలను, రాజులను చెఱపట్టి నశించుట.
Example - Narakasura and Jarasandha burned many women and kings and perished.

2. క్రోధ/ Anger - అవి అందనప్పుడు/ దూరమౌతున్నప్పుడు వచ్చు కోపము. Angry when they are not received/removed.
ఉదాహరణ - శిశుపాలుడు తాను వివాహమాడదలచిన రుక్మిణిని కృష్ణుడు వివాహమాడెనని కృష్ణునిపై క్రోధించి నశించుట.
Example - Sisupala gets angry with Krishna for marrying Rukmini whom he wanted to marry.

3. లోభ/ Greed, - అవి దొరికిన తర్వాత, ఇంక ఎవరితో పంచుకోము, మన కొక్కరికే. Once we get them, we don't share with anyone, for ourselves. పిసినారితనం లేదా స్వార్ధం.
ఉదాహరణ - దుర్యోధనుడు లోభము వలన నశించుట.
Example - Duryodhana perishes due to greed.

4. మోహ/ Attachment - అవి మనతోనే ఎల్లకాలము ఉండాలి. అవి లేకపోతే, బతకలేము. They should always be with us. Without them, we cannot live. ఆకర్షణ వలన కలిగే వలపు.
ఉదాహరణ - దశరథుడు కైక మీది మోహముచేత నశించుట.
Example - Dasharatha perishes in lust for Kaika.

5. మద/ Vanity/ Arrogance/ Pride - అవి మాకు మాత్రమే ఉన్నాయి, అందరి కన్నా మేము గొప్పవారమని, ఇతరులను చిన్న చూపు. They are only with us, We look down on others as we are superior. అహంకారం.
ఉదాహరణ - కార్తవీర్యుని పుత్రుల మదము వలన నశించుట.
Example - Destruction by the Arrogance of the sons of Kartaviryu.

6. మాత్సర్యం/ Envy/ Jealousy - అవి ఇతరులకే ఉన్నాయి, మాకు లేవు అని ఈర్ష ద్వేషం. Jealousy hates that others have them and we don't. ఈర్ష్య, అసూయ, మత్సరము, పగ.
ఉదాహరణ - శిశుపాలుడు కృష్ణుని వైభవము చూసి ఓర్వలేక, నశించుట.
Example - Sisupala could not bear to see Krishnas glory and perished.

ఇవేగాక అష్ట పాశములు/ Ashta pasha (8 fetters - mental limitations) కూడా ఉన్నాయి - 1.పక్షపాతం Ghrina (Hate), 2. శంక/ సంశయం/ Doubt, 3. భయము/ Fear, 4. లజ్జ/ మోహం/ Shame/ shyness, 5. జుగుప్స/ Deceit, 6. కులము/ caste/ Vanity of lineage, 7. శీలము/ Modesty/ Cultural Superiority Complex , 8. జాతి/ బలం/ మతము Race/Strength/Creed.

ఇంకో రకముగా 1. పశుపాశము, 2. భవపాశము, 3. బంధపాశము, 4. మోహపాశము, 5. ఆశాపాశము, 6. కర్మపాశము, 7. దుఃఖపాశము, 8. క్లేశపాశము.

ఈ అష్ట పాశముల చేత బంధీ అయిన మనిషి పశువుగా మారతాడు, కనుక ఆ మనిషిని పాలించే శివుడు పశుపతి అయ్యాడా! అని ఒక సందేహం.

A man bound by these Ashta pashams becomes an animal, so Lord Shiva who rules that man becomes Pasupathi?

నవ గోప్యాలు 9 Secrets - ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.

Nine things that should always be kept secret - Age/ Death time, wealth, house secret, guru mantra, sex/ meeting, charity, honor, humiliation, and medicine.

ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ఇవి మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది. మనిషి దుఃఖానికి ఇవి మొదటి కారణాలు.

These arishadvarg degrade man to any extent. These cause the downfall of man and destruction of nature. Those who have these will always have a selfish and narrow-minded mind. These are the first causes of mans sorrow.

అరిషడ్వర్గాలను జయిస్తే భగవంతుని తత్వం బోధపడుతుంది. ఇవే మహాత్ములలో ఉంటే లోక కల్యాణానికి కారణమవుతాయి.

If you conquer the Arishadvarg, the philosophy of God will be taught. If these are among the Mahatmas, they will cause the welfare of the world.

ఏ ఒక్కరిలోనూ ఈ అరిషడ్వర్గము పూర్తిగా లేకుండా పోదు. కొందరిలో కామం ఎక్కువ ఉంటే, ఇంకొందరిలో మదం, మరికొందరిలో మోహం ఎక్కువగా ఉండుండవచ్చు. కొందరు సత్పురుషులలో ఈ ఆరింటిలో కొన్ని అసలు లేనే లేకపోవచ్చు. లేదా అతి తక్కువ స్థాయిలో మాత్రమే ఉండవచ్చు.

అలానే, మనలో తక్కువగానో, నిద్రాణంగానో ఉన్న ఈ గుణాలు, సమయం వచ్చినప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో బయటపడవచ్చు. అంతవరకూ అవి మనలో ఉన్న విషయం కూడా మనకు తెలియకపోవచ్చు.

Also, these qualities, which are less or dormant in us, can emerge fully only when the time comes. We may not even know that they are in us.

ఒక వ్యక్తికి అధికారం వచ్చాక మాత్రమే, అతనిలో ఉన్న మదం విజృంభించవచ్చు. అలానే, తనతో పాటూ కలిసి తిరిగినవాడు తనకంటే గొప్పగా ఎదిగిపోయినప్పుడు మాత్రమే, అతనిలో ఉన్న మాత్సర్య గుణం బయటకు రావొచ్చు.

అదేవిధంగా మిగిలిన గుణాలు కూడా. ఏ గుణమైనా సరే ఉండవలసినదానికంటే ఎక్కువ ఉంటే అది వినాశనానికి దారితీస్తుందని చెప్పే శ్లోకం ఒకటుంది.

అతి దానాత్ హతః కర్ణః, అతి లోభాత్ సుయోధనః
అతి కామాత్ దశగ్రీవో, అతి సర్వత్ర వర్జయేత్.

అతిగా దానం చేసి, అంటే తన కవచకుండలాలను కూడా ఇచ్చివేసి కర్ణుడు, అతిగా లోభానికి పోయి, అంటే కనీసం అయిదూళ్ళు ఇచ్చి రాజీ చేసుకునే అవకాశం ఉన్నా, సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పి యుద్ధానికి వెళ్ళిన దుర్యోధనుడు, విపరీతమైన కామం వలన, అంటే పరకాంతను పొందాలనే కోరికతో రావణాసురుడు, వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. కనుక అతి అన్నది ఎల్లప్పుడూ విడిచిపెట్టవలసినదే అన్నది ఈ శ్లోక భావం.

న కశ్చిత్ కస్యచిత్ మిత్రం, న కశ్చిత్ కస్యచిత్ రిపుః।
వ్యవహారేణ జాయంతే, మిత్రాణి రపవస్తథా॥

అని అన్నారు మనవాళ్లు. ఎవరూ ఎవరికీ మిత్రులు కారు. ఎవరూ ఎవరికీ శత్రువులూ కారు. ఒకరితో ఒకరు లావాదేవీ పెట్టుకునే విధానాన్ని బట్టి మిత్రులూ శత్రువులూ తయారవుతారు. అటువంటిది ఈ 6 అందరు మనుషులకీ భేదభావం లేకుండా శత్రువులయ్యాయి. ఏమిటి ఇవి చేసిన అపకారం అంటే, ఒకటే - మనిషి కన్ను కప్పడం. ఈ కన్ను భౌతికమైన కన్ను కాదు. బౌద్ధికమైన కన్ను. అంటే, మనిషిలో ఉన్నదీ, మిగిలిన జంతువులలో లేనిదీ అయిన జ్ఞానం. వివేచన. విచక్షణ.

మనిషి జ్ఞానంలో ఇటుకలవంటివైన ఈ భాగాలే అదుపుతప్పినపుడు అదే మనిషిని దిగజార్చడం విచిత్రం.

కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః।
జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత॥  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,869; 104 తత్వాలు (Tatvaalu) and views 225,623
Dt : 08-Nov-2022, Upd Dt : 08-Nov-2022, Category : Devotional
Views : 1354 ( + More Social Media views ), Id : 60 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : arishadvarg , internal , mind , enemies , poisons , examples , kama , krodha , lobha , Mada , moha , matsarya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు