Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. సొంత పిల్లలకు ఆస్తులు ఇచ్చినా కదా, మరి ముదుసలి తల్లి ని చూస్తున్న పక్కింటి పిల్లలకు ఏదైనా బహుమతి ఇవ్వాలని, నాయుడు బాబాయి కుటుంబం ఎంతో మధనపడి, తన ఉత్తమ సంస్కార భరిత మంచి పెద్ద మనసుతో వయస్సు అనుభవము తో, పది ఏళ్లుగా ఉచిత చెత్త ను, వద్దు అన్నా బలవంతముగా ఇచ్చి, తప్పు అని చెప్పినా కూడా, మొహమాటం సానుభూతి పాపభీతి లేకుండా, ఎంత పుణ్యం సంపాదిస్తున్నారో కదా?
మనం లేదా అద్దె వారు, పొరపాటున చెత్త వేస్తే లేదా గాలికి వెళ్లినా పడినా మన చెట్టు ఆకులు, మరలా పడకుండా ఆపుతాం లేదా, చెపితే సిగ్గుతో తీస్తాం తీపిస్తాం, మంచి వారు ఎవరన్నా చూసినా ఊస్తారు అని భయపడతాం. ఇది అన్యాయం అక్రమం అని, మంచి సంస్కార మనసు కు, సొంతంగా అర్థం అవుతుంది. మాకు తెలీదు, అని బాధ్యత రాహిత్యం గా, తప్పించుకోము.
కానీ ఏళ్ళు కొనసాగించాలి, అదే తప్పు ను, అదే పద్దతి ని, నిస్సిగ్గుగా ఆపకుండా ఎత్తించకుండా కొనసాగిస్తున్నాము అంటే, ఎంతో సాంప్రదాయం దయ మంచితనం సంస్కారం ఉండాలి.
ఇన్ని ఏళ్ళు, ఫోటోలు సాక్ష్యం గా చూసి కూడా, బాధ్యత గల ఉత్తములు గా, మీరనేది ఒకటే మాట కదూ ఈ కింది విధముగా?
పదేళ్లు చెత్త వేయించుకోవడం అలవాటు పడికూడా, ఇప్పుడు కైనా అలవాటు తో ఆనందించక, బాబాయి బాగు పడాలి మారాలి దైవం అండ రావాలని, కోరుకోవడం బుద్ధి తక్కువ పని అనేగా, నోరు మూసుకుని కూర్చో అనేగదా?
మన బజారు లో అంత కన్నా ఎక్కువ ఉత్తములు ఉన్నారు, పావనమైన నేల అనేగా? పక్కన బండి పెట్టనిదే చెత్త వేయనిదే, పాపపు అన్నం దిగదు అనేగా?
ఉత్తములకే ఉత్తములు, స్నేహితులు బంధువులు అవుతారు. అందుకే ఎప్పుడో ఫోన్ వాట్సాప్ ఆపారు మంచి మాటల తలనొప్పితో.
ధర్మం కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటే ఇదే కదూ? మనందరం దైవ భక్తులమే, కాల చక్రం, మన దగ్గరకు వస్తుంది లే, కాస్త లేటు అయినా.
చెత్త గురించి సమస్య కాదు, వారికి బుద్ది లేకపోయినా మనకు ఉంది కాబట్టి 500 పెట్టి 4 నెలలకు, పదేళ్ళు గా తీయిస్తున్నాము కదా. చివరి దశలో అయినా కరోనా తర్వాత అయినా, మన బాబాయి కుటుంబం మారకపోతే, తప్పు తెలుసు కోకపోతే, పుణ్యం ఎలా వస్తుంది? సద్గతులు ఎలా వస్తాయి, అనేదే బాధ.
రోజూ వారి ని కలిసే చూసే వారిలో, ఉత్తములు ప్రహ్లాదులు లేకపోయినా, కనీసం సద్గుణ సంపన్నులు అయిన కొడుకు మరియు అల్లుడు అయినా, తండ్రి మరియు మామ మంచి కోరి, హితము బుద్ది చెప్పరా?
మామ గారు గతంలో తప్పులు తప్పుడు సంపాదన గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంత సంపాదించాము. కొడుకు కు, నాకు రెండు చేతులతో, సంపాదన ఉంది కదా. ఇంకా ఊరి గ్రామ పంచాయతీ స్ధలం కబ్జా లో, మన షాప్ ఎందుకు?
పంచాయతీ అంటే పన్నులు కట్టే జనం అందరూ, మన కుటుంబం కు, స్ధలం మరియు అద్దె దానం చేస్తున్నారు, అన్న చెడ్డ పేరు ఎందుకు, అంత చెడ్డ బతుకు ఇంకా అవసరమా?
అప్పుడు మేమిద్దరం, సంస్కార మంచి పెంపకం లేక, ఈ ముదుసలి వయస్సులో, మీకు ధనం ఇవ్వక మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ, పంచాయతీ కబ్జా మీద బతకమని, ఊరిమీద వదిలేసినట్టే కదా? జనం ముందు, మమ్మల్ని కూడా తప్పుడు నీతిలేని వారిగా నిలబెడుతున్నావు, నీ చేష్టలతో.
పండక్కి కొడుకు అల్లుడు ఇంటికి ఆనందముగా వస్తే, మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి, ఇంటి ముందు కారు పెట్టుకుని, దర్జాగా దిగలేక, పక్కన కొంపల దగ్గర, పంచాయతీ రోడ్డు మీద, ఎక్కడ నో దూరంగా ఆపే, దరిద్రపు పీనాసితనం అవసరమా?
మనది కబ్జా కొట్టు అని తెలిసీ, నీతిలేని వారు ఎగబడి అద్దెకు తీసుకుంటారు, అదే పాపపు ఆలోచన లతో, మన పాపం పంచుకోవడానికి. ఇక అక్కడనే కొనే, వారి ఖర్మ, వారే రాసుకుంటారు. ఇలాంటి వారంతా, దేవాలయ ధర్మ కర్తలు అయితే, ఎలా ఉంటుంది? ధర్మము 100 గ్రాములతో కుంటదా?
మన ఆకులు అటెందుకు పడాలి, చిన్న చెట్టు పెట్టుకో, మన ఆనందం ఇంకొకరికి శాపమై, మనకు పాప భారం కావాలా? లేదా వారి అనుమతి తో, రోజూ అక్కడ చిమ్మించు. మనవైపు సందులో మాత్రమే, చెత్త ఉంటే ఖాళీ ఇంటికి, ఏ ఇంగితం ఉన్న వారైనా, మన ఇంట్లో పదిమంది అద్దెవారు లేదా వారి స్నేహితులు వేస్తారు వెశారు, అని తెలుసుకోలేరా? పోనీ పదేళ్ళు గా, బయట నుంచి వచ్చి, మన ఇంటి వైపు నుంచి, వేసే దొంగను మనం పట్టుకున్నామా?
ఏంది మామయ్య తల కొట్టేసినట్టు ఉంది, మీ ఇంటికి రావాలంటే, ఇకనైనా కబ్జా వద్దు, మన పుణ్య సంపాదన ఇంటి ముందు కారు దిగి, మన వాకిట్లో పార్క్ చేద్దాం, అని చెప్పే ఉత్తమ సంస్కార ప్రహ్లాదులు ఉన్నారా? వారి పిల్లలు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు లో ఎక్కడ అయినా?
భగవంతుడా, మా బాబాయి కి చివరి దశలో అయినా, మంచి బుద్ధి జాలి దయ కరుణ దైవభీతి కలిగించు, మంచి క్షేమం కోరే స్నేహితులు ను ఇవ్వాలని, ప్రార్థనలు చేయడం తప్ప, ఏమి చేయగలము.
అద్దెకు ఉన్న అక్క గారి మీదకే బాబాయి, కొడుకు, మనవడు ముగ్గురు వెళ్ళారు దూకుడు గా, ఉత్తమ సంస్కారం తో. అలాగే బ్రాహ్మల షాపు మీదకు అడ్రెస్స్ చెప్పి మరీ పంపారు కదూ.
పాపం శమించుగాక, అని రాము గోపీతో తన గోడు వెళ్ళబోశాడు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,393,305; 104 తత్వాలు (Tatvaalu) and views 258,734 Dt : 22-Feb-2021, Upd Dt : 22-Feb-2021, Category : General
Views : 1009
( + More Social Media views ), Id : 985 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
son ,
son in law ,
left ,
parents ,
village folks grace ,
no support ,
teach ,
money ,
dust uncle ,
babai Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments