కల నిజం చేసే, జగన్ ఉప్పు తిన్న, కృతజ్ఞతల ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహా దారులు ఉన్నారా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,240; 104 తత్వాలు (Tatvaalu) and views 217,392.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రాత్రి కలవచ్చింది, వైసీపీ పార్టీ పెద్దలు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు, భవిష్యత్తు గురించి, నవరత్నాలు అమలు, కరోనా జాగ్రత్తలు గురించి. కలెక్టర్ నివేదికలు, మీటింగ్ లు లో అంతా ఓకే అంటున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం లో, అదే డ్రామా ఇలాగే నడచింది, అందరూ అంతా ఓకే అద్భుతం అన్నారు, కానీ అంతా ఘోరముగా ఫెయిల్ అయింది, ఎవరూ సరిగ్గా గ్రౌండ్ లెవల్ అంచనా వేయలేకపోయారు.

మరి జనం ఫలాలు అందడం, కరోనా సదుపాయాలు అందడము లేదంటున్నారు. మరి గ్రౌండ్ లెవల్ నుంచి రిపోర్టు లు తెచ్చుకుని, పాలనను సరిచేయడం ఎలా? కొత్త మార్పు ఎలా తేవాలి.

రేయి అనక, పగలు అనక, జగన్ రోడ్లు వెంట మైళ్ళ దూరం నడిస్తే, జనం లో చెమటోడ్చి కాళ్ళు కందేలా తిరిగితే, ఇప్పుడు మనం ఆయన పేరు చెప్పుకుని, ఆయన ఉప్పు తింటూ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, సలహా దారుల పోస్టులు, తీసుకుని హాయిగా ఉన్నాము.

గత ప్రభుత్వం లో కూడా మనలాగ నే, చంద్రబాబు గారి దగ్గర కూడా, ఇలాంటి పదవులు దర్జాలు అనుభవించిన, వారి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాము. వచ్చే 4 ఏళ్ల తర్వాత, మరలా అలా ఉండకూడదు మనము. మరి జగన్ ఉప్పు తింటూ క్రుతజ్ఞత తో, మనం కూడా బుర్ర ఉపయోగించి, జగన్ కు మంచి చేసి బహుమతి ఇచ్చి, చంద్రబాబు గారు నాడు చేయలేని పని, మనము చేద్దాం. ఏం పని చేయాలి, అని తీవ్రముగా ఆలోచన చేయసాగారు.

నేను ఎక్కడో చదివాను ఓ విలేఖరి మాటలు, మనకు ఉపయోగమే కదా, అవి ఆలోచన చేస్తే, చేయడమూ తేలికే. పంచాయతీ ఈవో, మండల ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సై సీఐ, గ్రామ పట్టణ హెల్త్ ఆఫీసర్లు, ఆర్డీవో లేదా డివిజన్ అధికారులు, జిల్లా అధికారుల తో, సోషల్ మీడియాలలో రోజు తమ సేవలను పధకాల అమలు ను ఫోటో, వీడియో, మాటలతో పెట్టమందాం.

ఇది చంద్రన్న చేయలేక పోయారు. జగనన్న కు, ఆ దమ్ము ధైర్యం ఉంది. ఇది ఉభయ కుశలోపరి. అటు ప్రజలకు ఉపయోగం, ఇటు పార్టీ కి, మనకు ఉపయోగం.

ప్రజలు ఎక్కడ కక్కడ పధకాల, అమలు నిలదీస్తారు, ఫోటో సాక్ష్యం తో. కార్యక్రమంలో పాల్గొనేది, మన 150 ఎమ్మెల్యేలు నే గదా. మనకీ తగినంత ప్రచారం పబ్లిసిటీ అధికారుల వైపు నుంచి.

ఇంత మంచి విషయాన్ని, చంద్రన్న ఎలా వదిలేశారు? కేవలము కొంత మంది కలెక్టర్లు అధికారు లు మాత్రమే అమలు చేసారు నాడు. పధకాల సమాచారం జనం కు చేరి, అధికారులు ను నిలదీసి, సక్రమంగా పనిచేయించిన, అదే గదా ప్రభుత్వమునకు మరియు జగన్ కు మనమిచ్చే బహుమతి, కృతజ్ఞత, ఆయన ఉప్పు తింటున్నందుకు, మన భవిష్యత్ బాగుండేందుకు.

రేపు మంత్రులు తో చెపుదాము, ప్రభుత్వ అధికారులు తో మాట్లాడమని. కలెక్టర్ నుంచి ప్రతి గ్రామ గ్రామానికి, ఈ సమాచారం చేరాలి. వాలంటీర్ వ్యవస్థ కూడా చేతిలో ఉంది, రోజూ ఓ అరగంట సోషల్ మీడియాలో, సమాచారం పెట్టమందాం.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కు లాభమే కదా, వారికి కూడా ప్రచారం. అందరికీ ఉపయోగం.

రేయ్, తెల్లవారు ఝామున 4.30 అయింది లే, యోగా చేయాలి, అని అమ్మ పిలుపు, లేటు చేస్తే గ్లాస్ నీళ్ళు పడతాయి, వామ్మో.

మరి ఈ కల నిజం చేసే, జగన్ ఉప్పు తిన్న, కృతజ్ఞతలు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహా దారులు, అభిమానులు ఉన్నారా? రాబోయే రోజుల్లో చూద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,240; 104 తత్వాలు (Tatvaalu) and views 217,392
Dt : 29-Jul-2020, Upd Dt : 29-Jul-2020, Category : Politics
Views : 710 ( + More Social Media views ), Id : 621 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , mlas , mps , advisers , followers , jagan , dream , true
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content