నియోజక వర్గములో అభివ్రుద్ది గురించి, సవాళ్ళు విసరండి, ఇదుగో ఇలాంటి విషయాలలో - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1161 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1190 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రాష్ట్రములో పెరిగిపోతున్న సవాళ్ళు ప్రతిసవాళ్ళు, దేవుని ఎదుట ప్రమాణాలు, ఊరికి లేదా ఇంటికి వచ్చి కొడతాము, అక్కడ లేకపోతే మీ మీదే కేసు, మేము రాకుండా మీరు వచ్చినా ఇంకో కేసు, మమ్మల్ని ఒకటి అంటే మేము రెండు, మీ ఇద్దరూ చాలెంజ్ చేసుకుంటే మధ్యలో మేము ఇద్దరము కూడా వచ్చి మా వారితో కలుస్తాము, అన్నా పడాలి అన్న విపరీత ధోరణి పెరిగిపోతూ ఉంది.

ఆఖరికి బుద్ది చెప్పాల్సిన పెద్దలు కూడా, వారు ఎందుకు మా వాడిని రెచ్చగొట్టాలి, ఏదో సరదాకి మా వాడు 2 తిడితే పడి ఉండాలి, మరలా ఎదురు 2 తిట్టారు, ఇప్పుడు మా వాడు 4 తిడతారు, ఏమి చేద్దాము ఎదురు తిరిగి తిట్టింది రెచ్చగొట్టింది మీరు.

ఇంక అవతల వారు, ఏదో మాట్లాడారు వారి పాపాన పోతారు అని మంచిగా మాట్లడకుండా, వీరు పోటీకి దిగుతున్నారు. ఈ రోజు మీరు తంతే, రేపు వారూ తంతారు, ఇదేనా మనకు కావాల్సింది?

ఇక మీడియా, సరే వారో చెత్త విధముగా అరుచుకుంటుంటే, ఇంకో 3 సార్లు స్ర్కోల్లింగ్ వేస్తూ ఇలా తిట్టారు అలా తిట్టారు అని చూపిస్తున్నారు.

పెద్దలూ, అనుభవజ్ఞులూ, ఆలోచన చెయ్యండి, మీ పిల్లలూ మా పిల్లలూ వింటున్నారు. ఇప్పుడు విమర్శలు అంటే, ఒక స్టాండర్డ్ కి వచ్చాము, కొడాలి స్థాయిలో ఉండాలి అని. లేకపోతే ఎవరికీ ఆనడము లేదు. రాబోయే కాలములో డిబేట్లకు విమర్శలకు ఎంత నీచ స్థాయిలోకి దిగాలో అంత వరకు దిగుతున్నాము.

వీటిమీద కాదు, పోటీలు ఉండాల్సింది, మీ నియోజక వర్గములో అభివ్రుద్ది గురించి చూపించండి. సవాళ్ళు వాటి మీద విసరండి. ఇదుగో ఇలాంటి విషయాలలో -

* ఒక ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి లా, తెలంగాణా సీతక్క లా, ప్రజలతో రోజూ కలవండి, వారి ఇళ్ళకు పోండి.

* ఇలా గట్టిగా అరచిన వారు ఎవరూ, ఇప్పుడు లేదా ఎప్పుడూ ప్రశాంతముగా లేరు. చూసారు కదా, రోజమ్మ ఎలా బాధపడుతున్నారో, విలువ లేదు ఇప్పుడు అని.

* మీ అస్సెంబ్లీకి జిల్లా శాఖలు తేవడము లో పోటీలు పడండి.

* మీ ప్రభుత్వ ఆసుపత్రి లో లోపాలు సరిచేయడానికి లేదా వ్యవస్థలో తప్పులు సరిచేయడానికి సవాళ్ళు విసరండి అదీ మంచి పదాలతో.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1190 General Articles, 47 Tatvaalu
Dt : 19-Jan-2021, Upd Dt : 19-Jan-2021, Category : Politics
Views : 155 ( + More Social Media views ), Id : 932 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ap , leaders , throw , challenges , development , hospital , school , constituency , uma , kodali , vamsee
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content