అన్నమయ్య - అదివో అల్లదివో శ్రీ హరి వాసము - నాగార్జున, సుమన్, రమ్య కృష్ణ, కీరవాణి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,525; 104 తత్వాలు (Tatvaalu) and views 266,161.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అదివో అల్లదివో, కలియుగ ఆ శ్రీ హరి వాసము అని, భక్తితో ప్రపంచము నలుమూలలా ఉన్న ఎందరో భక్తులు, ఆర్తిగా క్షణకాల దర్శనమునకై, బారులు తీరి ఉన్నారు, తిరుపతి తిరుమలలో అని మనకు తెలుసు.

మనము కూడా, ఏదో ఒక సమయములో వెళ్ళడం, మోహం విడుస్తున్నాము అన్న గుర్తుకు, తల నీలాల మొక్కుగా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో విధాలుగా ఎంతో మంది, ఆ హరిని కీర్తించి చిత్తశుద్దితో, కైవల్యధామం చేరుకున్నారు.

మనము కూడా, శ్రీవారి భక్తుడు బావాజీ వలనే, దైవ గుణములు అలవాటు చేసుకుని ఆచరిస్తూ, అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించి, భగవద్గీత లో చెప్పిన సమతా స్థితిని సాధించినట్లయితే, ఆ దేవ దేవుడు కూడా, మన వద్దకు వచ్చి పాచికలు ఆడతారు. ముందు మనలో దైవాన్ని నిలుపుకుని, దైవ గుణాలను ఆచరించాలి.

మరి కనీసం 30 ఏళ్ళ తర్వాత అయినా, ఆ స్తితికి మనము చేరుకోగలమా? 60 ఏళ్ళ దాకా కూడా, ఆ స్తితికి చేరుకోలేక పోతే, మనసు నిలబడదు, శరీరం సహకరించదు సాధనకు, మరు జన్మలో ఇవే కష్టాలతో, ఇంకా ఎంతో కఠిన సాధన చెయ్యాలి అంటారు పెద్దలు.

అదివో.. అల్లదివో.., శ్రీ హరి వాసము..
పదివేలు శేషుల, పడగల మయము.. ||

అదె వేంకటా.చల మఖిలో.న్నతము
అదివో బ్రహ్మా.దుల కపురూ.పము |
అదివో నిత్యనివాస, మఖిల మునులకు..2
అదె చూడుడు, డదె మొక్కుడు, డానందమయము 2 ||అదివో||

చెంగట నదివో, శేషాచలమూ
నింగి నున్న, దేవతల నిజవాసము |
ముంగిట నల్లదివో, మూలనున్న ధనము..
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము || ||అదివో||

కైవల్య పదము, వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది |
భావింప సకల, సంపద రూపమదివో . . .2
పావనముల కెల్ల, పావన మయమూ ..||అదివో||

Annamayya, Adivo Alladivo Sri hari vasamu, Nagarjuna, Suman, Ramya Krishna, Keeravani  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,525; 104 తత్వాలు (Tatvaalu) and views 266,161
Dt : 09-Oct-2022, Upd Dt : 09-Oct-2022, Category : Songs
Views : 571 ( + More Social Media views ), Id : 1576 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : annamayya , adivo , alladivo , srihari , vasamu , nagarjuna , suman , ramyakrishna , keeravani
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content